Home /News /telangana /

TS POLITICS TRS FOUCS ON UNHAPPY LEADERS IN PARTY AND CONVINCING THEM TO NOT TO SHIFT PARTY AK

TRS| BJP: బీజేపీ బిగ్ ప్లాన్.. అలర్టయిన టీఆర్ఎస్.. ఆ జాబితాలో ఉన్న వారిపై దృష్టి

నరేంద్రమోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

నరేంద్రమోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana Politics: టీఆర్ఎస్‌తో ప్రాధాన్యత దక్కని నేతలు.. వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం వస్తుందో రాదో అని భావిస్తున్న అనేక మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు.

    తెలంగాణ రాజకీయాల్లో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలం పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్(TRS), బీజేపీ మధ్య హోరాహోరీ పోరును తట్టుకుని కాంగ్రెస్(Congress) అభ్యర్థులు ఏ మేరకు బరిలో ఉంటారన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్.. ఈ రెండు పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. ఇక వచ్చే నెల 2,3 తేదీల్లో హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైన బీజేపీ(BJP).. ఈ సమావేశాల ద్వారా తెలంగాణలో తాము అధికారంలోకి రాబోతున్నామనే విషయాన్ని ప్రజలకు చాటి చెప్పాలని భావిస్తోంది. ప్రధాని మోదీ(PM MODI) సహా దేశంలోని బీజేపీ ప్రముఖులంతా హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో.. బీజేపీ సమావేశాలు టీఆర్ఎస్‌కు సవాల్‌గా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

    ఇదిలా ఉంటే ఈ సమావేశాల సందర్భంగా తెలంగాణలో బీజేపీలోకి చేరికలను కూడా పెద్ద ఎత్తున ప్రొత్సహించాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా పాల్గొంటున్న సమావేశాలు కావడంతో.. ఆయన సమక్షంలో పార్టీలో చేరాలనుకునే వాళ్లు ఇప్పుడే రావాలని బీజేపీ నాయకత్వం కూడా వారికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో పలువురు టీఆర్ఎస్ అసంతృప్తి నేతలు కూడా ఉన్నారనే వాదన ఉంది.



    టీఆర్ఎస్‌తో ప్రాధాన్యత దక్కని నేతలు.. వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం వస్తుందో రాదో అని భావిస్తున్న అనేక మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. వారిలో జనాదరణ ఉన్న నేతలకు కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే అలాంటి పలువురు నేతలను గుర్తించిన టీఆర్ఎస్ నాయకత్వం.. వారిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగిందని సమాచారం. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావును కేటీఆర్ కలవడం ఈ కోవలోకే వస్తుందని కొందరు చర్చించుకుంటున్నారు.

    Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. వారంతా ఢిల్లీకి రావాలని ఆదేశం..

    KCR| KTR: టీఆర్ఎస్ ప్లాన్ మారిందా ? రంగంలోకి కేటీఆర్.. ఎమ్మెల్యేలందరికీ చివరి నిమిషం వరకు టెన్షన్ ?

    జూపల్లి మాత్రమే కాకుండా.. అలాంటి కొందరు బలమైన నేతలను వదులుకోవద్దని భావిస్తున్న టీఆర్ఎస్.. పార్టీ మారే తరహా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వారికి సూచిస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ టార్గెట్‌గా బీజేపీ నిర్వహిస్తున్న ఈ భారీ సమావేశాల్లో తమ పార్టీకి చెందిన కీలక నేతలు, బలమైన నాయకులు ఎవరూ బీజేపీ వైపు వెళ్లకుండా చూసుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం పట్టుదలతో ఉందని.. అందుకే అటు వైపు చూస్తున్న నాయకులను ఏదో రకంగా బుజ్జగించేందుకు పార్టీ ముఖ్యనేతలు పలువురు రంగంలోకి దిగారని తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, CM KCR, PM Narendra Modi, Telangana, Trs

    తదుపరి వార్తలు