హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR | TRS : కేసీఆర్ ప్రధాని కావాలంటూ .. మద్యం,కోళ్లు పంచిన టీఆర్ఎస్‌ నేత ..ఎక్కడో తెలుసా..?

KCR | TRS : కేసీఆర్ ప్రధాని కావాలంటూ .. మద్యం,కోళ్లు పంచిన టీఆర్ఎస్‌ నేత ..ఎక్కడో తెలుసా..?

WARANGAL TRS LEADER

WARANGAL TRS LEADER

Kcr | Trs: వరంగల్ చౌరస్తాలో అధికార పార్టీకి చెందిన రాజనాల శ్రీహరి అనే నాయకుడు స్థానిక హమాలీలకు మద్యం బాటిళ్లతో పాటుగా కోళ్లను ఉచితంగా పంచిపెట్టడం దుమారం రేపుతోంది. అసలు ఎందుకు వాటిని ఇచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

(P.Srinivas,New18,Karimnagar)

టీఆర్ఎస్‌(TRS) అధ్యక్షుడు కేసీఆర్(KCR) జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఆ పార్టీ శ్రోణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. గులాబీ బాస్ నిర్ణయానికి మద్దతిస్తూ ప్రతి జిల్లాలో పార్టీ పలు కార్యక్రమాలు చేపట్టమంటే వరంగల్‌(Warangal)లో ఓ నేత ఏకంగా స్థానికులకు మందు(Liquor), కోళ్ల(Chickens)ను పంచిపెడుతూ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ నేత చేపట్టిన కార్యక్రమమే వైరల్‌గా మారింది. టీఆర్ఎస్‌ పార్టీ వ్యవహారంపై విపక్షాలు విమర్శలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. వరంగల్ చౌరస్తాలో అధికార పార్టీకి చెందిన రాజనాల శ్రీహరి(Rajanala Srihari)అనే నాయకుడు స్థానిక హమాలీ(Laborers)లకు మద్యం బాటిళ్లతో పాటుగా కోళ్లను ఉచితంగా పంచిపెట్టడం దుమారం రేపుతోంది.

Crime news : లేడీ సీఐతో మరో సీఐ సీక్రెట్ రిలేషన్‌షిప్ ..ఇద్దర్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది ఎవరో తెలుసా ..?

వైరల్ అవుతున్న వీడియో..

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈసందర్భంగా వరంగల్‌కు చెందిన టీఆర్ఎస్‌ నేత రాజనాల శ్రీహరి కేసీఆర్‌ ప్రధాని కావాలంటూ వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. అధికార పార్టీలో ఉంటూ మద్యం పంపిణీ చేయడం అనేక విమర్శలకు దారితీస్తోంది.

విమర్శల వెల్లువ ..

పబ్లిక్‌గా మద్యం, కోళ్లు పంచిపెట్టడం ..అందులో కూడా అధికార పార్టీకి చెందిన నేతలు నిర్వహించడం సరికాదని విపక్షాలు, స్థానికులు విమర్శలు చేస్తుంటే దాన్ని అధికార టీఆర్ఎస్‌ నేతలు సమర్ధించుకుంటున్నారు. మద్యం బాటిళ్లు పంచిన పెట్టిన రాజనాల శ్రీహరి దసరా కానుకగా హమాలీలకు కోళ్లు, లిక్కర్ బాటిల్స్ ఇచ్చానని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సమర్ధించుకున్నారు.

Munagodu: మునుగోడు ఉపఎన్నిక బాధ్యత వాళ్లిద్దరికే అప్పగింత .. కేసీఆర్‌ ప్లాన్‌ వర్కవుటయ్యేనా..?

ఇదెక్కడి సంప్రదాయం..

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించడం సంతోషంగా ఉందన్న సదరు నేత గులాబీ బాస్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధిపథంలో ముందుకెళ్తోందని ..రేపు జాతీయ రాజకీయాల్లో కూడా ఇదే విధంగా ప్రత్యేకముద్ర వేసుకుంటారని శ్రీహరి చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అధికార పార్టీ నేతగా ఉండి కూలీలకు మద్యం, కోళ్లు పంపిణి చేయడం సరైన పద్దతి కాదంటున్నారు స్థానికులు, విపక్షాల నేతలు. ఇప్పటికే టీఆర్ఎస్‌ జాతీయ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా ప్రకటించిన నేపధ్యంలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆ పార్టీ పేరును వక్రీకరిస్తూ బార్‌ అండ్ రెస్టారెంట్ పార్టీ అని సెటైర్ వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీఆర్ఎస్‌ నేత ఈవిధంగా మద్యం బాటిళ్లు, కోళ్లు పంచడంతో కొందరు షర్మిల మాటలను గుర్తుకు చేసుకుంటున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Telangana Politics, TRS leaders, Warangal

ఉత్తమ కథలు