Home /News /telangana /

TS POLITICS TRS AND KCR CHANGED THEIR STAND ON PRESIDENT ELECTIONS DUE TO VARIOUS REASONS AK

TRS| KCR: కేసీఆర్‌లో ఊహించని మార్పు.. కొద్దిరోజుల వ్యవధిలోనే.. అసలు కారణం అదేనా ?

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

బీజేపీ తీరును విమర్శిస్తూ.. యశ్వంత్ సిన్హాకు అంతా మద్దతు పలకాలని కేటీఆర్ సూచించారు. అయితే యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించే విషయంలో టీఆర్ఎస్ వైఖరిలో వచ్చిన మార్పు గురించి రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవడానికి, నిర్ణయాలు మార్చుకోవడానికి ఎక్కువ రోజులు సమయం పట్టదు. పరిస్థితిని బట్టి, తమ అవసరాలను బట్టి రాజకీయ పార్టీలు తమ నిర్ణయాలను మార్చుకుంటాయి. తాజాగా తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కూడా దాదాపుగా అలాంటిదే అనే చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హాకు(Yashwant Sinha) టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. తాజాగా ఆయన నామినేషన్ వేసే కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) స్వయంగా హాజరయ్యారు. బీజేపీ(BJP) తీరును విమర్శిస్తూ.. యశ్వంత్ సిన్హాకు అంతా మద్దతు పలకాలని కేటీఆర్ సూచించారు. అయితే యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించే విషయంలో టీఆర్ఎస్ వైఖరిలో వచ్చిన మార్పు గురించి రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు మొదట బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉండిపోయింది. ఇందుకు టీఆర్ఎస్ తరపున పలు ఇతర కారణాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. విపక్షాల కూటమిలో కాంగ్రెస్ ఉండటం, ముందుగానే అభ్యర్థిగాపై చర్చించడం వంటివి కూడా ఇందులో భాగమే అని టీఆర్ఎస్ నాయకత్వం భావించినట్టు ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో టీఆర్ఎస్ వైఖరి మారినట్టు కనిపిస్తోంది. విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేసీఆర్‌ను కోరడంతో ఆయన అందుకు ఓకే చెప్పారు.



    అయితే కేవలం మొక్కుబడి మద్దతు ఇవ్వడమే కాకుండా ఆయనకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందనే విషయాన్ని తాజాగా కేటీఆర్ వెల్లడించారు. అయితే టీఆర్ఎస్ వైఖరిలో ఇంత మార్పు రావడం వెనుక అసలు కారణం వేరే ఉందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నడుస్తోంది. శివసేనను చీల్చి రాజకీయ సంక్షోభం సృష్టించడం వెనుక బీజేపీ హస్తం ఉందని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాలు బరిలో నిలిపిన అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోవడం వల్ల దేశంలోని విపక్షాలకు టీఆర్ఎస్ దూరమయ్యే అవకాశం ఉందని.. ఇది తమ పార్టీ గురించి భిన్నమైన వాదనలను ప్రజల్లోకి తీసుకెళుందనే భావనలో టీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది.

    Rahul Gnadhi | KTR : 8 ఏళ్ల తర్వాత ఎదురుపడ్డ కాంగ్రెస్, టీఆర్ఎస్ అగ్రనేతలు.. సంచలన సవాల్

    Hyderabad | TSRTC : ప్రతి సోమవారం ప్రయాణికులకు ఇకపై ఆ సౌకర్యం ఉంటుంది ..గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్‌ ఆర్టీసీ

    దీనికితోడు బీజేపీని ఎదుర్కోనే విషయంలో విపక్షాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని టీఆర్ఎస్ నాయకత్వం కాస్త ఆలస్యంగా గుర్తించిందని.. ఇందుకు ప్రస్తుతం నడుస్తున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కూడా ఓ కారణంగా కావొచ్చనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. మొత్తానికి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో అధికార, విపక్షాలకు సమాన దూరం పాటించాలని భావించిన టీఆర్ఎస్.. ఇప్పుడు విపక్షాల అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఆసక్తి కలిగించే పరిణామమే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, President Elections 2022, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు