హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRSలో కట్టప్పలు.. KCR కొంపముంచే కారణమిదే : మహా సీన్ రిపీట్ ఎందుకంటే : లక్ష్మణ్

TRSలో కట్టప్పలు.. KCR కొంపముంచే కారణమిదే : మహా సీన్ రిపీట్ ఎందుకంటే : లక్ష్మణ్

కేసీఆర్, లక్ష్మణ్, మోదీ (పాత ఫొటోలు)

కేసీఆర్, లక్ష్మణ్, మోదీ (పాత ఫొటోలు)

‘మీరు తెలంగాణ జోలికొస్తే నేను ఢిల్లీ కోటలు బద్దలు కొడతాన’ని కేసీఆర్ సైతం ఘాటుగా స్పందించగా, తెలంగాణకు, మహారాష్ట్రకు ఉన్న కీలకమైన పోలిక ఏంటి? బలంగా ఉన్న కేసీఆర్ సర్కారును బీజేపీ ఎలా కూలదోస్తుంది? అనే ప్రశ్నలకు లక్ష్మణ్ సమాధానాలు చెప్పారు..

ఇంకా చదవండి ...

మహారాష్ట్ర(Maharashtra)లో శివసేన ఉద్ధవ్ ఠాక్రే సర్కారును కూల్చేసిన తరహాలోనే తెలంగాణ(Telangana)లోనూ టీఆర్ఎస్ (TRS)ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ (BJP) శపథాలు చేయడం, ‘మీరు తెలంగాణ జోలికొస్తే నేను ఢిల్లీ కోటలు బద్దలు కొడతాన’ని సీఎం కేసీఆర్ (CM KCR) ఘాటుగా స్పందించడం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించగా, అసలు తెలంగాణకు, మహారాష్ట్రకు ఉన్న కీలకమైన పోలిక ఏంటి? బలంగా ఉన్న కేసీఆర్ సర్కారును బీజేపీ ఎలా కూలదోస్తుంది? అనే ప్రశ్నలకు కమలదళం కొత్త ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ వివరణ ఇచ్చారు.

తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారును కూల్చబోయేది ఆ పార్టీలోని కట్టప్పలేనని, మితిమీరిన పుత్రవాత్సల్యమే కేసీఆర్ కొంపముంచుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. టీఆర్‌ఎస్‌లోని కట్టప్పలు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని, పుత్ర వాత్సల్యం కారణంగా మహారాష్ట్ర, బీహార్‌ ప్రభుత్వాలు ఎలా కూలిపోయాయో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా అలాగే కూలిపోతుందని ఎంపీ చెప్పారు. బీజేపీలో కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి చేరిక కేవలం ట్రైలర్‌ మాత్రమేనని అసలు సినిమా ముందున్నదని హెచ్చరించారు.

Anand Sharma : కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి ఆనంద్ శర్మ! -జేపీ నడ్డాతో భేటీ..


ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన లక్ష్మణ్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర సీనియర్‌ నేతలతో కలిసి విలేకరులతో ఢిల్లీలో మాట్లాడారు. తెలంగాణ పట్ల జాతీయ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని లక్ష్మణ్‌ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ద్వారా దక్షిణాదికి సరైన ప్రాతినిధ్యం కల్పించలేకపోతున్నామని భావించిన బీజేపీ రాష్ట్రపతి కోటాలో దక్షిణాది నుంచి నలుగురికి రాజ్యసభ సీట్లు ఇచ్చిందన్నారు. ప్రధాని మోదీ దక్షిణాదికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పడానికి ఈ నలుగురితో పాటు తన ఎంపికే నిదర్శనమన్నారు.

Advocate Rachana Reddy : బీజేపీలోకి ఫైర్‌బ్రాండ్! -బండితో అడ్వొకేట్ రచనా రెడ్డి చర్చలు..


కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాజ్యసభ పదవులను అంగట్లో సరుకుల్లాగా అమ్ముకుంటోందని లక్ష్మణ్‌ మండిపడ్డారు. మోదీ, అమిత్‌ షా, నడ్డాలు తెలంగాణను ‘గేట్‌ వే ఆఫ్‌ ఆఫ్‌ సౌత్‌’గా భావిస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ రాష్ట్రంలో దోచుకున్నది చాలక జాతీయ పార్టీ పెడతానని, చక్రం తిప్పుతానని బీరాలు పలుకుతున్నారని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు, అమరుల ఆకాంక్షలు నెరవేర్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. మోదీని విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదన్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం అంతా తోడు దొంగలే అని రాష్ట్రంలో బీజేపీనే టీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు.

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Telangana, Trs

ఉత్తమ కథలు