హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : మేం అడిగిందేంటి ? .. మీరు చెప్పిందేంటి ? బీజేపీ తీరుపై హరీష్‌రావు సంచలన ట్వీట్

Telangana : మేం అడిగిందేంటి ? .. మీరు చెప్పిందేంటి ? బీజేపీ తీరుపై హరీష్‌రావు సంచలన ట్వీట్

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Telangana politics: బీజేపీ అగ్రనాయకత్వం యాక్షన్‌పై టీఆర్ఎస్‌లో రియాక్షన్ వచ్చింది. సభలో ప్రధాని మోదీ టీఆర్‌ఎస్‌ ప్రశ్నలకు బదులివ్వకపోవడం, కనీసం కేసీఆర్ పేరు ప్రస్తావించకపోవడంతో తెలంగాణ మంత్రి బీజేపీ నేతలకు జవాబుదారీ తనం లేదంటూ కామెంట్ చేస్తూ ట్వీట్‌ చేశారు.

ఇంకా చదవండి ...

తెలంగాణ(Telangana)లో రెండ్రోజుల క్రితం మొదలైన బీజేపీ(BJP), టీఆర్ఎస్‌(TRS) పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. కమలనాథులు నిర్వహించిన విజయ సంకల్పసభ(Vijaya Sankalpa Sabha), జాతీయ కార్యవర్గ సమావేశాల సారాంశం ఏమి లేదని విమర్శిస్తోంది టీఆర్ఎస్‌ పార్టీ. రెండ్రోజుల పాటు బీజేపీ అగ్రస్థాయి నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి కోసం ఏం చేయాలనే దానిపై చర్చించామని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేతల సమావేశంపై కౌంటర్ ఇస్తూ తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు(Harish Rao) సోషల్ మీడియా(Social media) ద్వారా విమర్శించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధానమేదైనా ప్రకటిస్తారని ఆశించాం...కాని చివరకు కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప విధానమే లేదని తేల్చేశారంటూ ట్వీట్‌(Tweet) ద్వారా సెటైర్ వేశారు.

ట్వీట్టర్‌లో విమర్శలు..

అంతటితో సరిపెట్టకుండా తెలంగాణ సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు బీజేపీ పెద్దలు జవాబు చెప్పకపోవడాన్ని తప్పుపట్టారు. బీజేపీ నేతల తీరు చూస్తుంటే తమకు జవాబుదారీ తనమే లేదని నిరూపించారంటూ ఎద్దేవా చేశారు మంత్రి హరీష్‌రావు.

పెదవి విరువులు..

ఇక బీజేపీ నేతల జాతీయ కార్యవర్గ సమావేశాలపై సినీ నటుడు ప్రకాష్‌రాజ్ కూడా తనదైన శైలీలో స్పందించారు. సుప్రీం లీడర్ల రన్‌ లోలా రన్ హైదరాబాద్‌లో జరుగుతోంది..పౌరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేవని..మళ్లీ జుమ్లాలు మాత్రమే ఇందులో ఆశ్చర్యపోనవసరం లేదంటూ తన అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా వ్యక్తపరిచారు.

విజయోత్సంలో కమలనాథులు..

బీజేపీ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభ సక్సెస్ కావడాన్ని జీర్ణించుకోలేకే టీఆర్ఎస్‌ నేతలు ఈవిధమైన విమర్శలు చేస్తున్నారని కమలనాథులు కొట్టిపారేస్తున్నారు. హైదరాబాద్‌ మోదీ సభలో పార్టీ శ్రేణులు, ప్రజలు చూపించిన ఉత్సాహం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని బీజేపీ క్యాడర్‌ గట్టిగా ఫిక్సైనట్లుగా కనిపిస్తోంది.

First published:

Tags: Minister harishrao, Narendra modi, Prakash Raj, Telangana Politics, TRS leaders

ఉత్తమ కథలు