హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR | BRS : కేసీఆర్ అనూహ్యం.. ప్రాంతీయ ఫార్ములాతోనే జాతీయ పార్టీ -ఎన్టీఆర్‌, పీవీ బొమ్మలతో..

CM KCR | BRS : కేసీఆర్ అనూహ్యం.. ప్రాంతీయ ఫార్ములాతోనే జాతీయ పార్టీ -ఎన్టీఆర్‌, పీవీ బొమ్మలతో..

కేసీఆర్, ఎన్టీఆర్, పీవీ (పాత ఫొటోలు)

కేసీఆర్, ఎన్టీఆర్, పీవీ (పాత ఫొటోలు)

కేసీఆర్ నాయకత్వంలో ప్రాంతీయవాదమే ఊపిరిగా టీఆర్ఎస్ పురుడుపోసుకోగా.. వచ్చే వారం అధికారికంగా ప్రకటించనున్న బీఆర్ఎస్ కు సైతం ‘విస్తృత ప్రాంతీయవాదమే’ యూఎస్పీగా ఉండబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, పీవీ ఫొటోలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు..

ఇంకా చదవండి ...

జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపుతానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఆ మేరకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పేరుతో కొత్త జాతీయ పార్టీని (KCR National Party) ఏర్పాటు చేస్తున్నప్పటికీ సిద్దాంతాల విషయంలో మాత్రం పాన్ ఇండియా ఐడియాలజీకి భిన్నంగా, తనకు బాగా అచ్చివచ్చిన పాత ఫార్ములానే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

22 ఏళ్ల కిందట ప్రాంతీయవాదమే ఊపిరిగా టీఆర్ఎస్ పురుడుపోసుకోగా.. వచ్చే వారం అధికారికంగా ప్రకటించనున్న బీఆర్ఎస్ కు సైతం ‘విస్తృత ప్రాంతీయవాదమే’ యూఎస్పీగా ఉండబోతున్నట్లు సమాచారం. అంటే, ఈసారి దక్షిణాది సెంటిమెంటును ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని, బీజేపీ మోదీ పాలనలో దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై పోరాడే శక్తిగా బీఆర్ఎస్ ను నిలబెట్టాలన్నది కీలక వ్యూహంగా కనిపిస్తోంది.

CM KCR | Undavalli : కేసీఆర్‌తో ఉండవల్లి ఏం మాట్లాడారు? -ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు వ్యూహాలు!


కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ బీఆర్ఎస్ విస్తరణకు కూడా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలనే ఎంచుకుంటారని తెలుస్తోంది. ఈక్రమంలో తెలుగుజాతి ఆణిముత్యాలైన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారాలుల బొమ్మలతో ముందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Hyderabad Gang Rape : గ్యాంగ్ రేప్ నిందితులకు స్టార్ హోటల్ బిర్యానీ -కస్టడీలో మర్యాదలా?


ఈనెల 19న కేసీఆర్ అధికారిక ప్రకటనతోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పురుడుపోసుకుంటుందనే వార్తల నడుమ.. దాని ఏర్పాట్లపై సీఎం కేసీఆర్.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా పలువురు మేధావులు, నిపుణులు, సీనియర్ నేతలతో విస్తృతంగా చర్చలు, సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ సైద్దాంతిక విధానం కింద దక్షిణాది సెంటిమెంట్‌ను ప్రధానంగా తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

CM Jagan | MP Raghurama : రఘురామతో పోరులో జగన్‌కు మళ్లీ పరాభవం -PM Modi సాక్షిగా మరో షాక్?


దక్షిణాది రాష్ట్రాలకు మోదీ పాలనలో జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకెళ్లాలని చర్చించినట్లు సమాచారం. తెలంగాణ వంటి సంపన్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి పెద్దఎత్తున నిధులు ఇస్తున్నాయని, కానీ, కేంద్రం నుంచి అదే స్థాయిలో సహకారం లేదని ఇటీవల టీఆర్ఎస్ విస్తృతంగా చేస్తోన్న ప్రచారాన్నే బీఆర్ఎస్ కు అనుకూలంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

National Family Survey : భర్తలు కొట్టినా పర్వాలేదు : తెలుగు మహిళల్లో 83 శాతం మంది మాటిదే!


కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కూడా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే మొదట చేపట్టాలని, కాల క్రమంలో ఉత్తరాదికి విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ప్రధానంగా దృష్టి సారించాలని కేసీఆర్ పాల్గొన్న సమావేశాల్లో చర్చించినట్లు సమాచారం. అంతేకాదు,

Unique Marriage : ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో ప్రేమ.. ఇద్దరు బిడ్డలు పుట్టాక ఒకే వేదికపై పెళ్లి!


బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌, కాంగ్రెస్ నుంచి ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహారావు బొమ్మలతో ముందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవడం ద్వారా తెలుగు ప్రజల మన్ననలు పొందొచ్చని, పీవీకి కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని ప్రధానంగా ఎలుగెత్తడం ద్వారా నాన్ బీజేపీ యాంటీ కాంగ్రెస్ వర్గాలను ఆకర్షించవచ్చని సీఎం భావిస్తున్నట్లు సమాచారం.

Weight Loss : బరువు తగ్గితే భారీ నజరానా.. 15కేజీలకు రూ.15,000 కోట్లు.. త్వరగా ఇచ్చేయండి సార్..


బీఆర్ఎస్ విస్తరణపై ఇప్పటికే ఒక క్లారిటీ ఉన్న కేసీఆర్.. పార్టీ సైద్దాంతికత, జాతీయ స్థాయిలో విస్తరణకు ఏయే రాష్ట్రాల్లో ఏయే అంశాలను ప్రధానంగా తీసుకోవాలి, రోడ్‌ మ్యాప్‌ ఏమిటనే వివరాలను తనను కలిసినవారికి ప్రజెంటేషన్లు కూడా ఇస్తున్నట్లు సమాచారం. పార్టీ జెండా, రంగులు, గుర్తులపైనా కసరత్తు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీనే జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చే క్రమంలో తలెత్తే సాంకేతిక అంశాలపై చర్చించడంతోపాటు దీనిపై ఎన్నికల కమిషన్‌ను సంప్రదించాలని, పార్టీకి కామన్‌ సింబల్‌గా కారు గుర్తునే కొనసాగించాలని కోరాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏపీ సహా తమిళనాడులో సినీ ప్రముఖులకు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న అభిప్రాయం కేసీఆర్ చర్చల్లో వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

First published:

Tags: CM KCR, Prashant kishor, Telangana, Trs

ఉత్తమ కథలు