హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR-Harish Rao: మునుగోడు బరిలోకి ఒకేసారి కేటీఆర్, హరీశ్ రావు.. పక్కా ప్లాన్

KTR-Harish Rao: మునుగోడు బరిలోకి ఒకేసారి కేటీఆర్, హరీశ్ రావు.. పక్కా ప్లాన్

కేటీఆర్, హరీశ్ రావు (ఫైల్ ఫోటో)

కేటీఆర్, హరీశ్ రావు (ఫైల్ ఫోటో)

Munugodu: ఈ నెల 20 తరువాత కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ మునుగోడుకు వెళ్లబోతున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారం ముగిసేంతవరకు అక్కడే ఉంటారని తెలుస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి మునుగోడు ఉప ఎన్నిక మీదే ఉంది. ఈ ఉప ఎన్నిక బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా ఉంటుందనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇక్కడ ఎవరు గెలిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దాదాపుగా వారి సొంతమవుతుందనే చర్చ కూడా జరుగుతోంది. అందుకే ఇక్కడ గెలిచేందుకు టీఆర్ఎస్, బీజేపీ తమదైన వ్యూహాలను రచిస్తూ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నాయి. ఇప్పటికే మునుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేటీఆర్ (KTR). పార్టీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని బీజేపీని టార్గెట్ చేశారు. అయితే మునుగోడులో(Munugodu) మరో మంత్రి, టీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు(Harish Rao) మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. తనకు కేటాయించిన మండలానికి వెళ్లలేదు. ఆయన అనుచరులు అక్కడ ప్రచార సరళిని పరిశీలిస్తున్నా.. హరీశ్ రావు మాత్రం ఇంకా మునుగోడులో అడుగుపెట్టలేదు.

అయితే కేటీఆర్ , హరీశ్ రావు ఇద్దరూ ఒకేసారి మునుగోడు ఉప ఎన్నికల కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. హరీశ్ రావు, కేటీఆర్ హైదరాబాద్‌లోనే ఉంటున్నప్పటికీ... ఎప్పటికప్పుడు మునుగోడులో పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశంపై పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నేతలకు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 20 తరువాత కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ మునుగోడుకు వెళ్లబోతున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారం ముగిసేంతవరకు అక్కడే ఉంటారని తెలుస్తోంది.

మునుగోడులో ఈ ఇద్దరు నేతలు తామేమీ చేయాలనే దానిపై ఓ అవగాహనకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర పార్టీల నేతలను తమ వైపు తిప్పుకోవడంతో పాటు వామపక్షాల నేతలతో సమన్వయం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లతో మమేకం కావడం వంటి అంశాలను హరీశ్ రావు చూసుకుంటారని సమాచారం. ఇక అసంతృప్తి నేతలను బుజ్జగించడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించడం వంటి విషయాలపై కేటీఆర్ ఫోకస్ చేస్తారని తెలుస్తోంది.

Munugodu : అయోమయంలో హస్తం గుర్తు పార్టీ .. మునుగోడులో కాళ్లు పట్టుకొని ఓటేయమని కోరుతున్న కాంగ్రెస్ నాయకులు

Munugodu: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం..మునుగోడు బైపోల్ బరిలో ఎంత మంది నిలిచారంటే?

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యతను సీఎం కేసీఆర్ ఈ ఇద్దరు నేతలకు అప్పగించారని.. అందుకే గతానికి భిన్నంగా ఈ ఇద్దరు నేతలు కలిసి ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం పని చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మునుగోడులో గెలుపు కోసం రంగంలోకి దిగబోతున్న కేటీఆర్, హరీశ్ రావు.. టీఆర్ఎస్‌ను బీజేపీపై గెలిపించడంతో ఏ విధంగా సక్సెస్ అవుతారన్నది చూడాలి.

First published:

Tags: Munugodu By Election, Telangana

ఉత్తమ కథలు