హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: టీఆర్ఎస్ ఎంపీ కవితకు అవమానం.. చేతిలో నుంచి మైక్ లాక్కున్న ఎమ్మెల్యే

Telangana: టీఆర్ఎస్ ఎంపీ కవితకు అవమానం.. చేతిలో నుంచి మైక్ లాక్కున్న ఎమ్మెల్యే

రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతున్న కవిత చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్.

రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతున్న కవిత చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్.

రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతున్న కవిత చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్.

  మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవితకు అవమానం ఎదురైంది. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతున్న కవిత చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ (Shankar Naik). దీంతో ఏం చేయాలో అర్థంకాక ఎంపీ కవిత(MP Kavitha) మిన్నకుండిపోయారు. సమావేశంలో ఉన్న టీఆర్ఎస్ (TRS) నేత తక్కళ్లపల్లి రవీందర్‌తో తన ఆవేదనను చెప్పుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలోనే ఇదంతా జరగడం గమనార్హం. వివాదాలతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. హోలీ రోజున సంబరాల్లో పాల్గొన్న ఆయన కార్యకర్తలకు మద్యం పోయడం సంచలనం సృష్టించింది. గతంలో జిల్లా కలెక్టర్‌తో ఆయన వ్యవహరించిన శైలిపై కూడా విమర్శలు వచ్చాయి. తాజాగా సమావేశంలోనే ఎంపీ కవిత చేతిలో నుంచి ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కోవడం.. ఆ వీడియో వైరల్‌గా మారడంతో.. ఆయన వ్యవహారశైలిపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  వ్యవహారశైలి మాత్రమే కాదు.. వివాదాస్పద వ్యాఖ్యలతోనూ గతంలో శంకర్ నాయక్ వార్తల్లో నిలిచారు. కొన్నేళ్ల క్రితం అధిక కులంలో పుట్టడం వల్ల చిన్నప్పటినుండే గర్వం తలకెక్కుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వెలమ, రెడ్డి కులాలవారు చిన్న కులాలవారిని కించపర్చేలా వ్యవహరిస్తుంటారని...వారికి కులం బలుపు ఎక్కువగా వుంటుందంటూ కామెంట్ చేశారు. ధనం ఎక్కువగా వుండేవాళ్లకు కూడా బలుపు వుంటుందని.. పేదలను, సామాన్యులను కించపర్చులా వారు ప్రవర్తిస్తుంటారని అన్నారు. అదిక విద్యావంతులయితే వారిలో బలుపు ఉంటుందని.. బాగా చదివేవారు చదువుకోలేని పేదలను, చదువు అబ్బని వారిపట్ల చులకభావాన్ని కలిగివుంటారని... దీంతో తెలియకుండానే వారిలో బలుపు పెరిగిపోతుందంటూ అన్నారు.

  ఇదిలా ఉంటే మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని చర్చ చాలాకాలంగా వినిపిస్తోంది. గతేడాది జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఈ వ్యవహారం బట్టబయలైంది. సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా మానుకోటలో ఎంపీ కవిత వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు చించేశారు.

  Minister KTR Counter to governor: తనను అవమానిస్తున్నారన్న తెలంగాణ గవర్నర్​ తమిళిసై.. మంత్రి కేటీఆర్ కౌంటర్​

  Telangana| Rahul Gandhi: తెలంగాణపై రాహుల్ గాంధీ ఫోకస్.. ఆ నాయకుడి భయమే అసలు కారణమా ?

  దీనిపై కవిత అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, మున్సిపల్ వైస్ చైర్మన్‌తో సహా పలువురిపై కేసులు పెట్టడం అర్ధరాత్రి హైడ్రామా సాగింది. శంకర్‌నాయక్ పీఎస్ ముందు హంగామా చేసి, సమస్య తీవ్రతను తెలియజేశారు. మానుకోటలో జరిగిన ఘటనపై ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఇద్దరు నేతలను అధిష్టానం మందలించి వదిలేసిందనే చర్చ కూడా ఉంది. తాజాగా ఎంపీ కవిత విషయంలో శంకర్ నాయక్ వ్యవహరించిన తీరుతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయనే చర్చ మరోసారి మొదలైంది.

  First published:

  Tags: Telangana, Trs

  ఉత్తమ కథలు