హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP | TRS : ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడికి కారణం ఏమిటి .. రిపీట్ అయితే మేం ఏంటో చూపిస్తాం : తలసాని శ్రీనివాస్‌యాదవ్

BJP | TRS : ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడికి కారణం ఏమిటి .. రిపీట్ అయితే మేం ఏంటో చూపిస్తాం : తలసాని శ్రీనివాస్‌యాదవ్

TRS SUPPORT KAVITHA

TRS SUPPORT KAVITHA

TRS vs BJP: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేయడాన్ని మంత్రులు, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖండిస్తున్నారు. కల్వకుంట్ల కవితకు సంఘీభావం తెలిపారు. నిరాధార ఆరోపణలను పట్టుకొని మరోసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చిరించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam)లో కేసీఆర్(KCR) కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే ఆరోపణలు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉద్రిత్త పరిస్ధితులకు కారణమవుతున్నాయి. ఈ నిరాధారమైన ఆరోపణలతో సోమవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(TRS MLC Kalvakuntla kavitha) ఇంటిపై బీజేపీ(BJP) శ్రేణులు దాడికి ప్రయత్నించారు. తప్పుడు ప్రచారాన్ని పట్టుకొని టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై దాడి చేయడాన్ని మంత్రులు, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖండిస్తున్నారు. కల్వకుంట్ల కవితకు సంఘీభావం తెలిపారు. సోమవారం ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న సమయంలో బీజేపీ నేతలు కవిత ఇంటిపైకి రావడం దుర్మార్గం, హేయమైన చర్యగా అభివర్ణించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Talasani Srinivasyadav). మంగళవారం మంత్రి తలసానితో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath), దానం నాగేందర్(Dana Nagender), కాలేరు వెంకటేష్(Kaleru Venkatesh), ముఠా గోపాల్(Mutha Gopal)కవిత ఇంటికి వెళ్లి తమ సంఘీభావం తెలిపారు.

Rajasingh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ .. వీడియోలో ఆ వ్యాఖ్యలు చేయడం వల్లే ముస్లింలు ఆగ్రహం


దాడులు చేస్తే ఊరుకోం..

ఈసందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి ఘటనను తీవ్రంగా తప్పుపట్టారు. ఒక మహిళా ప్రజాప్రతినిధి ఇంటిపైకి బీజేపీ నేతలు రావడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలను తిప్పు కొడతామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. ఎమ్మెల్సీతో పాటు తామంతా ఎల్బీ స్టేడియంలో ఉన్న సమయంలో బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆమె ఇంటిపైకి దాడి చేయడానికి రావడం సిగ్గుచేటన్నారు. మేం మీ ఇళ్ల మీదకు రావాలంటే పెద్ద టైమ్ పట్టదని..టీఆర్ఎస్‌ సైన్యం ఎంత ఉందో తెలుసా అంటూ బీజేపీ నేతలను హెచ్చరించారు మంత్రి. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

ఆరోపణలతో అలజడి..

అసలు కల్వకుంట్ల కవిత ఇంటిని ముట్టడించడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు టీఆర్ఎస్‌ నేతలు. ఏ అంశంపైన అవగాహన లేకుండానే ఎవరో ఎంపీ చేసిన నిరాధార ఆరోపణలను పట్టుకొని బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి ఇంటిపై దాడికి రావడం సమంజసం కాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. అంతే కాదు కవితకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన టీఆర్ఎస్‌ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్‌ ముట్టడికి వెళ్తామంటున్నారని ..మా సైన్యం మీ వాళ్లపై దాడులు చేస్తే తట్టుకునే పరిస్థితి బీజేపీకి ఉందా అంటూ సవాల్ చేశారు మంత్రి. మా పార్టీ అధినేత సంస్కారం నేర్పారు కాబట్టి ..అలా ప్రవర్తించమని చెబుతూ నిన్నటి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు.

మేం తిరగబడితే తట్టుకోలేరు..

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆప్‌ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్‌కి అంటగట్టారు ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ. కేసీఆర్‌ కుటుంబానికి చెందిన కొందరువ్యక్తులకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలున్నాయన్నారు. అంతే కాదు తెలంగాణకు చెందిన ఓ లిక్కర్ మాఫియా నేత ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఫ్లైట్‌లో ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌లో సెటిల్‌మెంట్‌ కుదుర్చుకున్నారని విమర్శించారు. ఫస్ట్ ఇన్‌స్టాల్మెంట్‌గా మనీశ్‌ సిసోడియాకు 150కోట్ల రూపాయలు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ.


Mulugu: ఫ్రెండ్ షిప్ పేరుతో హద్దులు దాటారు.. కానీ వాడు మాత్రం అలా చేస్తాడనుకోలేదు.


టీఆర్ఎస్‌ వర్సెస్ బీజేపీ..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిసి ఒబెరాయ్ హోటల్ లోనే పాలసీని రూపొందించారన్నారు బీజేపీ ఎంపీ. ఇదే మద్యం పాలసీ తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలలోనూ అమలవుతోందని విమర్శించారాయన. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గరున్నాయని కేసీఆర్ కుటుంబసభ్యులతో మనీశ్‌ సిసోడియా మీటింగ్ జరిపారా ? లేదా ? చెప్పాలని పర్వేశ్ డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. మరోవైపు టీఆర్ఎస్‌పై బీజేపీ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను తెలంగాణ కాంగ్రెస్‌ వంతపలుకుతోంది. ఏకవచన పదజాలంతో విమర్శిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెడుతున్నారు ఆపార్టీ నేతలు. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాలు, కుట్రపూరితమైన రాజకీయాలకు తాము భయపడే ప్రసక్తి లేదని టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ ఈవ్యవహారాన్ని కొట్టిపారేశారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Bjp, Kalvakuntla Kavitha, Telangana News

ఉత్తమ కథలు