హోమ్ /వార్తలు /తెలంగాణ /

Congress Vs BJP Vs TRS: కాంగ్రెస్, బీజేపీలకు టీఆర్ఎస్ బిగ్ కౌంటర్‌.. ప్లేస్ కూడా ఫిక్స్ ?

Congress Vs BJP Vs TRS: కాంగ్రెస్, బీజేపీలకు టీఆర్ఎస్ బిగ్ కౌంటర్‌.. ప్లేస్ కూడా ఫిక్స్ ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana Politics: రాహుల్ గాంధీ వరంగల్‌లో పర్యటించారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఉత్సాహం వచ్చింది. ఇక కాంగ్రెస్ సభను మించి తమ సభ ఉండేలా బీజేపీ ప్లాన్ చేసింది.

తెలంగాణలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే రాజకీయ పార్టీలు మాత్రం త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయన్నట్టుగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణలోనూ అధికారం సొంతం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీ.. రాష్ట్రంలో తమకు లభించిన పలు విజయాలను మెట్లుగా మలుచుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో విజయం సాధించేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఈ విషయంలో ఆ పార్టీ బాగానే సక్సెస్ అయ్యింది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు(TRS) తామే ప్రత్యామ్నాయం అనే స్థాయికి ఎదిగింది. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా తమనే టార్గెట్ చేసే రేంజ్‌కు తెలంగాణలో బీజేపీ(BJP) ఎదిగిపోయింది. మరోవైపు తెలంగాణలో తాము కోల్పోతున్న పట్టును తిరిగి సాధించేందుకు కాంగ్రెస్ రేసు మొదలుపెట్టింది.

ఇందులో భాగంగానే ఇటీవల రాహుల్ గాంధీ(Rahul Gandhi) వరంగల్‌లో పర్యటించారు. వరంగల్‌లో(Warangal) ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఉత్సాహం వచ్చింది. ఇక కాంగ్రెస్ సభను మించి తమ సభ ఉండేలా బీజేపీ (BJP) ప్లాన్ చేసింది. ఈ నెల 14న అమిత్ షా హాజరుకాబోయే సభను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అది సక్సెస్ సాధిస్తే.. కాంగ్రెస్‌పై పైచేయి సాధించినట్టు అవుతుందని భావిస్తోంది. ఇక ఈ రెండు పార్టీల బహిరంగ సభలు ముగిసిన తరువాత తమదైన స్టయిల్లో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనే యోచనలో అధికార టీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలోని చెన్నూరులో నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చెన్నూరు నియోజకవర్గంలో ఓ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడంతో పాటు మరో ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇదే సందర్భంగా ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్, బీజేపీ సభకు కౌంటర్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

Revanth Reddy: రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారా ?.. వాళ్లందరికీ ఊహించని షాక్ ఇచ్చారా ?

TS Politics: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్త పార్టీ ఆలోచనలో ఉన్నారా ?.. ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ?

అన్నీ అనుకున్నట్టు జరిగితే మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ఈ భారీ బహిరంగ సభ ఉండొచ్చని టీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నాయి. టీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిర్వహించబోయే ఈ సభ ద్వారా తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరిగే అవకాశం ఉందని.. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమదైన శైలిలో కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే.. తెలంగాణలో భారీ బహిరంగ సభల సీజన్ మొదలైనట్టు కనిపిస్తోంది.

First published:

Tags: Telangana, Trs

ఉత్తమ కథలు