హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS: మల్లారెడ్డి సంస్థలపై ఐటీ దాడులు.. టీఆర్ఎస్ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు.. వాళ్లంతా నీతిమంతులయ్యారా అంటూ..

TRS: మల్లారెడ్డి సంస్థలపై ఐటీ దాడులు.. టీఆర్ఎస్ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు.. వాళ్లంతా నీతిమంతులయ్యారా అంటూ..

మంత్రి మల్లారెడ్డి (ఫైల్ ఫోటో)

మంత్రి మల్లారెడ్డి (ఫైల్ ఫోటో)

Palla Rajeshwar Reddy: గతంలో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఇప్పుడు బీజేపీలో చేరగానే నీతిమంతులు అయిపోతారా? అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్ర సంస్థలను రాజకీయమయం చేస్తున్నారని, దర్యాప్తు సంస్థల సిబ్బందిని వారి కార్యకర్తల్లా ఉపయోగించుకుంటున్నారని బీజేపీపై టీఆర్ఎస్(TRS) ముఖ్యనేత పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో 4 వేలమందిపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరిగితే.. వారిలో 3,900 మంది బీజేపీలో చేరారని రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. గతంలో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఇప్పుడు బీజేపీలో(BJP) చేరగానే నీతిమంతులు అయిపోతారా? అని ప్రశ్నించారు. ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని తాము భావిస్తున్నామని, కానీ తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాంటి దాడులకు భయపడబోరని పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) స్పష్టం చేశారు. వాళ్లు ఎలాంటి దాడులు చేసుకుంటారో చేసుకోవచ్చని అన్నారు. ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో వారికి తెలుసని అన్నారు. దాడులకు భయపడి ఇతర పార్టీల్లో చేరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.

మరోవైపు తెలంగాణాలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ విస్తృత తనిఖీలు చేస్తున్నారు. టీఆర్ఎస్ మంత్రులు టార్గెట్ గా ఈ సోదాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు మంత్రి తలసాని టార్గెట్ గా అతని బ్రదర్స్, PAను ఈడీ అధికారులు విచారించారు. ఇక తాజాగా అతని కొడుకు సాయికిరణ్ కు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా ఐటీ అధికారులు తెల్లవారుజామున 5 గంటల నుండి సోదాలు చేస్తున్నారు.

50 బృందాలు ఏకకాలంలో అతని బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా డబ్బును సీజ్ చేసినట్లు తెలుస్తుంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ లావాదేవీలపై భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. కాగా కన్వీనర్ కోటా మెడికల్ సీట్లను కూడా కోట్లకు అమ్మినట్లు తెలుస్తుంది. దీనితో మొత్తం 4 మల్లారెడ్డి మెడికల్ కాలజిల బ్యాంక్ లావాదేవీలను అధికారులు పరిశిలీస్తున్నారు.  

Telangana Congress: ఎంపీ కోమటిరెడ్డికి ఊతమిచ్చేలా శశిధర్ రెడ్డి కామెంట్స్.. మళ్లీ మొదలుపెడతారా ?

Big News: ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్..ఏం చెప్పబోతున్నారు?

మంత్రి మల్లారెడ్డి ఫోన్ ను అధికారులు స్వాదీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన ఫోన్ ను పక్కన ఉన్న క్వార్టర్స్ లో దాచినట్లు తెలవగా దానిని అధికారులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు మల్లారెడ్డి సోదరుని ఇంట్లో ఓ లాకర్ ను గుర్తించిన అధికారులు దానిని బయటి వ్యక్తి సహాయంతో పగలగొట్టారు. ఆ లాకర్ లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.

First published:

Tags: Palla rajeshwar reddy, Trs

ఉత్తమ కథలు