‘దేశంలో జీడీపీ దూసుకెళ్లడం లేదని ఎవరన్నారు? ప్రియతమ ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పాల్సిందే. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రోజూ పెంచుతూ.. ప్రజలకు పెంపును అలవాటుగా మార్చినందుకు దానిని ఒక అలవాటుగా మార్చినందుకు థాంక్స్ చెప్పాల్సిందే. పెట్రో వాతను కూడా బీజేపీలోని కొందరు మేధావులు ఇలా వర్ణిస్తారేమో.. ఇదంతా ఈవీ(ఎలక్ట్రిక్ వాహనాలను)లను ప్రమోట్ చేసేందుకు మోదీగారు చేస్తున్న మాస్టర్ స్ట్రాటజీ అని చెప్పుకుంటారు కూడా’.. ఇదీ ప్రధాని మోదీని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన సెటైరికల్ కామెంట్స్.
బీజేపీ సారధ్యంలోని కేంద్రాన్ని చీల్చి చెండాడుతాం.. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగడతాం.. అని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన క్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వరుస సెటైర్లలో ప్రధాని మోదీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వరి పోరును ఉధృతం చేసేందుకు కేసీఆర్ ఢిల్లీలో మకాం వేయగా, హైదరాబాద్ లోనే ఉంటూ కొడుకు కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధానంగా పెట్రో ధరల పెంపుపై వరుసగా వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
Who says GDP is not going up? Thank You dear Modi Ji for the making this Gas Diesel & Petrol hike as a daily habit for all Indians? Am sure there will be some bright BJP folks who will tell us now that this is Modi Ji’s master strategy to promote EVs ? https://t.co/6Ah3dmzhSO
— KTR (@KTRTRS) April 5, 2022
ఎండాకాలన్ని మరపింపజేసేలా దేశంలో పెట్రో మంటలు భగ్గుమంటుండటం, గడిచిన 15 రోజుల్లో ఏకంగా 13 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, తాజా(మంగళవారం నాటి) పెంపుతో వడ్డన రూ.10కి చేరువ కావడం తెలిసిందే. సోమవారం కూడా పెట్రో ధరలపై కామెంట్లు చేసిన టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్.. ధరల్ని 30 శాతం తగ్గించేలా కేంద్రానికి కీలక సూచనలు చేశారు.
Read about Chinese torture only in books! This consecutive 80 paisa #FuelPriceHike 12th hike in 14 days outdoes any torture & a record of sorts ? FM @nsitharaman Ji, why hesitate to debate in parliament on crude oil prices, the Cesses that we can do away with to reduce prices?
— KTR (@KTRTRS) April 4, 2022
‘తెలంగాణలో మేము(టీఆర్ఎస్ సర్కారు) గత 7 ఏళ్లుగా VATని పెంచలేదు. ఇంధన ధరలను కనీసం 30% తగ్గిపోయేలా మోదీ సర్కార్ విధించిన సెస్సులు తొలగించాలన్నదే మా డిమాండ్. చైనీస్ హింస గురించి పుస్తకాలలో చదివాను కానీ, పెట్రో ధరల పెంపు చైనీస్ టార్చర్ ను మించి అన్నట్లుగా ఉంది. ఇంతకీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరల తగ్గింపు చర్యలపై పార్లమెంటులో మాట్లాడరెందుకు?’అని కేటీఆర్ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Diesel price, KTR, LPG Cylinder, Petrol Price, Pm modi, Trs