హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS MP Santhoshkumar : నేనెక్కడికి వెళ్లలేదు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నా .. తప్పుడు ప్రచారంపై ఎంపీ సంతోష్‌ రియాక్షన్

TRS MP Santhoshkumar : నేనెక్కడికి వెళ్లలేదు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నా .. తప్పుడు ప్రచారంపై ఎంపీ సంతోష్‌ రియాక్షన్

trs mp santosh

trs mp santosh

TRS MP Santhoshkumar: టీఆర్ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ గత కొద్ది రోజులుగా కనిపించడం లేదని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. సీఎం కేసీఆర్ వరంగల్ టూర్‌లో ఆయనతోనే ఉన్న ఫోటోలు ఇప్పుడు అన్నీ మీడియా ఛానళ్లు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్‌(TRS) పార్లమెంట్‌ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌(Joginapally Santoshkumar) గత కొద్ది రోజులుగా కనిపించడం లేదని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. సాక్షాత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR)వరంగల్(Warangal) పర్యటనలో ఆయనతోనే ఉన్న ఫోటోలు(Photo) ఇప్పుడు అన్నీ మీడియా ఛానళ్లు, సోషల్ మీడియా(Social media)లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎంపీ సంతోష్‌కుమార్‌ అజ్ఞాతంలో ఉన్నారనే వార్త పూర్తిగా అవాస్తవమని చెప్పేందుకే ఈఫోటోలు సరిపోతాయా అంటూ ఆయన వివరణ ఇచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.

Telangana: ప్రైవేట్‌ ఆసుపత్రుల దందాపై సర్కారు కొరడా .. ఆ జిల్లాలో ఎన్నింటికి నోటీసులిచ్చారంటే ..

అంతా తప్పుడు ప్రచారమే..

రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణాస్త్రాలు, సర్వసాధారణం. అయితే అధికార పార్టీకి చెందిన నాయకుడు కనిపించడం లేదని ..ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ..ఎవరో పుట్టిస్తున్న పుకార్లు మాత్రమేనని సదరు అధికార పార్టీకి చెందిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ జాతీయ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు శనివారం సీఎం కేసీఆర్ వరంగల్‌ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలో కూడా ఎంపీ సంతోష్‌కుమార్ సీఎం వెంట ఉన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న కెప్టెన్ లక్ష్మీ కాంతరావును స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు సీఎం కేసీఆర్. ఆఫోటోలో కూడా ఎంపీ సంతోష్‌కుమార్‌ ఉన్నారు.

స్పందించిన ఎంపీ ..

రాష్ట్రంలో సీబీఐ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే ఆయన వాటికి భయపడే హైదరాబాద్‌ను వదిలి అజ్ఞాజంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఎక్కడికి పోలేదని.. హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా ఆయనే స్వయంగా ఓ జాతీయ మీడియాకు చెప్పినట్లుగా తెలుస్తోంది. సంతోష్ అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ఓ దినపత్రిక కథనానికి సంబంధించిన క్లిప్‌ను తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది ఈ వార్తలు టీఆర్ఎస్ పార్టీలోనూ కలకలం రేపాయి. ఈ వార్తలపైనే తాజాగా క్లారిటీ ఇచ్చారు ఎంపీ సంతోష్ రావు. తాను ఎక్కడికి వెళ్లలేదని, సీఎం కేసీఆర్ వెంటే ఉన్నానన్నారు.ఈ విషయంలో తన నాయకుడు, తన జీవితానికి స్ఫూర్తి ప్రధాత, తన బాస్ అయిన సీఎం కేసీఆర్ సేవలోనే ఉంటానని తేల్చి చెప్పారు.

Telangana : హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఏజెన్సీలో ధర్నాలు .. స్వరం పెంచిన ఆదివాసీ గిరిజన బిడ్డలు

ఇంత రాజకీయం చేయాలా ..

రెండు, మూడు రోజులు బయటకు రాకపోతే అసత్య ప్రచారం చేస్తారా అని ఎంపీ సంతోష్‌కుమార్ తనపై వచ్చిన వదంతుల్ని కొట్టిపారేశారు. తానెప్పుడు రాజకీయ నేతగా భావించలేదని ..అలాంటప్పుడు పార్టీ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నాననే ప్రశ్న ఎలా వస్తుందని జాతీయ మీడియాతో చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడే కాదు ఎప్పటికే తాను కేసీఆర్‌ సేవకుడిగానే ఉంటానని సంతోష్‌ కుమార్‌ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

Published by:Siva Nanduri
First published:

Tags: MP santosh, Telangana Politics, TRS leaders

ఉత్తమ కథలు