Home /News /telangana /

TS POLITICS TPCC PRESIDENT REVANTH REDDY REVENGE ON CONGRESS LEADERS IN TELANGANA IN A DIFFERENT WAY AK

Revanth Reddy: రేవంత్ రెడ్డి రివెంజ్ స్టోరీ... ఆ నేతలకు ఆ రకంగా షాక్ ఇస్తున్నారా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana Congress: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీలో తన స్థానాన్ని కూడా పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో తనకు చెక్ చెప్పాలని ప్లాన్ చేస్తున్న నేతలపై తనదైన శైలిలో రివెంజ్ తీర్చుకుంటున్నారనే చర్చ కూడా సాగుతోంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో చేరికలు ఎంతో ప్రధానమైనవి. కొంతకాలంగా కాంగ్రెస్(Congress) పార్టీలోకి కొంతమంది నేతలు వచ్చి చేరుతున్నారు. వారిలో ఎక్కువమంది టీపీసీసీ చీఫ్ సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. వారిలో కార్పొరేటర్లు మొదలుకుని మాజీమంత్రుల వరకు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో(Elections) పోటీ చేసే అవకాశం వస్తుందనే నమ్మకంతోనే ఈ నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారనే టాక్ ఉంది. అయితే ఈ చేరికల ద్వారా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీలోని అనేక మంది నేతలకు ఊహించని షాక్ ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో పార్టీలో చేరుతున్న నేతలు.. ఇతర నేతలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ సాగుతోంది.

    అయితే కొద్దిరోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు నేతలు రేవంత్ రెడ్డి లేకుండానే చింతన్ శిబిర్ కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజుల పాటు రంగారెడ్డి జిల్లా కీసరలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు తీర్మానాలు కూడా చేశారు. సీఎల్పీ నేతల భట్టి విక్రమార్క ఈ కార్యక్రమం ఏర్పాటులో కీలక పాత్ర పోషించగా... శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి సహా పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే తాను లేని సమయంలో తన ప్రాధాన్యత తగ్గించేలా కొందరు నేతలు ఈ రకంగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి భావించినట్టు సమాచారం.



    అందుకే కాంగ్రెస్‌లో కొందరు నేతలు చేరుతున్న విషయంలో ఆయన ఇతర నేతలకు సమాచారం ఇవ్వడం లేదని.. పార్టీలో చేరుతున్న నేతలు సైతం ఇతర నేతలను పట్టించుకోవడం లేదనే చర్చ సాగుతోంది. నిజానికి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లోని అనేక మంది సీనియర్ నేతల నుంచి పెద్దగా సహకారం లభించడం లేదనే వాదన ఉంది. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. ఆయనపై అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు కొంతమంది నేతలు ఎప్పటికప్పుడు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి వీటిని తట్టుకుని నిలబడుతూ ముందుకు సాగుతున్నారు.

    Eatala Rajender : ఈటల రాజేందర్‌కు భారీ షాక్.. ఆ భూములు పంచేశారు!

    Telangana Politics: బీజేపీలోకి మాజీ ఎంపీ..? పార్టీ వ్యవహారాల ఇన్​ఛార్జి తరుణ్​చుగ్​తో భేటీ..

    కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీలో తన స్థానాన్ని కూడా పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో తనకు చెక్ చెప్పాలని ప్లాన్ చేస్తున్న నేతలపై తనదైన శైలిలో రివెంజ్ తీర్చుకుంటున్నారనే చర్చ కూడా సాగుతోంది. పార్టీలో చేరికల సమయంలో ఇతర నాయకులకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా చేయడం కూడా ఇందులో భాగమే అని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయంలో రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాలు అమలు చేస్తూ ఇతర నేతలపై రివెంజ్ తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Revanth Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు