TS POLITICS TPCC PRESIDENT REVANTH SLAMS BJP AND TRS SAYS WEST BENGAL MODEL POLITICS IN TELANGANA AK
TS Politics: తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం.. బీజేపీ ప్లాన్ అదేనన్న రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్ రహస్య స్నేహితులుని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా చేయడమే ఈ రెండు పార్టీల ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి అనేక సార్లు ఆరోపించారు.
తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోటీ పడుతున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు చూస్తే.. ఎవరికైనా ఈ విషయం అర్థమవుతోంది. ఇక ఈ రెండు పార్టీలకు పోటీ ఇచ్చి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ (Congress)పార్టీ మాత్రం అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. అంతర్గత విభేదాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆ పార్టీకి సమయం సరిపోతుందనే వాదన ఉంది. ఇదిలా తాజాగా తెలంగాణలో బీజేపీ(BJP) రాజకీయ వ్యూహంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ ముఖ్యనేత కేసీ వేణుగోపాల్‌ను కలిసి రేవంత్ రెడ్డి.. అనంతరం బీజేపీ, టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ వ్యూహంపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ, టీఆర్ఎస్ రహస్య స్నేహితులుని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా చేయడమే ఈ రెండు పార్టీల ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి అనేక సార్లు ఆరోపించారు. తాజాగా రేవంత్ రెడ్డి మరోసారి ఇదే రకమైన ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ బెంగాల్ తరహా రాజకీయం చేయాలనుకుంటోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీని ఓడించే క్రమంలో బీజేపీ అనేక వ్యూహాలను అనుసరించిందని.. ఈ క్రమంలో ఇతర విపక్షాలను రాజకీయంగా మట్టుబెట్టిందని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యే అనే వాతావరణం నెలకొనడంతో.. ఒకప్పుడు అక్కడ బలంగా ఉన్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా తెలంగాణలోనూ బీజేపీ ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతోందని.. పోటీ తమకు టీఆర్ఎస్కు మధ్యే అనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతుందని వ్యాఖ్యానించారు.
CM KCR : కేసీఆర్ వ్యూహం మారిందా? BRSకు బైబై.. TRSపైనే ఫోకస్ -20 నుంచి జిల్లాల పర్యటన!
ఇలా చేయడం ద్వారా బెంగాల్ తరహాలోనే ఇక్కడ కూడా కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలను పూర్తిగా బలహీనపర్చాలనే వ్యూహంతో ముందుకు సాగుతోందని ఆరోపించారు. ఇక్కడ మరోసారి కేసీఆర్‌కు అధికారం దక్కినా.. విపక్షాలు లేకుండా తాము మాత్రమే ఉండాలనే ప్లాన్‌తో బీజేపీ ముందుకు సాగుతోందని.. కానీ బీజేపీ ఆశలు తెలంగాణలో నెరవేరబోవని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ బెంగాల్ తరహాలో వ్యూహంతో ముందుకు సాగుతోందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.