TS POLITICS TRS CM KCR WILL GO TO EARLY ELECTIONS BY 2023 MAY SAYS CONGRESS MP UTTAM KUMAR REDDY RYTHU RACHABANDA REVANTH REDDY MKS
Telangana: ముందస్తు ఎన్నికలు ఖాయం.. అక్కడ KCR TRSకు భారీ షాక్: ఉత్తమ్ లెక్కిదే..
ప్రతీకాత్మక చిత్రం
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవలే చెప్పారు. గులాబీ బాస్ గురించి ఇంకా బాగా తెలిసిన కాంగ్రెస్ సైతం ఆయన ముందస్తుకు వెళతారనే భావిస్తున్నది. తాజాగా ముందస్తు ఎన్నికలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యఖ్యలు చేశారు..
వేసవి కంటే ముందు వరుస సభలతో దాదాపు ఎన్నికల వేడిని రాజేసినా.. యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వ్యూహం మార్చుకొని ముందస్తుకు వెళ్లడంలేదంటూ ప్రకటన చేశారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. కానీ అది వ్యూహాత్మక ఎత్తుగడ అని, ఫామ్ హౌజులో, ప్రగతి భవన్ లో నిరంతరం కేసీఆర్ ముందస్తు ప్రిపరేషన్లు చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం వ్యాఖ్యానించారు. కేసీఆర్ గురించి ఇంకా బాగా తెలిసిన కాంగ్రెస్ కూడా ఆయన ముందస్తుకు వెళతారనే భావిస్తున్నది. టీఆర్ఎస్ కు దీటుగా తామూ ఎన్నికలకు సిద్ధమంటూ కాంగ్రెస్, బీజేపీలు ఇదివరకే ప్రకటనలు చేశాయి. తాజాగా ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనపైనా సెటైర్లు వేశారు..
2023 మేలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనైతే 12 అసెంబ్లీ సీట్లూ గెలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రైతులతో పాటు కౌలురైతులకు ఏడాదికి రూ.15 వేల పంటసాయాన్ని అందజేస్తామన్నారు. భూమి లేని వారికి ఏడాదికి రూ.12 వేల చొప్పున బ్యాంక్‌లో జమచేస్తామని తెలిపారు. వరికి రూ.2500, మిర్చికి రూ.15 వేల మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు.
సీఎం కేసీఆర్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెకింది స్థాయి నేతల దాకా ఇసుక, భూమి, వైన్స్ వంటి వాటి నుంచి దొరికినంత దోచుకుంటున్నారని, కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడి త్వరలో వారికి బుద్ధి చెబుతారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను సీఎం కేసీఆర్ పరామర్శించ లేదని తప్పుబట్టారు. కానీ.. పంజాబ్ రైతులకు నగదు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని టీఆర్ఎస్ నేతలు లూటీ చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇదిలా ఉంటే,
వరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ రైతు రచ్చబండ పేరుతో నెల రోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం నుంచే రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని.. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. డిక్లరేషన్ లో చెప్పిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తామని ఆయన మాటిచ్చారు. ఓ పేద రైతు ఇంట్లో రేవంత్ భోజనం చేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.