Home /News /telangana /

TS POLITICS TRS EX MLA NALLALA ODELU JOINED CONGRESS PARTY IN PRESENCE OF PRIYANKA GANDHI REVANTH REDDY PLAY KEY ROLE AK

Nallala Odelu: కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. తెరవెనుక చక్రం తిప్పిన ముఖ్యనేత

ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఓదెలు, ఆయన భార్య భాగ్యలక్ష్మీ

ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఓదెలు, ఆయన భార్య భాగ్యలక్ష్మీ

Telangana Politics: ఎన్నికలకు మరికొన్ని నెలలు సమయం ఉండటంతో ఓదెలు ఇప్పుడే పార్టీ మారడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    టీఆర్ఎస్‌కు ఉత్తర తెలంగాణలో ఊహించని షాక్ తగిలింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ సమక్షంలో నల్లాల ఓదెలు, ఆయన భార్య అదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మీ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా వీరిలో పాటు ఢిల్లీ వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు చెన్నూరు నుంచి టికెట్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తనకు గౌరవం లేని చోట ఉండలేనని.. అందుకే టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు నల్లాల ఓదెలు వివరించారు.

    నల్లాల ఓదేలు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉండి కీలకనేతగా ఎదిగారు. 2009, 2014 ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓదేలు రెండుసార్లూ గెలుపొందారు. 2018లో మాత్రం సీఎం కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఈయనకు బదులుగా చెన్నూరు టికెట్ బాల్క సుమన్‌కు ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్టానం. అప్పటి నుంచే టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉంటూ వచ్చిన నల్లాల ఓదెలు.. తనకు టీఆర్ఎస్‌లో సరైన గౌరవం దక్కడం లేదని అంటున్నారు.

    కొంతాకలంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనకుండా మిన్నకుండిపోయారు. చెన్నూరు నుంచి గెలిచిన బాల్కసుమన్‌తో విభేదాలు కూడా ఓదెలు పార్టీ మారేందుకు కీలక కారణమని తెలుస్తోంది. సుమన్‌తో విభేదాల గురించి ఎప్పటికప్పుడు పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని ఓదెలు తన సన్నిహితుల దగ్గర చెబుతూ వచ్చారు.

    Mogulaiah: ఇటు బీజేపీ.. అటు టీఆర్ఎస్.. మొగులయ్యపై రాజకీయం.. నా కడుపు కొట్టొద్దని ఆవేదన

    Ponguleti Srinivas Reddy: పొంగులేటికి రాజ్యసభ సీటు అందుకే రాలేదా? మాజీ ఎంపీ ఆ రకమైన ఆలోచనతో ఉన్నారా ?

    ఈ మధ్యనే టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు టచ్‌లోకి వెళ్లిన ఓదేలు కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్నట్టు చెప్పడం.. దీనిపై ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి ఓదెలు కాంగ్రెస్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేయడం జరిగిపోయాయి. ఓదేలుతో పాటు మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆయన భార్య భాగ్యలక్ష్మీ కూడా పార్టీ మారారు. ఎన్నికలకు మరికొన్ని నెలలు సమయం ఉండటంతో ఓదెలు ఇప్పుడే పార్టీ మారడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు