జగిత్యాల నుండే టీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలుకానుందని సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) పేర్కొన్నారు. నేడు జగిత్యాలలో సీఎం కేసీఆర్ (Cm Kcr) బహిరంగ సభకు ఆమె హైదరాబాద్ నుండి భారీ కాన్వాయ్ నుండి బయలుదేరారు. నేడు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ (Cm Kcr) పాల్గొంటారని కవిత తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు కవిత పేర్కొన్నారు. ఇక కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, పంట పొలాలకు నీటి వనరులు వంటి పనులు తెలంగాణలోనే సాధ్యమైందన్నారు.
ఇక జగిత్యాలలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఆన్ లైన్ శిక్షణ తరగతులు ప్రారంభించినట్టు తెలిపారు. నేడు మెడికల్ కాలేజీకి సంబంధించి సొంత భవనానికి కూడా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా జీవనం కొనసాగిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) పేర్కొన్నారు.
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు..
జగిత్యాల బహిరంగ సభ కోసం చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినట్లు కవిత (MLC Kavita) పేర్కొన్నారు. తెలంగాణ సీఎం, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ సందేశం కోసం తామంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు. కేసీఆర్ జగిత్యాలకు రావడం చాలా ఆనందంగా ఉంది. కేసీఆర్ న్యాయకత్వంలోనే కొత్త జిల్లాలు, రెవెన్యూ మండలాలు, అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నాం అన్నారు. నేను కూడా ఈ సభకు వెళ్ళడానికి బయలుదేరుతున్నాను. జగిత్యాల అభివృద్ధి కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలకు నేడు శంకుస్థాపన చేయనున్నట్టు కవిత (MLC Kavita) తెలిపారు.
కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..
నేడు జగిత్యాల బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్ (Cm Kcr) ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సభలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఎలా స్పందిస్తారు. ఎమ్మెల్యేల బేరసారాల విషయం, ఈడీ, సీబీఐ రైడ్స్ కు సంబంధించి కేసీఆర్ (Cm Kcr) రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ఇప్పటికే మహబూబ్ నగర్ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ (Cm Kcr) కేంద్రంపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Hyderabad, Kalvakuntla Kavitha, Kcr, Telangana