Home /News /telangana /

TS POLITICS TRS LEADER BONTHU RAM MOHAN BECOME ACTIVE AGAIN HOPES ON GHMC PARTY PRESIDENT POST AK

ఆ టీఆర్ఎస్ నేత మళ్లీ యాక్టివ్ అవుతున్నారా ? ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారా ?

బొంతు రామ్మోహన్ (ఫైల్ ఫోటో)

బొంతు రామ్మోహన్ (ఫైల్ ఫోటో)

Telangana News: ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన బొంతు రామ్మోహన్‌ భావించారని.. కానీ ఈ విషయంలో ఆయన ఆశలు నెరవేరలేదని చెబుతుంటారు.

    టీఆర్ఎస్‌లో ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలనే దానిపై కీలక నిర్ణయాలు పార్టీ అధినేత కేసీఆర్ తీసుకుంటారు. ఆయన ఎప్పుడు తమకు పార్టీ, ప్రభుత్వ, నామినేటెడ్ పదవులు ఇస్తారా ? అని నేతలు ఎదురుచూస్తుంటారు. తాజాగా టీఆర్ఎస్‌ తరపున గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా వ్యవహరించిన బొంతు రామ్మోహన్(Bonthu Ram mohan) కూడా ఓ పదవిపై ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు పార్టీ కోసం గట్టిగా పని చేసిన బొంతు రామ్మోహన్.. కేసీఆర్, కేటీఆర్‌కు బాగా దగ్గరయ్యారు. దీంతో కొన్నేళ్ల క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్(TRS) భారీ విజయం సాధించిన తరువాత కీలకమైన మేయర్ పదవి బొంతు రామ్మోహన్‌కు కట్టబెట్టింది గులాబీ పార్టీ నాయకత్వం. ఎవరూ ఊహించని విధంగా జీహెచ్ఎంసీ మేయర్ కావడంతో.. బొంతు రామ్మోహన్‌కు భవిష్యత్తులో కీలక పదవులు వస్తాయని చాలామంది భావించారు.

    ఉప్పల్ (Uppal) ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన బొంతు రామ్మోహన్‌ భావించారని.. కానీ ఈ విషయంలో ఆయన ఆశలు నెరవేరలేదని చెబుతుంటారు. ఆ తరువాత తనకు పార్టీ నాయకత్వం ఎమ్మెల్సీ పదవి ఇస్తుందని ఆశించారు బొంతు రామ్మోహన్. కానీ అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. ఇక కొన్నేళ్ల క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన భార్య శ్రీదేవి యాదవ్‌కు మేయర్ పదవి ఇవ్వాలని ఆయన టీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు.

    కానీ పార్టీ మాత్రం కేశవరావు కూతురు, బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మీకి అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి బొంతు రామ్మోహన్ పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉంటున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజాగా బొంతు రామ్మోహన్ మళ్లీ యాక్టివ్ అయ్యారని.. పార్టీ కార్యక్రమాల్లో ఎప్పటిలాగే పాల్గొంటున్నారనే చర్చ జరుగుతోంది. అయితే పార్టీలో కీలకమైన పదవిపై బొంతు రామ్మోహన్ ఆశలు పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. కీలకమైన జీహెచ్ఎంసీ అధ్యక్ష పదవి తనకు దక్కుతుందని బొంతు రామ్మోహన్ భావిస్తున్నట్టు సమాచారం.

    Telangana| KCR: కేసీఆర్ ఆశలు ఆవిరి.. బీజేపీ హ్యాపీ.. కాంగ్రెస్‌కు డబుల్ పవర్

    Telangana| KTR: ఎమ్మెల్యే అంటే రాజు కాదు.. ఉద్యమకారులైతే ఏంటి ?.. కేటీఆర్ వార్నింగ్

    అయితే ఈ పదవిని సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ఇవ్వాలని ప్రతిపాదన కూడా పార్టీ నాయకత్వం దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు, మాస్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావుకు ఆ పదవి ఇవ్వడం ద్వారా ఆయన మరింత దూకుడుగా ముందుకు వెళతారని.. బీజేపీ జోరుకు కళ్లెం వేసేలా పని చేస్తారని పార్టీ భావిస్తోందని సమాచారం. మొత్తానికి టీఆర్ఎస్ పాలిటిక్స్‌లో మళ్లీ యాక్టివ్ అయిన బొంతు రామ్మోహన్‌కు పార్టీ ఏ రకమైన పదవి లేదా బాధ్యత ఇస్తుందో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Telangana, Trs

    తదుపరి వార్తలు