Home /News /telangana /

TS POLITICS TPCC PRESIDENT REVANTH REDDY PLAN OF JOININGS WILL TROUBLE CONGRESS IF OTHER LEADERS FOLLOW HIM AK

Congress: రేవంత్ రెడ్డి వ్యూహాలు బెడిసికొడతాయా ? అంతా అలా చేస్తే.. కాంగ్రెస్‌లో ఏం జరగనుంది?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: కాంగ్రెస్‌లో కొనసాగుతున్న చేరికలు కారణంగా ఆ పార్టీ బలపడటం సంగతి పక్కనపెడితే.. పార్టీలో కొత్త పంచాయతీ మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

    తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలం సందడి కనిపిస్తోంది. ఇందుక ప్రధాన కారణం ఆ పార్టీలో చేరికలు మొదలుకావడమే. మాజీ ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వీరిలో ఎక్కువమంది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో (Congress) చేరుతున్న నేతలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం గ్యారంటీ అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో జరుగుతున్న చేరికలు.. కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీకి తెరలేపుతున్నాయా ? అనే టాక్ కూడా మొదలైంది. ఇందుకు ప్రధాన కారణం.. కాంగ్రెస్‌లోని ఇతర నాయకులు కూడా కొందరు నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకురావడమే.

    కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో తుంగతుర్తి నేత వడ్డేపల్లి రవి కాంగ్రెస్‌లో చేరారు. దీనిపై తుంగతుర్తిలో గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అద్దంకి దయాకర్(Addanki Dayakar) ఆగ్రహంగా ఉన్నారు. మల్లు భట్టి విక్రమార్క కొందరు నేతలను తన సమక్షంలో కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. దీంతో అసలు చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ సరైన ప్రణాళికతో ముందుకు సాగుతోందా ? ఎవరికి తోచిన విధంగా వాళ్లు చేరికలను ప్రొత్సహిస్తున్నారా ? అనే వాదన మొదలైంది. మరోవైపు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్న వారి కారణంగా.. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది.



    కొత్తగా వచ్చే నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలోనే పార్టీ తీర్థం పుచ్చుకుంటుండటంతో.. వారికి టికెట్‌పై స్పష్టమైన హామీ ఇస్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు కాంగ్రెస్‌లో చేరికల కోసం వేసిన కమిటీతో సంబంధం లేకుండా నేతలు చేరికలను ప్రోత్సహిస్తుండటంతో.. ఇతర నేతలు కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డితో పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల కాంగ్రెస్‌లో తాము కూడా బలమైన నేతలమే అనే సంకేతాలు ఇవ్వాలని భావిస్తున్నారు.

    Gajwel : హరీశ్‌ రావును పరేషాన్ చేసిన బీహారీ కూలీలు.. గజ్వేల్‌లో ఇంట్రెస్టింగ్ సీన్

    TRS| KCR: కేసీఆర్‌లో ఊహించని మార్పు.. కొద్దిరోజుల వ్యవధిలోనే.. అసలు కారణం అదేనా ?

    ఈ రకంగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న చేరికలు కారణంగా ఆ పార్టీ బలపడటం సంగతి పక్కనపెడితే.. పార్టీలో కొత్త పంచాయతీ మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలు మాత్రమే చేరికలను ప్రొత్సహిస్తున్నా.. రాబోయే రోజుల్లో జగ్గారెడ్డి వంటి ఇతర నేతలు కూడా ఎవరికి వాళ్లు సొంతంగా ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే.. కాంగ్రెస్‌కు బలంగా మారాల్సిన నాయకుల చేరికలు కాస్త.. ఆ పార్టీలో కొత్త పంచాయతీకి కారణమయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ జోరుగా సాగుతోంది. మరి.. చేరికల విషయంలో కాంగ్రెస్‌లో మొదలైన రగడకు ఎవరు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Revanth Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు