హోమ్ /వార్తలు /తెలంగాణ /

Etala | Kaushik Reddy : ఆ బీజేపీ ఎమ్మెల్యే నా హత్యకు కుట్ర పన్నాడు:TRSఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ఆరోపణల పరమార్ధం ఏమిటి..?

Etala | Kaushik Reddy : ఆ బీజేపీ ఎమ్మెల్యే నా హత్యకు కుట్ర పన్నాడు:TRSఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ఆరోపణల పరమార్ధం ఏమిటి..?

ఈటల రాజేందర్​, కౌశిక్​ (ఫైల్​)

ఈటల రాజేందర్​, కౌశిక్​ (ఫైల్​)

Etala|Kaushik Reddy: హుజురాబాద్‌ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్‌, ప్రతిపక్ష బీజేపీ నేతలు నిన్నటి వరకు బస్తీ మే సవాల్ అనుకున్నారు. అక్రమాలు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ప్రతి సవాళ్లు చేసుకున్నారు. ఇప్పుడేమో ఒకరిపై మరొకరు నేరచరిత్ర గురించి ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రత్యర్ధులతో ప్రాణహాని ఉందంటూ పబ్లిక్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హుజురాబాద్‌(Huzurabad)నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్‌(TRS), ప్రతిపక్ష బీజేపీ (BJP)నేతలు నిన్నటి వరకు బస్తీ మే సవాల్ అనుకున్నారు. అక్రమాలు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ప్రతి సవాళ్లు చేసుకున్నారు. ఇప్పుడేమో ఒకరిపై మరొకరు నేరచరిత్ర గురించి ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రత్యర్ధులతో ప్రాణహాని ఉందంటూ పబ్లిక్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. గత ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత ఈటల రాజేందర్‌ (Etala Rajender)హుజురాబాద్‌లో ఇష్టానుసారంగా గన్ లైసెన్స్‌(Gun licenseలు)ఇచ్చారంటూ విమర్శలు చేశారు. తన కుటుంబానికి ఏదైనా జరిగితే సీఎం కేసీఆర్(KCR)బాధ్యత వహించాలని చేసిన కామెంట్స్‌కి పోలీసులు సమాధానం ఇచ్చారు. ఇది మర్చిపోక ముందే టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ(MLC) పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy)రక్త చరిత్ర లిఖించింది ఈటల రాజేందరేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తనపై గతంలో హత్య చేసేందుకు ప్రయత్నించింది కూడా ఈటల వర్గీయులేనంటూ పొలిటికల్ బాంబ్ పేల్చడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

Hyderabad | Amit Shah : అమిత్‌షా పర్యటనలో భద్రత వైఫల్యం..కాన్వాయ్‌కి అఢ్డొచ్చిన గుర్తు తెలియని వాహనం

ఒకరిపై మరొకరు ప్రత్యారోపణలు..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఏం జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తుపాకుల ప్రస్తావన తెచ్చారో లేదో ...ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అంతకు మించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తనను హత్య చేయడానికి కుట్ర పన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఈ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

కౌశిక్‌ రెడ్డిపై హత్యకు కుట్ర..!

మర్రిపల్లిగూడెంలో తనను ఈటల రాజేందర్ హత్య చేయడానికి ప్రయత్నించిన విషయం వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు కౌశిక్‌రెడ్డి. అంతే కాదు నియోజకవర్గంలో జరిగిన మరో నేరాల వెనుక కూడా ఈటల రాజేందర్‌ హస్తం ఉందని ఆరోపించారు. వీణవంక మండలం నర్సింగాపూర్‌కి చెందిన బాలరాజు అనే ఉద్యమకారుడ్ని హత్య చేయించింది ఈటల వర్గీయులేనన్నారు. మంథనిలో జరిగిన లాయర్ వామనరావు దంపుతల హత్య చేసిన వారిలో ఈటల మిత్రుడి ఉన్న మాట వాస్తవం కాదా అంటూ టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ బీజేపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు.

KCR | Telangana : రాష్ట్రంలో దుష్టశక్తులు చొరబడ్డాయి .. ప్రజల్ని విభజించే విచ్చిన్నకర శక్తులతో జాగ్రత్త : కేసీఆర్

హాట్ కామెంట్స్‌కి కారణం ..?

అయితే కౌశిక్‌రెడ్డి పని గట్టుకొని ఈటల రాజేందర్‌కి నేరచరిత్ర అంటగట్టడం చూస్తుంటే పెద్ద వ్యూహమే ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఈటల హుజురాబాద్‌ ఉపఎన్నికల సమయంలో ఇష్టానుసారంగా గన్‌ లైసెన్స్‌లు ఇచ్చారని..ఫలితంగా తనకు, తన కుటుంబానికి త్రెట్ ఉందన్నారు. తన ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా జరిగితే అందుకు కేసీఆర్ బాధ్యుడు అవుతాడని వ్యాఖ్యానించారు. ఈటల వ్యాఖ్యలకు కౌంటర్‌గనే కౌశిక్‌రెడ్డి కేసీఆర్‌ రాజకీయ జీవితంలో నేరచరిత్ర లేదని .. అందుకు తెర తీసింది ఈటల రాజేందరేనంటూ చేసిన వ్యాఖ్యానించడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేరచరిత్ర స్టేట్‌మెంట్‌ల వెనుక ఎవరి కుట్ర దాగి ఉందో ..? నిజంగా ఎవరికి ఎవరితో ప్రాణహని ఉందో అర్ధం కాక రెండు పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Etala rajendar, Telangana Politics, TRS leaders

ఉత్తమ కథలు