హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS: ప్రశాంత్ కిశోర్‌తో టీఆర్ఎస్ కటీఫ్.. ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. టెన్షన్ పోయినట్టేనా ?

TRS: ప్రశాంత్ కిశోర్‌తో టీఆర్ఎస్ కటీఫ్.. ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. టెన్షన్ పోయినట్టేనా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TRS: కొద్దిరోజుల క్రితం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మరోసారి టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ సేవలను వినియోగించుకోవాలని గతంలో నిర్ణయించుకున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR).. తాజాగా ప్రశాంత్ కిశోర్‌కు(Prashant Kishor) చెందిన సంస్థ ఐప్యాక్‌తో తెగతెంపులు చేసుకున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ కారణంగానే తెలంగాణలోని ఐప్యాక్ టీమ్ సభ్యులను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారని చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలకు తిరుగులేని విజయాలను తెచ్చిపెట్టే ఐప్యాక్ వంటి సంస్థతో టీఆర్ఎస్‌ తెగతెంపులు చేసుకోవడంపై టీఆర్ఎస్ (TRS)  శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం ఈ పరిణామాల కారణంగా హ్యాపీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ బలపడుతుండటంతో.. టీఆర్ఎస్ కూడా అప్రమత్తమైంది.

  గతంలో మాదిరిగా కాకుండా.. పీకే సర్వేలో ఓకే అనిపించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఒకటి రెండు సందర్భాల్లో కేసీఆర్ , కేటీఆర్ కూడా ఈ విషయాన్ని పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. దీంతో పీకే సర్వేలో తమ పరిస్థితి ఎలా ఉందనే టెన్షన్ చాలామంది ఎమ్మెల్యేల్లో నెలకొంది. ఈ విషయమై పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ముఖ్యనేతలను ఆరా తీయడంతో పాటు తమ పనితీరు ఏ మేరకు మెరుగుపడింది ? ఇంకా ఏ మేరకు మెరుగుపడాల్సి ఉంది ? అనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు.

  మరికొందరైతే.. తాము ఎంతో కష్టపడుతున్నా పీకే సర్వేలో ఫలితాలు తమకు అనుకూలంగా రావడం లేదనే భావనలో కూడా ఉన్నారనే టాక్ వినిపించింది. దీంతో అసలు పీకే సర్వే ఏ ప్రాతిపదికన చేస్తున్నారు ? తమను టార్గెట్ చేసే విధంగా ఈ సర్వే ఉంటుందా ? అనే అనుమానాలు కూడా చాలామంది ఎమ్మెల్యేల్లో నెలకొన్నాయి. అయితే తాజాగా టీఆర్ఎస్‌తో ఐప్యాక్ తెగతెంపులు చేసుకుందనే వార్తలు చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆనందం నింపిందనే చర్చ జరుగుతోంది.

  Indrakaran Reddy : దళిత బంధు పథకం మా ఇష్టం వచ్చినోళ్లకి ఇస్తం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

  ఆ ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏపీపై ఫోకస్ చేస్తున్నారా ?.. ఇదేం లెక్క ?

  కొద్దిరోజుల క్రితం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మరోసారి టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే పీకే సర్వే తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో అనే ఆందోళన చాలామంది ఎమ్మెల్యేల్లో కొనసాగుతూ వచ్చింది. కానీ తాజాగా ప్రశాంత్ కిశోర్ టీమ్ టీఆర్ఎస్‌తో పని చేయడం లేదని తెలియడంతో.. ఇక తమ ఎమ్మెల్యే టికెట్‌కు వచ్చిన ఇబ్బందేమీ ఉండదని చాలామంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు చెబుతున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana, Trs

  ఉత్తమ కథలు