హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana politics : బతుకమ్మ పండుగను అవమానిస్తారా .. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ట్వీట్‌పై TRSనేతలు ట్రోల్

Telangana politics : బతుకమ్మ పండుగను అవమానిస్తారా .. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ట్వీట్‌పై TRSనేతలు ట్రోల్

rajgopal vs kavitha(file photo)

rajgopal vs kavitha(file photo)

Hyderabad: మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రాజకీయంగా విమర్శించాలని చూస్తే అది కాస్తా సెంటిమెంట్‌ టర్న్ తీసుకుంది. ఫలితంగా సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్‌పై ట్రోల్ చేస్తున్నారు తెలంగాణ వాదులు, టీఆర్ఎస్‌ శ్రేణులు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy rajgopal reddy)టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla kavitha)ను రాజకీయంగా విమర్శించాలని చూస్తే అది కాస్తా సెంటిమెంట్‌ టర్న్ తీసుకుంది. ఫలితంగా సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్‌(Post)పై ట్రోల్(Troll) చేస్తున్నారు తెలంగాణ వాదులు, టీఆర్ఎస్‌ (TRS)శ్రేణులు. బైపోల్‌లో గెలుస్తామనే ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్న బీజేపీ శ్రేణులు ఢిల్లీ(Delhi) లిక్కర్ స్కాంను అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారు. ఈవిమర్శల్లో భాగంగానే రాజగోపాల్‌రెడ్డి సైతం ఈసారి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఎక్కడ జరుగుతాయి ..? ఈడీ(ED) ఆఫీసా లేక సీబీఐ(CBI) ఆఫీసా ? అది కాదంటే తీహార్‌ జైలా(Tihar Jail) ? అంటూ ట్విట్టర్‌(Twitter)లో పోస్ట్ పెట్టడం దుమారానికి కారణమైంది.

Paruchuri Gopalakrishna : పవన్ కల్యాణ్‌ అన్నగారితో సమానం .. పవర్‌ స్టార్‌ని ఆ పదవిలో చూడాలని ఉంది : పరుచూరి గోపాలకృష్ణవిమర్శించబోయి..
తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ఇప్పటి నుంచే సర్వశక్తులను ఒడ్డుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ను గద్దె దించడమే టార్గెట్‌గా చేసుకుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేశారు. ఆమెకు సన్నిహితుల ఇళ్లలో ఈడీ సోదాలు కూడా చేపట్టింది. దీనికి కొనసాగింపుగానే మాజీ ఎమ్మెల్యే ఇటీవల బీజేపీలో చేరిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కవితను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అందులో ఈసారి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఎక్కడ జరుగుతాయి అంటూ క్వశ్చర్ మార్క్‌ పెట్టి ప్రశ్నను సంధించారు. అంతే కాకుండా ఈడీ ఆఫీసులోనా లేక సీబీఐ ఆఫీసులోనా లేదంటే తీహార్ జైలులోనా అంటూ క్వశ్చన్ మార్క్‌ పెట్టి విమర్శించారు.


ట్రోలింగ్‌ షురూ ..
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ట్వీట్‌ రాజకీయ విమర్శను తప్పుపడుతున్నారు తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్‌ శ్రేణులు. తెలంగాణ ప్రజలు పవిత్రంగా జరుపుకునే బతుకమ్మ పండుగను ఇలా అవమానిస్తారా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. బీజేపీ సిద్ధాంతం ఇదేనా అంటూ ట్విట్టర్‌లో రాజగోపాల్‌రెడ్డిని విమర్శిస్తున్నారు.


ట్వీట్‌ వార్ ..
ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్ , మహేంద్రనాథ్‌ పాండే మోదీ ఫోటో పెట్టడం లేదని రాద్ధాంతం చేశారు. వాళ్ల వ్యవహార తీరును కామెంట్ చేస్తూ బుధవారం కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆసరా ఫించన్ల పంపిణి కార్యక్రమానికి హాజరైన సందర్భంలో పెట్రోల్, గ్యాస్‌ ఇతర నిత్యవసర వస్తువుల ధరలు పెంచిన మోదీ ఫోటోని అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పడాన్ని బీజేపీ శ్రేణులు వ్యతిరేకిస్తూ ఆమెపై లిక్కర్ స్కాంను మళ్లీ తెరపైకి తెచ్చి విమర్శించాలని ప్లాన్ చేశారు. అయితే రాజగోపాల్‌రెడ్డి చేసిన ట్వీట్‌తో సీన్ రివర్స్ అయింది.

Published by:Siva Nanduri
First published:

Tags: Kalvakuntla Kavitha, Komatireddy rajagopal reddy, Telangana Politics

ఉత్తమ కథలు