హోమ్ /వార్తలు /తెలంగాణ /

Errabelli Dayakar rao : TRSకు కేసీఆర్ పెట్టిన BRS పేరును మార్చేసిన మంత్రి ఎర్రబెల్లి .. ఇప్పుడదే పెద్ద రచ్చవుతోంది

Errabelli Dayakar rao : TRSకు కేసీఆర్ పెట్టిన BRS పేరును మార్చేసిన మంత్రి ఎర్రబెల్లి .. ఇప్పుడదే పెద్ద రచ్చవుతోంది

DAYAKARRAO, KCR

DAYAKARRAO, KCR

Viral video: టీఆర్ఎస్‌ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి నేషనల్ పార్టీగా పేరు మార్చుకుంటే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాత్రం పార్టీ పేరును గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. గులాబీ బాస్‌ దసరా రోజు జాతీయ పార్టీ పేరును ప్రకటించిన కొన్ని గంటల్లోనే పేరు మార్చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

టీఆర్ఎస్‌(TRS)జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి నేషనల్ పార్టీగా పేరు మార్చుకుంటే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాత్రం పార్టీ పేరును గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. గులాబీ బాస్‌ దసరా (Dussehra)రోజు జాతీయ పార్టీ పేరును ప్రకటించిన కొన్ని గంటల్లోనే పేరు మార్చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli dayakar rao). భారత్ రాష్ట్ర సమితి పేరును టీఆర్ఎస్‌ అధ్యక్షుడు ఖరారు చేస్తే ఆయన ఓ పబ్లిక్ మీటింగ్‌లో పేరు మర్చిపోయి ఆల్రెడీ ఉన్న మరో జాతీయ పార్టీ పేరును కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉందని చెప్పడంపై నెటిజన్లే(Netizens)కాదు విపక్షాల నేతలు సైతం సెటైర్లు వేసుకుంటున్నారు. పార్టీ నాయకులు అందులో మంత్రులకే జాతీయ పార్టీ పేరు గుర్తు లేకపోవడం ఏమిటని విమర్శిస్తున్నారు. ఎర్రబెల్లి దసరా రోజు చేసిన వ్యాఖ్యలనే సోషల్ మీడియా(Social media)లో షేర్ చేస్తున్నారు. అవే మాటలు ఇప్పుడు వైరల్‌(Viral)గా మారాయి.

KCR: కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్ చేయడం లేదా ?.. ఆ మాటలకు అర్థమేంటి ?

నోరు జారిన మంత్రి..

తెలంగాణ సీఎం కేసీసీఆర్ దసరా రోజున జాతీయ పార్టీ పేరును ప్రకటించారు. తెలంగాణ భవన్‌ వేదికగా టీఆర్ఎస్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. అందులో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుతూ ఏకగ్రీవతీర్మానం చేశారు. శుభదినం రోజున దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టడాన్ని అభినందిస్తూ ఇతర పార్టీల నేతలు సైతం హైదరాబాద్‌ కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఇంత వరకు బాగానే ఉంది. కాని టీఆర్ఎస్‌ తమ జాతీయ పార్టీ పేరు భారత్ రాష్ట్ర సమితిగా మార్చినప్పటికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆ పేరు గుర్తుంచుకోలేకపోయారు. విజయదశమి రోజున వరంగల్ జిల్లాలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడే రావణాసురుడి వధతో రాముడు విజయం సాధించినట్లుగా టీఆర్ఎస్ ప్రారంభించిన జాతీయ పార్టీతో బీజేపీ పని అయిపోతుందని చెప్పారు. ఆ డైలాగ్ మధ్యలో ఆపేసి కేసీఆర్ కొత్తగా ప్రకటించిన పార్టీ ఏదంటూ ప్రజల్ని అడిగారు మంత్రి. ఇంతలో అక్కడున్న వాళ్లో ఒకరు బీఆర్ఎస్‌ అనగా మరొకరు బీఎస్పీ అన్నారు. ఆ మాటను పట్టుకొని ఎర్రబెల్లి దయాకర్‌రావు కేసీఆర్ ఇవాళే బీఎస్పీగా జాతీయ పార్టీ పేరును ప్రకటించడం సంతోషంగా ఉందని మన పార్టీ ఇకపై జాతీయ రాజకీయాల్లో కూడా రాణిస్తుందనే నమ్మకం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.

పార్టీ పేరే గుర్తు లేదా అంటూ సెటైర్లు..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీఆర్ఎస్‌ను బీఎస్పీగా మార్చి పలకడం పెద్ద దుమారం రేపుతోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాలపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు ఎర్రబెల్లి కామెంట్స్‌ని ట్రోల్ చేస్తున్నారు. సీఎం ప్రకటించిన పార్టీ పేరు కూడా తెలియదా ..? లేక మర్చిపోయారు మంత్రి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం బీఆర్ఎస్‌ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈమేరకు పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పుపై ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అందజేయనున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Errabelli Dayakar Rao, Telangana Politics, TRS leaders

ఉత్తమ కథలు