Home /News /telangana /

TS POLITICS TRS CM KCR TO FLOAT NATIONAL PARTY BRS AT DELHI RALLY IN JULY PRASHANT KISHOR SONU SOOD MAY PLAY KEY ROLE MKS

CM KCR | Prashant Kishor : బీఆర్ఎస్ జాతీయ కార్యదర్శిగా పీకే! -కేసీఆర్ వెంట Sonu Sood?

పీకే, కేసీఆర్, సోనూసూద్ (పాత ఫొటోలు)

పీకే, కేసీఆర్, సోనూసూద్ (పాత ఫొటోలు)

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు భిన్నమైన ప్రత్యామ్నాయ అజెండాతో కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ పలు సంచలన వ్యూహాలను సిద్దం చేసినట్లు వెల్లడైంది. కేసీఆర్ పార్టీలో ప్రశాంత్ కిషోర్, సోనూసూద్, రాకేశ్ టికాయత్ లాంటివారు కీలక భూమిక పోషిస్తారట..

ఇంకా చదవండి ...
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త జాతీయ పార్టీ ఏర్పాటులో (KCR National Party) తలమునకలైన తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తొలి సభను ఢిల్లీ గడ్డపై భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. జులై తొలి వారంలో దేశ రాజధాని ఢిల్లీలో లేదా ఢిల్లీ శివారులో కనీవినీ ఎరుగని భారీ బహిరంగ సభను పెట్టి, ఆ వేదికపై నుంచే జాతీయ పార్టీని అధికారికంగా లాంచ్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. మరింత ఆసక్తికరంగా..

కేసీఆర్ కొత్త పార్టీలో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు, సోనూ సూద్ లాంటి సినీ, సేవారంగాల ప్రముఖులతోపాటు రాకేశ్ టికాయత్ లాంటి రైతు నేతలకు సైతం పెద్ద పీట వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కేసీఆర్ జాతీయ అజెండా, పార్టీ పేరు, విధివిధానాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. వివరాలివే..

Weight Loss : మాంసాహారులకు గుడ్ న్యూస్.. బరువు తగ్గడానికి నాన్‌వెజ్.. బెస్ట్ రిజల్ట్ పొందండిలా..


ఈసీ వద్ద రిజిస్ట్రేషన్ : జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా, బీజేపీ-కాంగ్రెస్ లకు భిన్నమైన ప్రత్యామ్నాయ ఎజెండాతో జాతీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం తీసుకునే దశకు వచ్చినట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా ప్రగతిభవన్ లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సహా పలు రంగాల మేధావులు, నిపుణులు, సీనియర్ నేతలతో మంతనాలు జరిపిన కేసీఆర్‌.. కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలకు తుది రూపునిచ్చినట్టు తెలిసింది. ‘భారత రాష్ట్ర సమితి’, ‘భారత నిర్మాణ సమితి’, ‘భారత ప్రజా సమితి’లలో ఒక పేరును ఖరారు చేసి.. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీని రిజిస్ట్రేషన్‌ చేసే ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నట్టు సమాచారం.జాతీయ కార్యదర్శిగా పీకే: ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు మంచి రోజులు ఉండటంతో సరైన ముహూర్తం చూసి.. కొత్త జాతీయ పార్టీ పేరు, ఎజెండా, నియమావళి, జెండా, ఎన్నికల గుర్తు తదితర వివరాలను ప్రాథమింకగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోన్న కేసీఆర్.. అధికారిక ప్రకటనను మాత్రం ఢిల్లీలో భారీ బహిరంగ సభ పెట్టి చేయనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కొత్త జాతీయ పార్టీలో ప్రశాంత్‌ కిషోర్‌కు కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, పేర్కొంటున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్‌ వ్యవహరించనుండగా.. ప్రశాంత్‌ కిషోర్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి లేదా సెక్రటరీ జనరల్‌ హోదా కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Savings Accounts : ఆ బ్యాంకులో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? వడ్డీ రేట్లు పెరిగాయి తెలుసా?


అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొత్త పార్టీ అభ్యర్థులుగానే: వచ్చే ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కొత్త జాతీయ పార్టీకి చెందిన గుర్తు, ఎజెండాపైనే ఎన్నికల బరికి దిగుతారని తెలుస్తోంది. జాతీయ పార్టీగా అవతరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ పేరిట ఉన్న ఆస్తులు, బ్యాంక్‌ డిపాజిట్లు తదితరాలను కొత్త పార్టీ పేరిట మార్పిడి చేసేందుకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు, చిక్కులపై న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. కొత్త జాతీయ పార్టీ ఆవిర్భావ ప్రకటనతోపాటు జాతీయ కార్యవర్గం/పొలిట్‌ బ్యూరోను కేసీఆర్‌ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో భావ సారూప్యత కలిగిన చిన్న పార్టీలు, వివిధ సామాజిక సంస్థలు, సంఘాలను విలీనం చేసుకుంటూ కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్టు సమాచారం.

CM KCR | BRS : కేసీఆర్ అనూహ్యం.. ప్రాంతీయ ఫార్ములాతోనే జాతీయ పార్టీ -ఎన్టీఆర్‌, పీవీ బొమ్మలతో..


ఢిల్లీలో భారీ బహిరంగ సభ : కేసీఆర్‌ జాతీయ పార్టీ స్థాపనపై ప్రకటన చేశాక.. జూలై మొదటి వారంలో దేశ రాజధాని ఢిల్లీ లేదా పరిసర రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆ సభకు తెలంగాణతోపాటు ఉత్తరాది నుంచి జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజయ్యేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఉత్తరాదిన పార్టీ విస్తరణకు అనువైన వాతావరణం ఉందని భావిస్తూ.. ఉత్తరాది రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో రాజకీయ శూన్యత లేదనే అభిప్రాయంతో ఉన్న కేసీఆర్‌.. సందర్భాన్ని బట్టి ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ వీటిపై అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Kcr, Prashant kishor, Sonu Sood, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు