Home /News /telangana /

TS POLITICS TRS MINISTER JAGADISH REDDY CONVINCED MUNUGODU LOCAL LEADERS FOR OPPOSING KUSUKUNTLA PRABHAKAR REDDY CANDIDATURE AK

TRS| Munugodu: ‘మునుగోడు’‌పై టీఆర్ఎస్ ఫోకస్.. ముందుగా వారికి బుజ్జగింపులు.. ఎందుకంటే..

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

Munugodu By Elections: నియోజకవర్గంలో బీసీ నేతకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తున్నా.. బీసీ నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉండటం ఆ పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణలో ఉప ఎన్నికలు జరగబోయే మునుగోడు సీటును గెలుచుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు కారణంగా తమకు జరిగిన రాజకీయ నష్టాన్ని మునుగోడులో(Munugodu) గెలుపు ద్వారా భర్తీ చేసుకోవాలని యోచనలో అధికార టీఆర్ఎస్.. ఇక్కడ ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఇచ్చినంత హైప్ లేకుండానే మునుగోడు ఉప ఎన్నిక జరగాలని టీఆర్ఎస్(TRS) భావిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అనవసరంగా ఎక్కువ హైప్ వచ్చిందని.. టీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఓ కారణమని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఈసారి అలా జరగకుండా చూడాలని అనుకుంటోంది.

    జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డితో(Minister Jagadish Reddy) పాటు మరో ఒకరిద్దరు మంత్రులకు మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలను అప్పగించి.. గెలుపు కోసం ఎప్పటికప్పుడు వ్యూహాలను సిద్ధం చేయాలనే యోచనలో గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. అయితే అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.



    ఈ సమావేశంలో పాల్గొన్న నేతలంతా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని టికెట్ ఇవ్వద్దని పార్టీ నాయకత్వాన్ని కోరారని సమాచారం. ఆయన బరిలో ఉంటే గెలుపు కష్టమని వారంతా పార్టీకి సూచించినట్టు వార్తలు వచ్చాయి. అయితే మునుగోడు బరిలో ఎవరు ఉంటారనే విషయాన్ని పార్టీని నాయకత్వానికి వదిలేసి.. అక్కడ పార్టీ గెలుపు కోసం పని చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం స్థానిక నేతలకు సూచించింది. ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వబోమని టీఆర్ఎస్ నాయకత్వం కచ్చితంగా వారికి చెప్పలేదని సమాచారం. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం విభిన్న కోణాల నుంచి ఆలోచిస్తోందని చర్చ కూడా సాగుతోంది.

    Telangana| BJP: బీజేపీ కీలక నిర్ణయం.. కొత్త నేతకు తెలంగాణ పార్టీ బాధ్యతలు.. ఆయన ఎవరంటే..

    Munugodu| Congress: మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిపై త్వరలోనే తేల్చేశారా ?.. ఈసారి భిన్నంగా..

    నియోజకవర్గంలో బీసీ నేతకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తున్నా.. బీసీ నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉండటం ఆ పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఒకరికి టికెట్ ఇస్తే.. మరొకరి నుంచి సహకారం లభిస్తుందో లేదో అనే ఆందోళన ఆ పార్టీలో ఉన్నట్టు సమాచారం. అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికే వదిలేయాలని టీఆర్ఎస్ నాయకత్వం స్థానిక నేతలకు సూచించిందని.. వారికి నచ్చజెప్పే బాధ్యతలను జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించినట్టు తెలుస్తోంది. తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు కూడా రకమైన సంకేతాలు ఇవ్వడం విశేషం.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Munugodu By Election, Telangana, Trs

    తదుపరి వార్తలు