హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kalvakuntla Kavitha : కేసీఆర్‌కి తిక్కుంది కాని దానికో లెక్కుంది .. కేంద్రంతో కొట్లాడటానికే మేం రెడీ: కవిత

Kalvakuntla Kavitha : కేసీఆర్‌కి తిక్కుంది కాని దానికో లెక్కుంది .. కేంద్రంతో కొట్లాడటానికే మేం రెడీ: కవిత

Kavitha,modi(file photo)

Kavitha,modi(file photo)

Kalvakuntla Kavitha: కేంద్రంతో కొట్లాడటానికే కేసీఆర్ ఎప్పుడో డిసైడ్ అయ్యారని చెప్పారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేంద్రంలో ఉన్న బీజేపీ కేసీఆర్‌ను టార్గెట్‌గా పెట్టుకుని తనపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారని చెప్పారామె. ఓ న్యూస్ చానల్ లైవ్ డిబేట్‌లో కేసీఆర్‌కి తిక్కుంది కాని దానికో లెక్కుందన్నారు కవిత.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్రంతో కొట్లాడటానికే కేసీఆర్(KCR) ఎప్పుడో డిసైడ్ అయ్యారని చెప్పారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ (TRS MLC)కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha). కేంద్రంలో ఉన్న బీజేపీ(BJP) కేసీఆర్‌ను టార్గెట్‌గా పెట్టుకుని తనపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారని చెప్పారామె. లిక్కర్ స్కాం(Liquor scam)లో అవినీతిలో తన పాత్ర ఏమాత్రం లేదని చెప్పిన కల్వకుంట్ల కవిత ఓ న్యూస్ చానల్‌(News Channel) బిగ్ డిబేట్‌(Big Debate)లో కేసీఆర్‌కి తిక్కుంది కాని దానికి కూడా ఓ లెక్క ఉందని సమర్ధించుకున్నారు. బీజేపీ బ్యాక్ డోర్ పాలిటక్స్ చేస్తోందని ఆరోపిస్తూనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతిపరులపై ఎందుకు కొరడా ఝుళిపించడం లేదని ప్రశ్నించారామె. ఏబీఎన్ న్యూస్‌ ఛానల్‌ ఎండీ ఆర్కేతో జరిగిన బిగ్ డిబేట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత.


Rajagopal Reddy: త్వరలోనే జైలుకి కేసీఆర్ ఫ్యామిలీ, మునుగోడులో కేసీఆర్‌కి పోటీ చేసే దమ్ముందా : రాజగోపాల్‌రెడ్డిమా నాన్నంటే వాళ్లకు భయం..
ఈడీ, బోడీకి భయపడను అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని బీజేపీ ఆయనపై రివేంజ్ తీర్చుకుంటోందన్నారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేసీఆర్‌ని చూసి భయపడుతున్న ప్రధాని మోదీ ఆయన్ని ఏమి చేయలేక తనకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సంబంధం ఉందనే ఆరోపణలతో భయపెట్టాలని చూస్తోందన్నారు. శనివారం ఏబీఎన్‌ న్యూస్ ఛానల్ నిర్వహించిన లైవ్ డిబేట్‌లో యుద్ధంలో రాజును ఓడించాలంటే తొలుత చుట్టూ ఉన్న వారిని కొడతారని తెలంగాణ విషయంలో బీజేపీ ప్రస్తుతం అదే చేస్తోందన్నారు.కేసీఆర్‌కు తిక్కుంది: కవిత

కేంద్రంలో ఉన్న బీజేపీ బెంగాల్, పంజాబ్, కర్నాటక, రాష్ట్రాల్లో అవినీతిని జరిగినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలతో నిరూపిస్తుంటే మీరెందుకు జాగ్రత్త పడలేదని అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల కవిత తనదైన శైలీలో బదులిచ్చారు. బీజేపీ తమకు వ్యతిరేకంగా వాయిస్ వినిపించే పార్టీలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం పరిపాటిగా చేసుకుందన్నారు. ఇది తెలంగాణలో నా వరకే కాదు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎవర్ని వదిలిపెట్టడం లేదన్నారామె. కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా, కన్యాకుమారిలో స్టాలిన్ కుటుంబంపైనా కేసులు పెట్టలేదా అని అన్నారు. మహారాష్ట్రలో శివసేన , ఎన్సీపీ ఎంపీలపై కేసులు పెట్టి జైల్లో ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీలో ఉందన్న కవిత ఇలాంటి సమయంలో అందరూ ప్రశ్నించకపోతే ప్రమాదం ఊహించని విధంగా ఉంటుందన్నారు.


BJP | Telangana : ఎన్టీఆర్, నితిన్, మిథాలీని బీజేపీ నేతలు కలవడం వెనుక అసలు కారణం అదే.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీటైమ్ రావాలి కదా..

తెలంగాణలో కేసీఆర్‌ అభివృద్ధి చేయలేదా అని కవిత ఆర్కేను ప్రశ్నిస్తే ...కొద్దిగా చేశారు...కాకపోతే ఆయనలోని తిక్క చేష్టలు, ఆలోచనలే ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యాయి నిజమా కాదా అని తిరిగి కవితను ప్రశ్నించారు. తన తండ్రికి తిక్క ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన కవిత..ఇవాళ రేపు అందరికి తిక్క ఉందని ..కాని తన తండ్రి తిక్కకు ఓ లెక్క ఉందని కౌంటర్ ఇచ్చారు. చివరగా లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత పేరు బయటకొస్తే మీ తండ్రి కేసీఆర్ , మీ అన్న కేటీఆర్ మాట్లాడటం లేదని వేసిన ప్రశ్నకు కవిత తెలివిగా బదులిచ్చారు. లిక్కర్ కుంభకోణంలో తనపై వచ్చిన ఆరోపణల గురించి పట్టించుకోవద్దని కుటుంబ సభ్యులకు తానె చెప్పానని, తన తండ్రికి కూడా అదే చెప్పానని కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ నేతలంతా ఈవిషయంలో తనకు అండగా ఉన్నారన్న కవిత అవసరమైనప్పుడు కేసీఆర్, కేటీఆర్ బహిరంగంగా స్పందిస్తారని చెప్పారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Bjp, Kalvakuntla Kavitha, Telangana Politics

ఉత్తమ కథలు