Home /News /telangana /

TS POLITICS TRS CORPORATORS JAILED FOR CRIMES IN KARIMNAGAR DISTRICT SNR KNR

Telangana: కరీంనగర్ జిల్లాలో క్రిమినల్ రికార్డ్స్‌లోకెక్కిన కార్పొరేటర్స్ ..ఎంత మందో తెలుసా

(క్రిమినల్ కార్పొరేటర్స్)

(క్రిమినల్ కార్పొరేటర్స్)

Telangana:తెలంగాణలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు చేస్తున్న దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రజల కోసం ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజలపై తిరగబడి దౌర్జన్యనికి దిగుతున్నారు. మేలు చేస్తారని ఓట్లు వేసి నాయకుల్ని చేస్తే మంచి చేయకుండా హత్యలు, దౌర్జన్యలకు పాల్పడుతున్న ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల్ని భయపెడుతున్నాయి.

ఇంకా చదవండి ...
  (P.Srinivas,New18,Karimnagar)
  అధికార పార్టీలో ఉంటే చాలు అదే ఓ పవర్‌లా ఫీలవుతున్నారు కొందరు చోటా, మోటా నాయకులు.సెటిల్‌మెంట్లు, ల్యాండ్‌ కబ్జాల కోసం దారుణాలు, దౌర్జన్యాలకు తెగబడుతున్న సందర్భాలు ఈమధ్యకాలంలో బాగా పెరిగాయి. ముఖ్యంగా కరీంనగర్(Karimnagar), పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో ఈతరహా ఘటనలు కలకలం సృష్టిస్తున్నయి. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ఆరుగురు కార్పొరేటర్లు హత్య, దౌర్జన్యలకు దిగి కటకటాల పాలయ్యారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం(Ramagundam) చెందిన.. కార్పొరేటర్ కాల్వ స్వరూప(Kalva Swaroopa)భర్త శ్రీనివాస్ యాదవ్(Srikanth Yadav) ఆస్తి కోసం తన సొంత బావ మరిదిని మూడు లక్షల రూపాయలకు  సూపర్ ఇచ్చిహత్య చేసిన ఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టించింది. సొంత బామ్మర్ది  తనకు ఉన్న భూమిని అమ్ముకోగా వచ్చిన డబ్బులు ఆశపడిన బావ  బామ్మర్ది అంతమొందించాలని  ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని ప్రీ ప్లాన్డ్‌గా స్కెచ్ వేసి  కిరాయి గూండాలతో చంపించి, యాక్సిడెంట్(Accident) గా చిత్రీకరించాడు. కుటుంబ సభ్యుల అనుమానంతో ఫిర్యాదు చేయడంతో కేసులో దోషి కార్పొరేటర్ భర్త శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు కిరాయి గుండాలను అరెస్ట్ చేసిస జైలుకు పంపారు.

  కార్పోరేటర్లు కాదు కిరాతకులు..
  టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన రామగుండం కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, మరో కార్పోరేటర్ భర్త ధరణి జలపతి , తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్ ) నాయకులు పోలాడి శ్రీనివాసరావు , వెంకన్న సీఐటీయూ యూనియన్ నాయకులు గత శుక్రవారం రాత్రి ఫుల్ గా మద్యం సేవించి ఉన్నారు. అదే సమయంలో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుూ రోడ్డుపై పార్క్ చేసిన బైక్‌ని ఢీకొట్టారు. ఇదేంటని బైక్ యాజమని వేణుగోపాల్‌రెడ్డి అనే సింగరేణి కార్మికుడు వారిని ప్రశ్నించాడు. మద్యం మత్తులో ఉన్న అధికార పార్టీకి చెందిన నేతలు గోపాల్‌రెడ్డి ఇంట్లోకి చొరబడి అతడ్ని కొట్టారు. అడ్డొచ్చిన అతని భార్య నైటీ చింపడమే కాకుండా కుటుంబ సభ్యులపై దుర్భాషలాడి నానా హంగామా సృష్టించారు.  దౌర్జన్యాలు, దాడులు..
  ఈవ్యవహారం స్థానికంగా సంచలనం రేపడంతో బాధితులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ కింద ఆరు నెలల జైలుశిక్ష విధించింది. అంతే కాదు పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే శిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

  ఇది చదవండి: నిజామాబాద్ జిల్లాలో చెట్టు కోసం చంపాడు .. వార్నీఆ చెట్టు కోసం మర్డరా  అధికారపార్టీనేతల ఆగడాలు..
  ఇక కరీంనగర్ జిల్లాకు చెందిన మరో కార్పోరేటర్ రౌడీ షీటర్‌ను తీసుకెళ్లి మద్యం షాప్‌కి తీసుకెళ్లి ఉచితంగా మందు ఇవ్వాలని అలాగే కిరాయి కూడా తమకే  ఇవ్వాలంటూ కౌంటర్ దగ్గరున్న యజమానిని కత్తితో పొడవడంతో వైన్స్ యజమాని అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈకేసులో కూడా సీసీ ఫుటేజ్ ఆదారంగా కార్పొరేటర్‌తో పాటు అతనికి సహాకరించిన రౌడీషీటర్లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఇవే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మరికొంత మంది కార్పొరేటర్ల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ప్రజల పట్ల రౌడీల్లా ముద్రవేసుకుంటున్న నాయకులపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు కరీంనగర్ జిల్లా ప్రజలు. అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు కింద పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని అధికార పార్టీకి సూచిస్తున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Crime news, PEDDAPALLI DISTRICT, TRS leaders

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు