హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : మంత్రి మల్లారెడ్డిపై దాడి .. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య డైలాగ్‌ వార్

Telangana : మంత్రి మల్లారెడ్డిపై దాడి .. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య డైలాగ్‌ వార్

(అటాక్ పాలిటిక్స్ )

(అటాక్ పాలిటిక్స్ )

TRS VS Congress: మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడిపై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య డైలాగ్‌ వార్‌ జరుగుతోంది. తన హత్యకు కుట్ర పన్నారని మంత్రి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ కౌంటర్ ఇచ్చింది. మంత్రిగా ఉన్న నీపైనే హత్యకు కుట్ర జరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతుందా అంటూ సెటైర్‌లు వేశారు సీఎల్పీనేత భట్టివిక్రమార్క.

ఇంకా చదవండి ...

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి Mallareddyకాన్వాయ్‌పై దాడి వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఘాటుగా స్పందించాయి. తనను చంపడానికే ప్లాన్ వేశారంటూ మల్లారెడ్డి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(Revanthreddy)పై ఆరోపణలు చేశారు. ఇదంతా తనకు తెలుసని..తనపై దాడి చేసిన వాళ్లను, హత్యకు కుట్ర పన్నిన వాళ్లను ఎవర్ని విడిచిపెట్టమని చెప్పారు. రెడ్డి సింహగర్జన సభకు హాజరైన మంత్రిపై దాడికి పాల్పడం సరైన పద్దతి కాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Talasani Srinivas Yadav). ఓ ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన్ని ఆహ్వానించి కేవలం రెడ్డి కార్పొరేషన్‌(Reddy Corporation‌)పై మాట్లాడి వెళ్లిపోవాలన్నట్లుగా వ్యవహరించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తలసాని. ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రిగా ఆయన ఏం చేశాం, ఏం చేయబోతున్నామనే విషయాన్ని కూడా చెప్పనివ్వకుండా..తప్పు పట్టడం మంచి సంప్రదాయం కాదన్నారు. మల్లారెడ్డిపై దాడి విషయంలో వ్యవస్థలు వాటి పని అవి చేస్తాయన్నారు.

గులాబీ నేతల ఖండన..

రెడ్డి సింహగర్జన సభకు వెళ్లిన సమయంలో మల్లారెడ్డిపై దాడి జరిగింది. ఇది కేవలం టీపీసీసీ చీఫ్‌ చేయించినన పనిగా మంత్రి ఆరోపించారు. తన హత్యకు కుట్ర పన్నారని..ఈవిషయం తనకు తెలుసని మీడియా సాక్షిగా రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. అయితే మంత్రి మల్లారెడ్డి కామెంట్స్‌కి ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క. ఒక మంత్రిపై హత్యకు కుట్ర జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది నిద్రపోతుందా అని మండిపడ్డారు. మీపై దాడి జరుగుతుంటే ఒక మంత్రిగా దాన్ని కట్టడి చేయకుండా విఫలమవడమే కాకుండా అర్ధంపర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు భట్టివిక్రమార్క.

మల్లారెడ్డి ఓ బలిపశువా..

ఘట్‌కేసర్‌ రెడ్డి సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిని ఏమాత్రం ఖండించడం లేదు కాంగ్రెస్‌ పార్టీ. సీఎల్పీనేత భట్టివిక్రమార్క ప్రభుత్వం మంత్రికి రక్షణ కల్పించడంలో విఫలమైందని అంటే మరో నేత ఏకంగా రెడ్డి కార్పొరేషన్ హామీని నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ అమాయకుడైన మంత్రి మల్లారెడ్డిని ముందు పెట్టి బలిపశువును చేశారంటూ మండిపడ్డారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి.

గతం మర్చిపోతే ఎలా ..

ఇదంతా ఇలా ఉంటే అసలు మంత్రి మల్లారెడ్డి ఓ పిచ్చోడిని విమర్శించారు వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి. ఆయన్ని ఎందుకు పిలిచారో ..అతను ఏం మాట్లాడినాడో ఎవరికి అర్ధం కాలేదు. పైగా తనపై కుట్ర, దాడి చేసింది రేవంత్‌రెడ్డి అంటూ అమెరికాలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేస్తున్నారని రాజేందర్‌రెడ్డి మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తేనే నాయిని నర్సింహరెడ్డి మల్లారెడ్డిపై ఆర్ట్స్‌ కాలేజీ తగిన గుణపాఠం చెప్పారని...అప్పుడు కూడా రేవంత్‌రెడ్డే చేశారా అంటూ ధ్వజమెత్తారు. వయసులో పెద్దవాడిగా ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గు ఉండాలని వరంగల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

First published:

Tags: Bhatti Vikramarka, Mallareddy, Minister talasani srinivas, Telangana Politics

ఉత్తమ కథలు