రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది టీఆర్ఎస్. తమకు దక్కబోయే రెండు స్థానాలతో పాటు బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన మరో స్థానానికి కలిపి మొత్తం ముగ్గురు అభ్యర్థులను ఫైనల్ చేసింది. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథిరెడ్డి,(Parthasarathy Reddy) నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు, (Damodar Rao)వద్దిరాజు రవిచంద్రలను(Vaddiraju RaviChandra) పెద్దల సభకు పంపాలని నిర్ణయించింది. అయితే వీరిలో బండ ప్రకాశ్ రాజీనామా కారణంగా ఖాళీ అయిన స్థానానికి ఎవరు నామినేషన్ దాఖలు చేస్తారన్నది మరికాసేపట్లో తేలనుంది. బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానం పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉండటంతో.. ఈ స్థానానికి ఎవరు నామినేషన్ వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే బీసీ సామాజికవర్గానికి చెందిన బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి అదే సామాజికవర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర(గాయిత్రి రవి) నామినేషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రెండేళ్ల పదవీకాలం ఉండే స్థానానికి దామోదర్ రావును ఎంపిక చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్, బండ ప్రకాశ్ స్థానంతో ఖాళీ అయిన ఈ స్థానాలకు బండి పార్థసారిథిరెడ్డి, దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర పేర్లను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. మొత్తంగా ఈ స్థానాలకు ఇద్దరు ఓసీ, ఒక బీసీ అభ్యర్థిని ఎంపిక చేశారు.
ఈ మూడు స్థానాలకు సంబంధించి అనేక పేర్లను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి, దామోదర్ రావు పేర్లు రాజ్యసభకు ఖరారు చేయడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్‌కు మొదటి నుంచి సానుభూతిపరుడుగా ఉన్న పారిశ్రామికవేత్త పార్థసారథిరెడ్డిని రాజ్యసభకు పంపాలని సీఎం కేసీఆర్ గతంలో కూడా భావించారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో ఇప్పుడు కేసీఆర్ ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు దామోదర్ రావు.
TS| KA PAUL:తెలంగాణలో కేఏ పాల్ పాదయాత్ర..సెంటిమెంట్‌గా అక్కడి నుంచే ప్రారంభం..?
ప్రస్తుతం దామోదర్ రావు నమస్తే తెలంగాణ పత్రికకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈయనను కూడా గతంలోనే రాజ్యసభకు ఎంపిక చేయాలని కేసీఆర్ భావించారు. కానీ అప్పుడు కుదరకపోవడంతో ఈసారి అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఇక గతంలో కాంగ్రెస్‌లో ఉండి కొన్నేళ్ల క్రితం టీఆర్ఎస్‌లో చేరిన వద్దిరాజు రవిచంద్ర(గాయిత్రి రవి)కి కేసీఆర్ రాజ్యసభ ఛాన్స్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్రను కేసీఆర్ రాజ్యసభకు ఎంపిక చేశారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajya Sabha, Telangana