హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana politics : వజ్రోత్సవాల వేడుకల్లో బయటపడ్డ వర్గపోరు .. కొట్టుకున్న అధికార పార్టీ నేతలు

Telangana politics : వజ్రోత్సవాల వేడుకల్లో బయటపడ్డ వర్గపోరు .. కొట్టుకున్న అధికార పార్టీ నేతలు

trs vargaporu

trs vargaporu

TRS CLASS WAR: ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన నాయకులు అయినప్పటికి సంయమనం కోల్పోయి...ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు పోటీ పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్య వజ్రోత్సవాల వేడుకల్లో ఎమ్మెల్యే కొడుకు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మధ్య గలాటా జరిగింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Gadwal, India

  (Syed Rafi, News18,Mahabubnagar)

  తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్య వజ్రోత్సవాలలో భాగంగా జోగులాంబ గద్వాల(Jogulamba gadwal)జిల్లా టిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు బయటపడింది. అలంపూర్(Alampur)నియోజకవర్గం వడ్డేపల్లి(Vaddepalli)మున్సిపాలిటీ శాంతినగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్(Saichand), అలాగే... స్థానిక ఎమ్మెల్యే అబ్రహం(MLA Abraham)తనయుడు అజయ్ (Ajay)ఇద్దరూ స్టేజిపై కుమ్ములాడుకున్న వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది. వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా స్టేజిపై సాయి చంద్ అభిమానులు తనకు బొకేలు ఇచ్చి సెల్ఫీలు, ఫోటోలు దిగే సందర్భంగా అజయ్ తన అనుచరులతో స్టేజిపై రావడంతో రచ్చ రచ్చైంది.

  Uttam Kumar Reddy : మంత్రిని బాహుబలి అని పొగిడిన జిల్లా ఎస్పీ.. నీకు ఎమ్మెల్సీ పదవి ఖాయమంటూ ఉత్తమ్‌ ట్వీట్

  వజ్రోత్సవ వేడుకల్లో వర్గపోరు ..

  ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన నాయకులు అయినప్పటికి సంయమనం కోల్పోయి...ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు పోటీ పడ్డారు. ఈక్రమంలోనే అజయ్‌ తన వర్గంతో సాయిచంద్‌పై భౌతిక దాడికి దిగడం.. అసభ్య పదజాలంతో దుర్భాషలాడటం జరిగింది. సాయిచంద్‌పై దాడి కూడా చేశారు. సాయి చంద్‌ చేతికి గాయమైంది. గొడవ పెద్దది అవుతున్న సమయంలోనే పోలీసులు కలుగచేసుకొని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం తనపై జరిగిన దాడిపై తెలంగాణ రాష్ట్ర గిడ్డంగులు కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్‌ మాట్లాడారు. ఎమ్మెల్యే కుమారుడు అజయ్‌ తన అనుచరులతో తనపై దాడి చేశారని ఆరోపించారు. అజయ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొద్ది సేపు అక్కడే భైటాయించారు. పోలీసులు సాయిచంద్‌కి నచ్చజెప్పి ఎస్కార్ట్ మధ్య అతడ్ని అక్కడి నుంచి పంపించారు.

  ఒకరిపై మరొకరు దాడి..

  కార్యక్రమం జరుగుతుండగా వేదికపై ఎవరు ఆహ్వానిస్తే వచ్చావంటూ సాయిచంద్‌ని ఎమ్మెల్యే కుమారుడు అజయ్ ప్రశ్నించడం వల్లే ఈఘర్షణ జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే తనపై జరిగిన దాడి, అవమానాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ సాయిచంద్‌ ఆవేదనతో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  Hostel food : ఆ హాస్టల్‌లో పురుగులున్న అన్నమే పరమాన్నం.. తినలేక విద్యార్ధులు పస్తులుంటున్న వైనం

  ప్రారంభంలోనే రసాభాస..

  ఈగలాట జరగకు ముందు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం మహబూబ్ నగర్ జడ్పీ మైదానం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ జెండాను పట్టుకొని బోలో భారత్ మాతాకి జై...జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ కదిలారు. బస్టాండ్, అశోక్ టాకీస్ చౌరస్తా, క్లాక్ టవర్, తెలంగాణ చౌరస్తా మీదుగా జూనియర్ కళాశాల గ్రౌండ్స్ వరకు భారీ ర్యాలీ. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. ఈకార్యక్రమంలో మంత్రితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులుతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Jogulamba gadwal, Telangana Politics

  ఉత్తమ కథలు