వికారాబాద్ (Vikarabad) జిల్లాలో మాత్రం అధికార పార్టీ నేత ఆడియో టేపులు (Audio Tapes)సోషల్ మీడియా (Social Media)తో పాటు అన్నీ మీడియాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ (TRS MLC) పట్నం మహేందర్‌రెడ్డి (Patnam Mahender reddy)కి సంబంధించిన బూతుపురాణమే ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు అధికార పార్టీకి చెందిన నేత బండ బూతులు తిట్టింది, ఫోన్‌లో వార్నింగ్ (Phone Warning )ఇచ్చింది ఎవరికో కాదు..స్వయానా పోలీస్ డిపార్ట్‌మెంట్ (Police Department)కి చెందిన ఓ సీఐకి కావడంతో వివాదం మరింత రచ్చకు దారి తీసింది. అయితే దీనిపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగడంతో మహేందర్ రెడ్డి దిగివచ్చారు (Apologized).
పొరబాటున నోరి జారిన..
నిన్నటి సంఘటన పోలీసుల (Police) మనుసు నొప్పిస్తే అది తనకు బాధాకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో ‘‘ పోలీసు సోదరులంతా నా కుటుంబ సభ్యులతో సమానం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధి, శాంతిభద్రత లో వారి కృషి అభినందనీయం” అన్నారు. పొరపాటున నోరుజారిన, కొంత మంది మిత్రులు, పోలీసులు భాధపడితే తాను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీసులంటే తనకు ఎనలేని గౌరవం (Respect) అని చెప్పారు.
అధికారుల్ని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు..
అసలు స్టోరీలోకి వెళ్తే వికారాబాద్ (Vikarabad)జిల్లా తాండూర్(Tandoor)లో అధికార పార్టీకి చెందిన నేతల మధ్య ఆధిపత్యపోరు, వర్గవిభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈక్రమంలో నేతలు డైరెక్ట్‌గా రంగంలోకి దిగకుండా మధ్యలో అధికారుల్ని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా, తాండూర్ సీఐ రాజేందర్ రెడ్డి (Rajender Reddy)పై బూతు పురాణం అందుకున్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.
తాండూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా రథోత్సవం రోజున ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి(MLA Rohit Reddy)పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయమై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి రౌడీషీటర్లకు కార్పెట్లు వేస్తావా ? అంటూ నోటికొచ్చినట్లుగా ఫోన్‌లో బూతులు తిట్టారు. ప్రజాప్రతినిధులు ఉపయోగించకూడని భాషతో నీ అంతు చూస్తా..! అని వార్నింగ్ ఇచ్చారు.
మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఫోన్ కాల్ చేసి తిడుతుంంటే సీఎం రాజేందర్‌రెడ్డి పద్ధతిగా మాట్లాడాలని ఎమ్మెల్సీకి సూచించారు. అందుకు కూడా ఆయన మరింత రెచ్చిపోయారు. రికార్డు చేసుకో.. మీడియాకు ఇచ్చుకో.. నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే రౌడీషీటరా? అని సీఐ ప్రశ్నించగా.. వాడి పక్కన రౌడీషీటర్లు లేరారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇసుక దందాలో నీ ప్రమేయం లేదా? ఇప్పటినుంచి నీ అంతు చూస్తా అంటూ ఫోన్‌లో సీఐ రాజేందర్ రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు.. ఇప్పుడా ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం కూడా తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Police, Telangana Politics, TRS leaders, Vikarabad