హోమ్ /వార్తలు /తెలంగాణ /

బూట్లు నాకి అధ్యక్షుడయ్యావ్.. వరికి గోధుమకు తేడా తెలీని వెధవ్వి: బండిపై ఎమ్మెల్సీ పిడుగులు

బూట్లు నాకి అధ్యక్షుడయ్యావ్.. వరికి గోధుమకు తేడా తెలీని వెధవ్వి: బండిపై ఎమ్మెల్సీ పిడుగులు

బీజేపీ దీక్ష ఫ్లెక్సీల్లో వడ్లకు బదులు గోధుమలు

బీజేపీ దీక్ష ఫ్లెక్సీల్లో వడ్లకు బదులు గోధుమలు

వరి ధాన్యం వివాదానికి పరిష్కారం చూపుతూనే బీజేపీపై టీఆర్ఎస్ విమర్శల డోసు పెంచబోతోందనడానికి నిదర్శనంగా కేసీఆర్ ఆప్తుడైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కనీవినీ ఎరుగని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వివాదంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నడుస్తోన్న కీచులాట ముదిరిపాకన పడింది. కేంద్రం తీరును నిరసిస్తూ స్వయంగా ఢిల్లీలో దీక్షచేసిన సీఎం కేసీఆర్ మంగళవారం నాటి రాష్ట్ర కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రైతులకు శుభవార్త చెబుతూనే కమలదళాన్ని ఇరుకున పెట్టేలా కేసీఆర్ పక్కా వ్యూహంతో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీపై టీఆర్ఎస్ విమర్శల డోసు పెంచబోతోందనడానికి నిదర్శనంగా కేసీఆర్ ఆప్తుడైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ని ఉద్దేశించి పల్లా ఆరోపణల పిడుగులు కురిపించారు.

బీజేపీ బండి సంజయ్ ని ఇప్పటి దాకా ఎవరూ తిట్టని తిట్లు, తీవ్ర స్వరంతో విమర్శలు, ఆరోపణలతో పల్లా విరుచుకుపడ్డారు. తెలంగాణ బాయిల్డ్ రైస్ కొనబోమని, రా రైస్ మాత్రం ఎంతైనా కొంటామని ప్రకటన చేసిన కేంద్ర ఆహార ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే పైనా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మండిపడ్డారు. మంగళవారం టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడిన పల్లా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

CM KCR : రైతులకు శుభవార్త! -ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ ప్రకటన? -బీజేపీ ఖాతాలో మరో విజయం!!


‘రైతులకు న్యాయం చేయాలని మేమంతా ఢిల్లీలో దీక్ష చేస్తుంటే సుదాన్ష్ పాండే పచ్చి అబద్ధాలు చెప్పారు. బీజేపీ నేతలేమో పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారు. తెలివి తక్కువ బండి సంజయ్ ఇష్టానుసారం మొరిగారు. బాయిల్డ్ రైస్ తీసుకోకపోతే మేము ఏ లెక్కలో ఇవ్వాలి? మేము రైతులను వేయొద్దంటె బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారు. వరికి, గోధుమలకూ తేడా తెలియని వెధవ బండి సంజయ్..’అంటూ పల్లా నిప్పులు చెరిగారు. అంతటితో ఆగకుండా..

CM KCR : కేసీఆర్ సంచలనం.. మోదీ సర్కారుకు 24గం. డెడ్‌లైన్.. జైలుకు పంపే దమ్ముందా?


‘నీ బోడి కేంద్రం యూరియా మీద సబ్సిడీ ఎత్తేసింది. ఎరువుల ధరలు పెంచింది. బండి సంజయ్ చనిపోతే కూడా రైతు భీమా కింద ఐదు లక్షలు ఇస్తుంది. బూట్లు నాకి పదవి తెచ్చుకుని అధ్యక్షుడు అయ్యావ్.. అదానీ ఆస్తులకు బ్రోకర్లు, బినామీలు మీరు. కోవిడ్ డోసుల మీద కమిషన్లు తీసుకున్న కక్కుర్తి పార్టీ బీజేపీ. అసలు బీజేపీ ఎంపీలు ఇన్ని ఏళ్లు ఏం పీకారు? నిన్ను రైతులు ఉరికించిన విషయం మర్చిపోకు సంజయ్. నిజంగా మీకు దమ్ముంటే నా మీద ఐటీ, ఈడీ దాడి చేయించు చూద్దాం.. ’ అంటూ సంచలన సవాలు విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా. సోమవారం నాటి ఢిల్లీ దీక్షలో సీఎం కేసీఆర్ కూడా తనను జైలు పంపాలంటూ బీజేపీకి సవాలు విసరడం తెలిసిందే.

First published:

Tags: Bandi sanjay, Bjp, CM KCR, Paddy, Palla rajeshwar reddy, Telangana, Trs

ఉత్తమ కథలు