హోమ్ /వార్తలు /తెలంగాణ /

Huzurabad: రాజకీయ రణరంగంగా హుజురాబాద్..! ఫ్లెక్సీలతో TRS, BJP సవాళ్లు..

Huzurabad: రాజకీయ రణరంగంగా హుజురాబాద్..! ఫ్లెక్సీలతో TRS, BJP సవాళ్లు..

ఈటల రాజేందర్​, కౌశిక్​ (ఫైల్​)

ఈటల రాజేందర్​, కౌశిక్​ (ఫైల్​)

హుజూరాబాద్లో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. తెరాసతోపాటు భాజపా శ్రేణులు నువ్వా - నేనా అనేలా ఇక్కడి నియోజకవర్గ అభివృద్ధిపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(Srinivas P, News18, Karimnagar)

హుజూరాబాద్లో (Huzurabad) రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది . తెరాస (TRS)తోపాటు భాజపా (BJP) శ్రేణులు నువ్వా - నేనా అనేలా ఇక్కడి నియోజకవర్గ అభివృద్ధిపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు . దాదాపు పది నెలల కిందట జరిగిన ఉప ఎన్నికలతో ఇక్కడి హోరాహోరీ తీరు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును అందుకుంది. ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ (Eetala Rajender) విజయం సాధించడంతో అధికార తెరాస (TRS) కూడా తమ పార్టీ ప్రాబల్యాన్ని నిలుపుకొనేలా పలు కార్యక్రమాలతో ఇన్నాళ్లుగా జోరుని చూపిస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (Congress) నుంచి తెరాసకు మారి ఎమ్మెల్సీ పదవిని అందుకున్న పాడి కౌశిక్​రెడ్డి (Kaushik reddy)పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . ఇదే సమయంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే నియోజకవర్గంలో వారం పర్యటిస్తూ తన మార్కును వేసుకుంటున్నారు. రోజులుగా ఇట తెరాస , అటు బీజేపీ నియోజకవర్గ అభివృద్ధి విషయమై సవాళ్లు చేసుకుంటున్నారు . తెరాస అందిస్తున్న ప్రగతియే నియోజకవర్గంలో కనిపిస్తోందని ఎమ్మెల్సీ (MLC) పాడి కౌశిక్ రెడ్డి పేర్కొంటూనే .. తనతో నియోజకవర్గ అభివృద్ధి విషయమై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు .

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ .. హుజూరాబాద్​లో కళ్లకు కనిపిస్తున్న అభివృద్ధి అంతా తాను చేసిందని .. తన రాజీనామా వల్లనే ప్రగతి ఫలాలు అందాయనేలా తన వాణిని వినిపించారు . ప్రజలకే తాను జవాబుదారినని విలువలు లేని నాయకులను పట్టించుకోనని తనదైన తరహాలో ప్రత్యర్థి నేత సవాల్​ను తిప్పికొట్టారు .

ఫ్లెక్సీల జోరు.. 

మొదట తెరాస ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చర్చకు తాను సిద్ధమేనని తేదీని ఖరారు చేస్తూ .. ఎమ్మెల్యేను చర్చకు రావాలనే భారీ ఫ్లెక్సీ (Flexis) ఏర్పాటు చేయించడం చర్చనీయాంశంగా మారింది . ప్రజల సమక్షంలో స్థానిక అంబేడ్కర్ కూడలి వద్దకు 5వ తేదీన ( నేడు ) ఉదయం 10 గంటలకు  రావడానికి తెరాస శ్రేణులంతా సిద్ధమేనని అందులో పేర్కొనడంతో ఇది రాజకీయ దుమారాన్ని రేపింది .

అయితే దీనికి స్పందించిన భాజపా (BJP) నాయకులు కూడా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వైఖరికి ధీటుగా పెద్ద ఫ్లెక్సీని పట్టణంలో ఏర్పాటు చేశారు. అభివృద్ధిపై చర్చకు భాజపా సిద్ధమని తమ నేత ఈటల రాజేందర్​తో చర్చకు కూర్చునే అనుభవం కౌశిక్ రెడ్డికి   లేదని ఫ్లెక్సీలో వేయడం ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది.

ఇక రెండు మూడురోజుల కిందట పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తానే గెలుస్తాననడం .. తరువాత నిన్న టీఆర్​ఎస్​ నియోజకవర్గం ఇన్​ఛార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి రానున్న ఎన్నికలో తానే ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ.. మాట్లాడటం వివాదాలకు దారి తీసింది. టీఆర్​ఎస్​ పార్టీలో ఇప్పుడే వీరిద్దరి మధ్య టికెట్ విషయమై జరుగుతున్న పోటీ మరో చర్చనీయాంశంగా మారింది.

144 సెక్షన్​..

అలాగే హుజురాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన అభివృద్ది పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్  విసిరిన సవాలును స్వీకరించి హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తిస్థాయి ఆధారాలతో చర్చకు పెద్ద ఎత్తున బయలుదేరుతున్న బీజేపీ టీఆర్​ఎస్​ నాయకులు బయలుదేరారు. ముందస్తు గొడవలవుతాయని హుజురాబాద్ లలో పలు పార్టీ అభ్యర్థులను ముందుగానే అరెస్టు చేస్తున్నారు పోలీసులు. అలాగే ఈరోజు 144  సెక్షన్ అమలులో ఉండనున్నదని పోలీసులు తెలిపారు.

First published:

Tags: Bjp, Eetala rajender, Elections, Huzurabad, Trs