(G. Srinivas Reddy, News18, Khammam)
పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas reddy). సమకాలీన రాజకీయాల్లో ఓవర్ క్వాలిఫైడ్. మంచితనం.. తెగింపు ఉన్న నేత. ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో ఊరూరా అనుచరులున్న ఈ నేత ప్రస్తుతం రోజురోజుకూ తన వారి నుంచే ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ మాజీ ఎంపీ (Former MP) … అనతి కాలంలోనే రాజకీయాల్లో తనకంటూ ప్రజల్లో బలమైన ముద్ర వేసుకున్న నాయకుడు పదవి లేకపోయినా TRSతో ప్రయాణం అని చెప్పిన నేత రాజకీయంగా ముందడుగులు వేయబోతున్నారా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. టీఆర్ఎస్తో తమ ప్రయాణం సాధ్యం కాదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారు. అందుకే త్వరలోనే మంచి జరుగుతుందని , దేవుడు అంతా మంచే చేస్తారని తొందరపడొద్దని తన అనుయాయులకు సంకేతం పంపారు . TRS లో స్వతంత్రంగా వ్యవహరించడం అధినేత కేసీఆర్ (KCR) కు అస్సలు నచ్చలేదు . అందుకే బలమైన నాయకుడిగా ఉన్న ఆయనకు ఏ పదవి లేకుండా చేశారని ఆయన అనుయాయులు గుర్రుగా ఉన్నారు .
వైయస్సార్ కాంగ్రెస్ (YSRCP) నుంచి 2014 లో ఎంపీ గా ఎన్నిక కావడమే కాకుండా ఆ పార్టీ తరుపున ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర కలిగినవాడు …తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీకే పరిమితం కావడంతో తెలంగాణలోని ఒక్క ఖమ్మం జిల్లాలోనే సత్తా చాటుకున్న వైకాపా కొద్దిరోజులకే అధికార టీఆర్ యస్ లో చేరింది. దీంతో ఇక్కడ వైకాపా లేకుండా పోయింది. శ్రీనివాసరెడ్డి ఎంపీ గా ఉండి TRS లో చేరుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR) తిరిగి ఎంపీ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలను 2018 లోనే పెట్టించి తిరిగి అధికారం లోకి వచ్చారు . ఆ ఎన్నికల్లో కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థి కాకుండా వైరాలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రాములు నాయక్ ను గెలిపించడం కేసీఆర్ కు అస్సలు నచ్చలేదు . పైగా మధిర ఇంచార్జిగా ఉండి అక్కడ టీఆర్ఎస్ తరపున పోటీచేసిన లింగాల కమల రాజ్ ను గెలిపించలేకపోయారు .దీంతో సీఎం కేసీఆర్ దగ్గర మైనస్ అయింది.
అయితే పార్టీ యువనేత కేటీఆర్ (KTR) తో మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే 2019 లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు ఖమ్మం పార్లమెంట్ సీటు వస్తుందని అనుకున్నా అది రాలేదు . టీడీపీ (TDP)లో ఉన్న నామ నాగేశ్వరరావు ను టీఆర్ యస్ లో చేర్చుకొని ఖమ్మం లోకసభ సీటు ఇచ్చారు . పొంగులేటికి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అందులో కూడా అనేక ఛాన్స్ లు పోయాయి. కొత్తగా జిల్లాకు చెందిన బండి పార్థ సారధి రెడ్డి , వద్దిరాజు రవి చంద్ర కు రాజ్యసభ సీట్లు ఇచ్చిన శ్రీనివాస రెడ్డి పేరు కనీసం పరిశీలించకపోవడంపై పార్టీ పై తీవ్ర అసంతృప్తి తో ఉన్న అనుయాయులు పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు .
Jaggareddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన.. ఇక సెలవు!
శ్రీనివాస్ రెడ్డిను పోగొట్టుకోబోమని కేటీఆర్ చెబుతున్నారు . కానీ ఆయన్ను ఎక్కడ అకామిడేట్ చేస్తారనే విషయం చెప్పటం లేదు . దీంతో తనతో ఉన్న నాయకులూ కార్యకర్తలు మీరు ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
శ్రీనివాసరెడ్డికి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మంచి ఆఫర్లే ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో బీజేపీ .. శ్రీనివాసరెడ్డికి గాలం వేసింది. ఆయనతో పాటు ఈ జిల్లాలో మరికొందరు ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారు . ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా అప్పగిస్తామని పెద్ద నేతలే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా శ్రీనివాస రెడ్డిని కలిసినట్లు సమాచారం . వారు కూడా ఆయనకు పెద్ద పీఠ వేస్తామని అన్నట్లు సమాచారం. అయితే జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల రీత్యా కాంగ్రెస్ అయితే అనుకూలంగా ఉంటుందని, దేశ స్థాయిలో చూస్తే బీజేపీ బెటర్ అనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు . ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ఆయన మరికొద్దిరోజుల్లోనే మంచి జరుగుతుందని చెప్పడం , దేవుడు మనకు అండగా ఉంటాడని చెప్పడం తో ఆయన రాజకీయ అడుగులపై మరోసారి ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Khammam, Ponguleti srinivas reddy, Trs