Home /News /telangana /

TS POLITICS TRS LEADER KALVAKUNTLA KAVITHA CLARIFIES ON CONTESTING FROM NIZAMABAD LOK SABHA SEAT AK

Kalvakuntla Kavitha: నిజామాబాద్ విషయంలో కవిత తేల్చేశారా ?..ఆ రూమర్స్‌కు చెక్ ?

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (ఫైల్ ఫోటో)

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (ఫైల్ ఫోటో)

Kavitha: గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యే సీట్లను టీఆర్ఎస్ గెలుచుకోవడంలో కవిత కీలక పాత్ర పోషించారు.

    తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు మరోసారి తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా ? ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత.. మళ్లీ ఎంపీగానే పోటీ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారా ? ఇటీవల ఆమె మాటలు విన్న చాలామంది కవిత మరోసారి నిజామాబాద్ ఎంపీగానే పోటీ చేయబోతున్నారని చర్చించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో తనపై విజయం సాధించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కవిత(Kalvakuntla Kavitha) విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు తెస్తానన్న ఎంపీ అరవింద్(Dharmapuri Arvind) మాటలు నమ్మి రాష్ట్రవ్యాప్తంగా 90 వేల మందికి పైగా రైతులు పసుపు పండిచారని, ఇప్పుడు వారి పరిస్థితి ఏంటని కవిత మండిపడ్డారు. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్న అరవింద్.. ఎప్పుడు పసుపు బోర్డు తెస్తారని ప్రశ్నించారు. మోకాళ్ళ యాత్ర చేస్తారో.. కేంద్రం లోని మీ నాయకుల వద్ద మోకరిల్లుతారో మాకు అనవసరమని.. రాష్ట్రానికి పసుపు బోర్డు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

    ఈ ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు 50 వేల కోట్లు కేటాయించిందని, బీజేపీ నేతలు వారి తప్పులు కప్పి పుచ్చుకోవడానికి గ్రూప్ వన్ ఉర్దూ మీడియం పేరిట కొత్త వివాదం లేవదీస్తున్నారని బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. మరోవైపు కవితకు దమ్ముంటే మళ్ళీ తనపై పోటీచేయాలని అరవింద్ సవాల్ విసిరారు. ఓటమి మత్తు దిగటంతో కవిత మూడేళ్ళ తర్వాత బయటకొచ్చారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తండ్రి, అన్న మాదిరి కవిత .. చిల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయితే కవిత ఉన్నట్టుండి ఎంపీ ధర్మపురి అరవింద్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందనే చర్చ జరుగుతోంది.

    ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. ఒకదశలో ఆమె కేసీఆర్ కేబినెట్‌లోకి వస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ధర్మపురి అరవింద్‌ను టార్గెట్ చేయడం ద్వారా మరోసారి తాను ఎంపీగా పోటీ చేయబోతున్నాననే సంకేతాలను కవిత పంపించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    TS Politics: తెలంగాణ మాజీమంత్రి మళ్లీ డైలమాలో పడిపోయారా ? ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ?

    Telangana: బండి సంజయ్‌తో మాజీ ఎంపీ భేటీ ? కాషాయ కండువా కప్పుకుంటారా ?

    గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యే సీట్లను టీఆర్ఎస్ గెలుచుకోవడంలో కవిత కీలక పాత్ర పోషించారు. అంతకుముందు జీవన్ రెడ్డి గెలిచిన జగిత్యాల వంటి సీటులోనూ టీఆర్ఎస్ జెండా ఎగరేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ నిజామాబాద్‌లో మరోసారి ఎంపీగా గెలవడంతో పాటు కవిత విజయం సాధించలేకపోయారు. అయితే లోక్‌సభ ఎన్నికలు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉండటంతో.. ఇప్పటి నుంచే నిజామాబాద్ ఎంపీగా గెలిచేందుకు కవిత ప్రయత్నాలు మొదలుపెట్టారనే ప్రచారం సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Kalvakuntla Kavitha, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు