హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: అధికార పార్టీలో ముసలం .. మాజీ మేయర్ రవీందర్ సింగ్ .. అల్లుడి ఆడియో టేపు కలకలం

Telangana Politics: అధికార పార్టీలో ముసలం .. మాజీ మేయర్ రవీందర్ సింగ్ .. అల్లుడి ఆడియో టేపు కలకలం

Karimnagar Politics

Karimnagar Politics

Telangana Politics: కరీంనగర్ టీఆర్ఎ పార్టీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కొద్దిరోజులుగా తనరూటే సప రేటు అంటూ సింగిల్‌గా వెళ్తున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్‌పై నగర టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కసారిగా మూకుమ్మడి యుద్ధానికి దిగారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  కరీంనగర్(Karimnagar)టీఆర్ఎస్(TRS) పార్టీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కొద్దిరోజులుగా తనరూటే సప రేటు అంటూ సింగిల్‌గా వెళ్తున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్‌(Ravinder Singh)పై నగర టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కసారిగా మూకుమ్మడి యుద్ధానికి దిగారు. రవీందర్ సింగ్ ఆయన కుటుంబ సభ్యులు మంత్రి గంగుల కమలాకర్‌(Gangula Kamalkar)కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రవీందర్ సింగ్ అల్లుడు ఓ వ్యాపారితో ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపు(Audio tape)ను టీఆర్ఎస్ కార్పొ రేటర్లు(Corporators)బహిర్గతం చేయగా .. సింగ్ కుటుంబాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ అధిష్టానాన్ని కోరారు.ఈ మేరకు మంత్రి కమలాకర్ , టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని కలిసి వినతిపత్రం సమర్పించడం నగరంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

  Telangana politics : నేడు భేటీ కానున్న కేసీఆర్‌, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ..జాతీయ రాజకీయాలపైనే ప్రధాన చర్చ

  ఆడియో టేపుల కలకలం..

  కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తిగా మారాయి. కుట్రలు కుతంత్రాలతో పార్టీకి నష్టం చేయడంతో పాటు పార్టీ నాయకులను అప్ర దిష్ట పాలు చేసేవిధంగా వ్యవహరిస్తున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ , కార్పొరేటర్ కమల్టిత్ కౌర్ , నాయకుడు సోహాన్ సింగ్ ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలని స్థానిక డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణితో పాటు టిఆర్ఎస్ కార్పొరేటర్లు రాష్ట్రముఖ్యమంత్రిని , మంత్రి గంగుల కమలాకర్ , పార్టీ జిల్లా అధ్యక్షులు జివి . రామకృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ సింగ్‌తో పాటు కార్పొరేటర్ కమల్టిత్ కౌర్ఆమె భర్త సోహాని సింగ్‌ మంత్రి గంగుల కమలాకర్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్స్‌ను ఈ సందర్భంగా బయట పెట్టారు. ఈ వీడియోలో మంత్రి పట్ల అమర్యాదగా మాట్లాడడమే కాకుండా నిర్లక్ష్యంగా మాట్లాడిన విషయాలను వివరించారు.

  ఆరోపణలపై ఆధారాలు..

  రాత్రికి రాత్రి రోడ్లను ధ్వంసం చేసి ఆ వార్డులో సమస్యలు సృషిస్తూ వాటిని రాద్దాంతం చేస్తూ దీన్ని మంత్రిపై రుద్దడం భావ్యం కాదని కరీంనగర్‌ టౌన్‌ కార్పొరేటర్లు తెలిపారు. కొంత కాలంగా వీరిరువురు అకారణంగా ఆరోపణలు చేస్తూ డివిజన్‌లో అభివృద్ధి పనులు జరుగడం లేదని నీటి సమస్య తీవ్రంగా ఉందంటూ గొడవ చేస్తున్నారని అన్నారు. దీనికి తోడు మంత్రి గంగుల కమలాకర్ సమస్యలు సృష్టి స్తున్నారంటూ ప్రచారం చేయడంపై ధ్వజమెత్తారు కార్పొరేటర్లు. స్మార్ట్ సిటీ కాంట్రాక్టరు మామూళ్ల కోసం బెదిరించడం, పనుల్లో నాణ్యత లేదంటూ ఇబ్బందుల పాలుచేస్తున్న సందర్భాలు ఉన్నాయంటూ ఓ కాంట్రాక్టరు 10 లక్షలు డిమాండ్ చేసిన ఆధారాలు కూడా తమ దగ్గరున్నాయని ఆరోపించారు.

  Telangana politics : రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్‌పై పోటీకి బంధువు రెడీ .. ఎవరో..? ఏ పార్టీ నుంచంటే

  ఎవరి వాదన వారిది..

  సీఎం కేసీఆర్ దయవల్లే రవీందర్ సింగ్ మేయర్ అయ్యారని , కమర్జిత్ కౌర్‌కు కార్పొ రేటర్ పదవి దక్కిందనే విషయాన్ని మర్చిపోవద్దని టీఆర్ఎస్‌ నేతలు హితవు పలికారు. తక్షణమే వారిరువురు భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై అధిష్టానం తీవ్రంగా పరిగ ణించాలని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై అటు ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ దంపతులు సైతం స్పందించారు. ఉద్యమకాలం నుంచి తాము పార్టీ కోసం పనిచేస్తున్నామని పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారు. అంతే కాదు నగరంలో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనుల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్లు అవినీతికి పాల్పడుతున్నారని ఎదురుదాడికి దిగారు. అధికార పార్టీలో రాజుకున్న ఈ ఆడియో టేపులు, పరస్పర ఆరోపణలపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimangar, Telangana Politics, TRS leaders

  ఉత్తమ కథలు