ధాన్యం కొనుగోలు (Grain buy) అంశం రోజురోజుకీ జఠిలమవుతోందే తప్ప ఓ కొలిక్కి రావడం లేదు. కొనాలని టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే కొనబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భీష్మించుకు కూర్చుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ (TRS) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ రేపు దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఆందోళన (TRS protest in Delhi) చేయనుంది. ఈ సందర్భంగా ఎంపీ కేశవరావు (k keshava rao) మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు వాదనలతో తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని కేశవరావు అన్నారు . అందుకే ఈ నెల 11న ఢిల్లీలో నిరసనలు (TRS protest in Delhi) చేస్తున్నామని తెలిపారు. బాయిల్డ్ రైస్‌కు కూడా విదేశాలలో డిమాండ్ వుందని ఆయన చెప్పారు. కానీ ప్రజలను కేంద్ర ప్రభుత్వం (Central Government), మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారని కేకే ఆరోపించారు.
కేంద్రం కక్ష కట్టింది..
వరి పండించిన రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా కేశవరావు కోరారు. తెలంగాణలో వచ్చే రబీలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు (Paddy procurement) చేయాలని డిమాండ్ చేశారు. మాపై కత్తి పెట్టి అగ్రిమెంట్ (Agreement) చేశారని ఆయన ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులను కోరామని.. రైతులకు సాయం చేయాల్సిన అవసరం వుందని కేకే చెప్పారు. కేంద్రం ఫాసిస్ట్ పద్ధతిలో వ్యవహరిస్తోందని.. తెలంగాణ రైతాంగంపై కేంద్రం కక్ష కట్టిందని ఎంపీ కేశవరావు ఆరోపించారు.
సామరస్యంగా పరిష్కరించుకుందాం అనుకుంటే..
తెలంగాణ (Telangana)లో పండిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే బీజేపీని ఉరికించి కొడతామని ఎంపీ రంజిత్‌రెడ్డి హెచ్చరించారు. ఢిల్లీ ధర్నా వేదిక ఏర్పాట్లను ఆయన శనివారం ఎంపీ లు కేకే, నామ నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న విధానం తోనే ఢిల్లీలో ధర్నా చేపట్టాల్సి వచ్చిందని మండిపడ్డారు. సామరస్యంగా పరిష్కరించుకుందాం అనుకుంటే కేంద్రమే పొడిగిస్తూ ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో లేదని..
రైతుల సంక్షేమం దృష్ట్యా టీఆర్ఎస్ ఉద్యమబాట చేపట్టిందన్నారు. పీయూష్ గోయల్ ధాన్యం కొనుగోలు పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతులను (Telangana farmers) అవమానపరిచే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని అలవాటు చేయాలనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో లేదని ముందే చెప్పామని, వరి వేయొద్దని రైతులను కోరామన్నారు. అయినా బీజేపీ నేతలు వరి వేయాలని కొనుగోలు చేయిస్తామని రైతులను రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు మొహం చాటేశారు అని మండిపడ్డారు. ధర్నాకు క్యాబినెట్, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిసిసిబి చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటున్నారని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.