TS POLITICS TRS LEADER ASSAULTING A MINOR IN MEDAK DISTRICT POLICE FILE CASE IN POCSO ACT SNR MDK
Medak:మైనర్ బాలికపై టీఆర్ఎస్ నాయకుడు లైంగిక దాడి..పలుకుబడిని అడ్డుపెట్టుకొని అరాచకం
(మైనర్పై లైంగికదాడి)
Medak: మెదక్ జిల్లాలో మైనర్ బాలికపై టీఆర్ఎస్ నాయకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంట్లో వాళ్లను బెదిరించి బాలికను ఎత్తుకెళ్లడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలిని టీఆర్ఎస్ నేత బన్నయ్య ఇంట్లోంచి తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అనుచరుడిగా ఉన్న బన్నయ్య అనే వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
(K.Veeranna, News18,Medak)
ప్రజాప్రతినిధుల కంటే వారి పక్కన తిరిగే వాళ్లు, అనుచరులు, మద్దతుదారులే ఎక్కువగా నేరాలకు, దారుణాలకు పాల్పడుతున్నారు. మెదక్ (Medak)జిల్లా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రధాన అనుచరుడే మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టేక్మాల్ (Takmal) మండలం పాల్వంచ (Palvacha)గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక(Minor girl)పై బన్నయ్య(Bannayya) అనే టీఆర్ఎస్ నాయకుడు, ఆందోల్ ఎమ్మెల్యే (Andol MLA) క్రాంతికిరణ్ (Kranti Kiran)కి సన్నిహితుడిగా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం గ్రామానికి చెందిన మైనర్ బాలికను తీసుకెళ్లాడు బన్నయ్య. పది రోజుల తర్వాత తిరిగి తీసుకొచ్చి ఇంట్లో వదిలివెళ్లాడు. గ్రామంలో ఎమ్మెల్యే పేరు చెప్పుకొని పెద్ద మనిషిలా చలామణి అవుతున్న బన్నయ్య తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాలిక తల్లిదండ్రులు పంచాయితీ పెట్టారు. గ్రామ పెద్దల సమక్షంలో తాను తప్పు చేసినట్లు , మరోసారి మైనర్ బాలిక కుటుంబం జోలికి వెళ్లనని మాటిచ్చాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే బన్నయ్య విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంటే ఆసుపత్రికి తరలించారు. ప్రాణపాయం నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే సహచరుడు బాధితురాలి కుటుంబ సభ్యుల్ని బెదిరించాడు. ఆ అమ్మాయి కోసమే తాను పురుగుల మందు తాగానంటూ బిల్డప్ ఇచ్చి బలవంతంగా మరోసారి మైనర్ని ఎత్తుకెళ్లాడు బన్నయ్య. మైనర్ బాలికను అధికార పార్టీకి చెందిన నాయకుడు ఇలా పదే పదే ఇంటి నుంచి తీసుకెళ్లడంతో విసిగిపోయిన బాధితురాలి తండ్రి మూడ్రోజుల క్రితం టేక్మల్ పోలీసు(Police)లకు బన్నయ్యపై కంప్లైంట్ (Compliant)చేశాడు.
మైనర్పై టీఆర్ఎస్నేత అత్యాచారం..
బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు బనన్నయ్య ఇంటికి వెళ్లి పరిశీలించగా బాలిక ఇంట్లోనే ఉండటంతో ఆమెను పోలీసులకు అప్పగించారు. బన్నయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా అల్లాదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ జార్జ్ తెలిపారు. బాలికపై బన్నయ్య అత్యాచారానికి పాల్పడ్డట్లుగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
రాజకీయ పలుకుబడితో అరాచకం..
స్థానిక ఎమ్మెల్యే పక్కనే తిరిగే వ్యక్తి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అధికార పార్టీ నాయకులు అయి ఉండి ఇలాంటి నీచమైన పనులు చేయడానికి సిద్దులేదా అంటూ గ్రామస్తులు బన్నయ్యను తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. గతంలో పాల్పంచ గ్రామ అద్యక్షుడిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యే వెంట తిరుగుతూ పేరు సంపాధించుకున్నాడు. ఆ పొగరు, అహంకారంతోనే ఇలాంటి దురాగతానికి ఒడిగట్టాడని మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నాయకుడు మైనర్పై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై అటు కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం తీవ్రంగా తప్పు పడుతున్నారు. అధికారంలో ఉంటే ఇలాంటి నీచమైన పనులు చేసే వాళ్లను వెంట తిప్పుకొని క్షమిస్తారా అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.