హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| YS Jagan: జగన్ ఇచ్చిన ఛాన్స్ కేసీఆర్ ఇచ్చే అవకాశం లేదా ?.. టీఆర్ఎస్‌లో చర్చ

KCR| YS Jagan: జగన్ ఇచ్చిన ఛాన్స్ కేసీఆర్ ఇచ్చే అవకాశం లేదా ?.. టీఆర్ఎస్‌లో చర్చ

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana News: కొందరు ఈ విషయంలో సొంత సర్వేలు చేయించుకుని మరీ ముందుకు సాగుతున్నా.. అధిష్టానం చేయిస్తున్న సర్వేలో తమ పరిస్థితి ఏమిటనే టెన్షన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

  ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోకస్ చేస్తుండటంతో.. తన సారథ్యంలోని టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ (KCR) రాజకీయ పార్టీ విస్తరణ ఆలోచన ఎలా ఉన్నా.. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఒక చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల పీకే సర్వే ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు. సర్వేలో మెరుగైన పనితీరు లేదని వచ్చిన వారిని పక్కనపెట్టేస్తారని కేటీఆర్ (KTR) స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్‌లోని అనేకమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టింది. అయితే ఇదే రకంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కూడా ఇటీవల తన ఎమ్మెల్యేలు, మంత్రులతో వ్యాఖ్యానించారు.

  ఎవరెవరి పరిస్థితి ఏ రకంగా ఉందనే రిపోర్టులను కూడా ఆయన వారి ముందు ఉంచారు. ఎన్నికల నాటికి పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని.. లేకపోతే ఎవరికైనా టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదని సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఈ రకమైన రిపోర్టులు, అవకాశాలు కూడా ఇచ్చే అవకాశం లేదేమో అని చర్చ జరుగుతోంది. గతంలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందనే దానిపై సీఎం కేసీఆర్ కనీసం 6 నెలలకు ఒకసారైనా వారికి ప్రొగ్రెస్ కార్డు ఇచ్చేవారు.

  ఆ రిపోర్టుల ఆధారంగా ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన నివేదికలతో అప్రమత్తమైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ కొంతకాలంగా సీఎం కేసీఆర్ అలా చేయడం లేదు. రాస్ట్రంలో పరిస్థితి మారడంతో.. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను పక్కనపెట్టడమే బెటరనే ఉద్దేశ్యంతో గులాబీ బాస్ ఉన్నారనే చర్చ సాగుతోంది. అయితే తమ పరిస్థితి ఎలా ఉందనే దానిపై వివరాలు ఇస్తే.. ప్రజల్లోకి వెళ్లి తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని చాలామంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

  KCR| Andhra Pradesh: ఏపీలో కొత్త పంచాయతీ పెట్టనున్న కేసీఆర్ ?

  KCR New Strategy: జాతీయ పార్టీపై కేసీఆర్ లెక్కేంటి ?... బీజేపీకి అలా కౌంటర్ ఇస్తారా ?

  కొందరు ఈ విషయంలో సొంత సర్వేలు చేయించుకుని మరీ ముందుకు సాగుతున్నా.. అధిష్టానం చేయిస్తున్న సర్వేలో తమ పరిస్థితి ఏమిటనే టెన్షన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కొందరు పార్టీ అధినాయకత్వానికి సన్నిహితంగా ఉండే నేతల ద్వారా తమ పనితీరుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. కొందరైతే.. తమ నియోజకవర్గంలో తమ కంటే బెటర్ ఛాయిస్‌గా అధిష్టానం ఎవరిని భావిస్తోందనే దానిపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్... తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్ ఇచ్చినట్టుగా ఛాన్స్ కూడా ఇచ్చే అవకాశం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, CM KCR, Telangana

  ఉత్తమ కథలు