Home /News /telangana /

TS POLITICS TRS CM KCR SLAMS PM MODI ALLEGES THAT UNION GOVT LEAKING SECRET INFO TO BJP SOCIAL MEDIA MKS

సర్కారువారి సీక్రెట్స్ లీక్.. కేంద్రంపై CM KCR సంచలన ఆరోపణ.. PM Modi ఏడుపంటూ..

మోదీ, కేసీఆర్ (పాత ఫొటోలు)

మోదీ, కేసీఆర్ (పాత ఫొటోలు)

ప్రభుత్వ రహస్యాలను మోదీ సర్కారు లీక్ చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణ చేశారు. సీక్రెట్ ఇన్ఫో బీజేపీ సోషల్ మీడియాకు చేరుతోందని, ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోబోమని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి లొల్లి చేస్తానని కేసీఆర్ అన్నారు..

ఇంకా చదవండి ...
రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల మధ్య నడిచే సంవాదాలు, ఉత్తరప్రత్యుత్తరాలను సైతం కేంద్రంలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) మండిపడ్డారు. ప్రభుత్వ రహస్యాలను మోదీ సర్కారు లీక్ చేస్తోందని సంచలన ఆరోపణ చేశారు. తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రానికి పంపుతోన్న సమాచారమంతా బీజేపీ (BJP) సోషల్ మీడియాకు చేరుతోందని, దాన్ని రాజకీయ విమర్శలకు వాడుకునే తప్పుడు పని యధేచ్ఛగా సాగుతోందని సీఎం చెప్పారు. ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోబోమని, అవసరమైతే పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Parliament Monsoon Session 2022) సమయంలోనే స్వయంగా ఢిల్లీ వెళ్లి తాడో పేడో తేల్చుకుంటానని కేసీఆర్ హెచ్చరించారు.

ఈనెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. శనివారం ప్రగతి భవన్ లో జరిగిన కీలక భేటీలో కేంద్రాన్ని, ప్రధాని మోదీని ఉద్దేశించి కేసీఆర్ సంచలన ఆరోపణలు, విమర్శలు చేశారు. తెలంగాణ అప్పులకు కేంద్రం అడ్డుపడుతోన్న ఉదంతంపై సీఎం తొలిసారి ఘాటుగా స్పందించారు. తెలంగాణ అన్ని రకాలుగా ముందుకు పోతున్నదనే ఏడుపు వల్లే ప్రధాని మోదీ, బీజేపీ దిగజారుడు వ్యవహరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Monsoon session: 18 నుంచి ఢిల్లీలో దబిడి దిబిడే -బీజేపీకి చుక్కలు చూపించేలా KCR ప్లాన్


‘అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోదీకి కన్ను కుట్టింది. నిబంధనల పేరుతో ఆర్థికంగా అణచివేయాలని చూస్తున్నారు. తెలంగాణపై కేంద్రం కక్షపూరిత వైఖరిని అనుసరిస్తోంది. దీనిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో గళం విప్పండి. బీజేపీ అసంబద్ధ వైఖరిని ఎండగట్టేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, డీఎంకే, ఆప్‌ తదితర కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకోండి’ అని టీఆర్ఎస్ ఎంపీలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

TRS vs BJP : తిరిగి టీఆర్ఎస్‌లోకి ఈటల రాజేందర్? -కేటీఆర్ స్పందన -కేసీఆర్ మరో రికార్డు!


పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా అవసరమైతే తాను కూడా ఢిల్లీ వచ్చి కలిసొచ్చే విపక్ష పార్టీల అధినాయకులు, ఎంపీలతో చర్చలు జరుపుతానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోదీ ప్రభుత్వం ఎన్నడూ ప్రోత్సహించకపోగా, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.

Modi పట్టుకు దిగొచ్చిన Biden -భారత్‌పై CAATSA ఎత్తేసిన అమెరికా -రష్యా ఎస్‌-400 రయ్ రయ్


దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నాయని, పరిధికి లోబడే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడుపుతోందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్లలో ఒక్క రోజు కూడా, ఒక్క పైసా కూడా డిఫాల్ట్‌ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్‌ రికార్డు తెలంగాణ సొంతమని, ఆర్బీఐ ఆధ్వర్యంలో జరిగే బిడ్ల వేలంలో తెలంగాణ బిడ్లకే ఎక్కువ డిమాండ్‌ పలుకుతోందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. వాస్తవాలు ఇలా ఉంటే, కేంద్రం విషరాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

Gold Silver Rates: గుడ్ న్యూస్ -ఇవాళ కూడా భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి పెరిగింది..


ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రకారం తెలంగాణ రూ.53 వేల కోట్ల రుణాలు తెచ్చుకోవచ్చని తొలుత కేంద్రం ప్రకటించిందని, అయితే, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఆమోదం పొందిన తర్వాత అకస్మాత్తుగా మోదీ సర్కార్ మాట మార్చిందని, కక్షపూరితంగా అప్పుల్లో కోత కోసి పరిమితిని రూ.23 వేల కోట్లకు కుదించిందని, ఇది ముమ్మాటికి కుట్రే అని కేసీఆర్ ఫైరయ్యారు. నిజానికి కేంద్రం ఎడాపెడా అప్పులు చేస్తోందని, ఏటా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని తనకు తానే సడలించుకుంటూ కేంద్రమే దేశాన్ని దివాలా తీయిస్తోందని, సవరణల పేరిట రాజ్యాం గ ఉల్లంఘనకు పాల్పడుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయాలను పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలను ఆదేశించారు. ఇంకా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గోప్యంగా ఉంచాల్సిన అంశాలను మోదీ సర్కార్ లీక్ చేస్తోందని, తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బీజేపీ సోషల్‌ మీడియా గ్రూపులకు ఎలా చేరుతున్నాయో బీజేపీ నాయకత్వం స్పష్టం చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. దేశానికి, రాష్ట్రాలకు నడుమ గోప్యంగా ఉంచాల్సిన ఆర్థిక వ్యవహారాలను ఉద్దేశపూర్వకంగా లీక్‌ చేసి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం కక్షపూరిత చర్య అని మండిపడ్డారు. ఇదంతా రాజకీయ దిగజారుడుతనంతో బీజేపీ చేస్తున్న వ్యవహారమన్నారు. తెలంగాణ పట్ల బీజేపీ జాతీయ నాయకత్వం చౌకబారు రాజకీయాలను ఆశ్రయింస్తోందని కేసీఆర్ ఫైరయ్యారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Monsoon session Parliament, Parliament, Pm modi, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు