హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR Meets Kumaraswamy: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ.. వైరల్​గా రేవంత్ రెడ్డి కామెంట్స్​

CM KCR Meets Kumaraswamy: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ.. వైరల్​గా రేవంత్ రెడ్డి కామెంట్స్​

సీఎం కేసీఆర్​తో కుమారస్వామి భేటీపై రేవంత్​

సీఎం కేసీఆర్​తో కుమారస్వామి భేటీపై రేవంత్​

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, దేవేగౌడ కుమారుడు కుమారస్వామి తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కావడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  స్పందించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, దేవేగౌడ కుమారుడు కుమారస్వామి (former Karnataka Chief Minister Kumaraswamy) తో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) భేటీ కావడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC President Revanth Reddy) స్పందించారు. ఆదివారం రేవంత్​ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ (Modi) ఇచ్చిన సుపారీతో కేసీఆర్ యూపీఏను అధికారంలోకి రాకుండా ప్లాన్ చేస్తున్నాడని అన్నారు. ‘తీసేసిన నాయకులు.. ఎవరు ఎవరిని కలిస్తే ఏముంది.. సార పాతదే.. సీసా కొత్తదేమో అంతేగా.. మోదీ ఇచ్చిన సుపారితో... యూపీఏకు (UPA) అధికారం రాకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారు.. అందుకే కేసీఆర్ బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా ఉన్నవారిని కలవడు.. కాంగ్రెస్ లో ఉన్న నాయకులను మాత్రమే కలుస్తాడు..’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

    అస్సాం సీఎం రావడమేంటి?

    కేసీఆర్​ తన అవినీతిని బయటకు రానివ్వకుండా దృష్టి మళ్లిస్తున్నాడని రేవంత్​  విమర్శించారు. దేశంలో మూడోసారి బీజేపీ , రాష్ట్రంలో కేసీఆర్ (KCR) రావాలని.. కేసీఆర్ ప్లాన్ అని టీపీసీసీ చీఫ్​ ఆరోపించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత అక్కడ నిమజ్జనం వదిలేసి.. ఇక్కడకు రావడమంటే? చిల్లర రాజకీయాలు ఇవి రేవంత్​ దుయ్యబట్టారు. బీజేపీ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతినేలా చూస్తున్నారని రేవంత్​ ఆరోపించారు.

    50 రోజు తెలంగాణకు రాహుల్..

    హిందువుల ఓట్లు బీజేపీకి, క్రిస్టియన్లు..ముస్లిం ఓట్లు టీఆర్ఎస్ కు పడాలని ప్లాన్.. ఒకరికి ఒకరు సహకారించుకుంటున్నారు అని ఆరోపించారు రేవంత్​. భారత్ జోడో యాత్ర 50వ రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని  తెలిపారు రేవంత్ రెడ్డి.

    కేసీఆర్ మాటలు చాలా తియ్యగా ఉంటాయని.. చేతలు మాత్రం కఠిక చేదుగా ఉంటాయని  రేవంత్ రెడ్డి చెప్పారు. వీఆర్ఏల జీతాలు, జీవితాలు ఉద్ధరిస్తానని 2020 సెప్టెంబర్ 9న అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారన్న రేవంత్ రెడ్డి... చచ్చినా’ కేసీఆర్ మాటమీద నిలబడడని మరోసారి రుజువైందని ఆరోపించారు. ఇటీవల వీఆర్ఏలు చేపట్టిన ఆందోళన 48 రోజులకు చేరుకుంది. ఈ నిరసనలో భాగంగా 28మంది గ్రామ సహాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న కారణంలో ఆందోళనతో నిరసన చేపట్టిన వీఆర్ఏలకు.. గౌరవ వేతనం నిలిపివేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    Telangana: రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీ చెయ్​.. షర్మిలకు మంత్రి సవాల్​

    వీఆర్‌ఏల సమస్యల పరిష్కారం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ శేషాద్రి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదని మండిపడ్డారు రేవంత్​. అసెంబ్లీ సాక్షిగా 2020, సెప్టెంబర్ 9న మీరు హామీ ఇచ్చి సరిగ్గా రెండేళ్లు దాటింది. “ఇకపై వీఆర్వోలు ఉండరు. విద్యార్హతలు కలిగిన వీఆర్‌ఏలకు పే స్కేల్‌అమలు చేస్తాం. ఉన్నత విద్యార్హతలు ఉన్న వారికి పదోన్నతులు కల్పిస్తాం. 55 ఏళ్లు నిండితే వారి పిల్లలకు వారసత్వంగా వీఆర్‌ఏలుగా అవకాశం కల్పిస్తాం…” అంటూ  హామీలు గుప్పించారని మండిపడ్డారు రేవంత్​

    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Hd kumaraswamy, Hyderabad, Politics, Revanth Reddy

    ఉత్తమ కథలు