హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR National Party Launch: తెలంగాణలో కీలక పరిణామం.. బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్.. తీర్మానంపై సంతకం చేసిన కేసీఆర్

KCR National Party Launch: తెలంగాణలో కీలక పరిణామం.. బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్.. తీర్మానంపై సంతకం చేసిన కేసీఆర్

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR National Party: పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన ఈ తీర్మానంపై పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ సంతకం చేశారు. దీంతో టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడానికి కావాల్సిన లాంఛనాలు పూర్తయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    తెలంగాణలో మరో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. 21 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారింది. ఈ మేరకు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన ఈ తీర్మానంపై పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్(KCR) సంతకం చేశారు. దీంతో టీఆర్ఎస్(TRS) బీఆర్ఎస్‌గా(BRS) మారడానికి కావాల్సిన లాంఛనాలు పూర్తయ్యాయి. ఈ సమావేశంలో చేసిన తీర్మానం కాపీతో పలువురు నేతలు ఈ రోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. వాళ్లు రేపు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసి టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై చర్చిస్తారని.. పార్టీ చేసిన తీర్మానం కాపీని వారికి అందిస్తారని సమాచారం.

    2001లో టీఆర్ఎస్‌లో ఏర్పాటు చేసిన కేసీఆర్ .. 2014లో తెలంగాణ ఏర్పాటు తరువాత పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కేంద్రంలో ఎన్డీయే, యూపీఏకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేశారు. కానీ కూటములతో తాము అనుకున్న మార్పు సాధ్యం కాదని అనుకున్న కేసీఆర్.. చివరికి సొంతంగా జాతీయస్థాయిలో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని అనుకున్నారు.

    ఈ క్రమంలోనే తన సారథ్యంలోని టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి.. జాతీయస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం దసరా రోజు ముహూర్తం ఖరారు చేశారు. అనుకున్న ముహూర్తానికే పార్టీ పేరు మార్పునకు సంబంధించిన తీర్మానంపై కేసీఆర్ సంతకం చేశారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తెలంగాణ భవన్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేశాయి. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నాయి. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్.. దేశ రాజకీయాల్లోనూ మార్పు తీసుకొస్తారని.. కేసీఆర్ దేశ్‌కీ నేత అని నినాదాలు చేశాయి.

    YS Sharmila: ఢిల్లీకి వైఎస్ షర్మిల.. కేంద్ర పెద్దలను కలిసే ఛాన్స్.. కేసీఆర్ సర్కార్‌పై ఫిర్యాదు ?

    Ts Politics: సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీ..పైలట్ ప్రాజెక్ట్ గా మునుగోడు ఎంపిక..స్కిం మార్పు కలిసొచ్చేనా?

    సమావేశంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాలని ఆవశ్యకతను నేతలకు వివరించిన కేసీఆర్.. దేశంలో వనరులు ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. తీర్మానంపై సంతకం చేసిన అనంతరం సమావేశానికి హాజరైన నేతలంతా కలిసి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ వారికి విందు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడబోతున్నారు.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు