Home /News /telangana /

TS POLITICS TRS PRESIDENT AND TELANGANA CM KCR DEEPLY THINKING OF FORMING BRS PARTY MAINLY TWO ISSUES IN MIND AK

TRS| BRS: బీఆర్ఎస్‌పై టీఆర్ఎస్ తర్జనభర్జన.. అసలు కారణం అదేనా ? తేడా వస్తే..

సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

KCR| BRS: ఒకవేళ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌ను మారిస్తే.. ఎన్నికల గుర్తు విషయంలో ఏమైనా తేడా జరుగుతుందా ? అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ విషయంలో ఎన్నికల సంఘం నియమాలను టీఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది.

    తెలంగాణ రాష్ట్రసమితి(టీఆర్ఎస్)ను భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్‌)గా మార్చాలని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన అతి త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నారని.. దీని ద్వారానే ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు వ్యూహరచన చేశారని ప్రచారం సాగుతోంది. అయితే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా(BRS) మార్చే విషయంలో ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోందని కొందరు చర్చించుకుంటున్నారు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో మొదటిది.. ప్రాధానమైనది టీఆర్ఎస్(TRS) ఎన్నికల గుర్తు అయిన కారు గుర్తు. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారు గుర్తు తెలంగాణ ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. కారు గుర్తు మీద ఓటేసే ప్రజల సంఖ్య తెలంగాణలో గణనీయంగా ఉంది.

    ఒకవేళ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌ను మారిస్తే.. ఎన్నికల గుర్తు విషయంలో ఏమైనా తేడా జరుగుతుందా ? అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ విషయంలో ఎన్నికల సంఘం నియమాలను టీఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది. అయితే ఏ కారణం వల్ల అయినా ఈ గుర్తు విషయంలో ఇబ్బంది వస్తే.. దేశ రాజకీయాల్లో రాణించడం మాట అటుంచితే తెలంగాణలో టీఆర్ఎస్ భారీగా నష్టపోవాల్సి వస్తుందన్నది ఆ పార్టీ భావనగా తెలుస్తోంది. అందుకే గుర్తు విషయంలో పూర్తిగా క్లారిటీ వచ్చిన తరువాతే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం లేదా బీఆర్ఎస్‌ను స్థాపించి టీఆర్ఎస్‌ను అందులో విలీనం చేయడం వంటి విషయాల్లో ముందుకు సాగాలనే యోచనలో గులాబీ పార్టీ ఉందని సమాచారం.



    ఇక టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ప్రజల్లో తెలంగాణ పార్టీ అనే గుర్తింపు ఉంది. ఇప్పటికీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో టీఆర్ఎస్‌ను తెలంగాణ పార్టీ అని అంటుంటారు. ఒకవేళ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారిస్తే.. ఈ విషయంలోనూ ఇబ్బందులు రావొచ్చనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోందని సమాచారం. అయితే సీఎం కేసీఆర్ ఇప్పటికే ఈ అంశాలపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నాయని.. దీనిపై న్యాయనిపుణులతో కూడా మాట్లాడుతున్నారని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

    KCR: కీలక భేటీకి దూరంగా కేసీఆర్.. ఆ కారణం నిజం కాదా ? పక్కా క్లారిటీతోనే ఉన్నారా ?

    KCR| YS Jagan: వైఎస్ జగన్ బాటలో కేసీఆర్.. ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేలా కొత్త ప్లాన్..

    ఇలాంటి విషయాల్లో పూర్తి క్లారిటీ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో కీలక నిర్ణయం తీసుకుని ముందుకు సాగే అవకాశం ఉందని.. లేని పక్షంలో ఈ విషయంలో ఆయన మరిన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించే అవకాశం లేకపోలేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో సీరియస్‌గా ఉన్న కేసీఆర్.. ఈ విషయంలో కాస్త ఆలస్యమైనా పూర్తి క్లారిటీతోనే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు