Home /News /telangana /

TS POLITICS TPCC PRESIDENT REVANTH REDDY NEW PLAN TO HANDLE SENIORS IN TELANGANA CONGRESS AK

Revanth Reddy: రేవంత్ రెడ్డి నిజంగానే మారిపోయారా ?.. లేక ప్లాన్ మార్చారా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: తనను అవమానించే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలు, అప్పుడు సభలో ఉండి చూస్తూ ఉండిపోయిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పాలని కొద్దిరోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయాలు దూకుడుగా ఉంటాయి. ఏ పదవిలో ఉన్నా.. ఆయన అదే రకమైన దూకుడుతో ముందుకు సాగుతుంటారు. ఫలితాలు ఏ విధంగా ఉన్నా.. ఆయన తన శైలిని పెద్దగా మార్చుకోబోరని చాలామంది చెబుతుంటారు. టీపీసీసీ చీఫ్ అయిన తరువాత కూడా రేవంత్ రెడ్డి (Revanth Reddy) అదే రకమైన వ్యవహారశైలిని కొనసాగిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో (Congress) ఈ రకమైన తీరు సరికాదని.. ఆయన తన పద్ధతి మార్చుకోవాలని సీనియర్లు పలుసార్లు చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు ఇదే అంశంపై పలువురు నేతలు ఫిర్యాదు కూడా చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తన తీరు తనదే అన్నట్టుగా ముందుకు సాగిపోతున్నారు. కానీ ఇటీవల మరో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat reddy) వ్యవహారంలో రేవంత్ రెడ్డి అనుసరించిన తీరుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    తనను అవమానించే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలు, అప్పుడు సభలో ఉండి చూస్తూ ఉండిపోయిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పాలని కొద్దిరోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఆయన డిమాండ్‌ను రేవంత్ రెడ్డి పట్టించుకోరని చాలామంది అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి తప్పు జరగదని ఆయనకు వివరించారు.



    అయితే రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు కారణం ఏంటన్న దానిపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి మెల్లిమెల్లిగా మారుతున్నారని.. అందుకే ఈ రకంగా క్షమాపణలు చెప్పారని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడం వెనుక మరో వ్యూహం కూడా ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు తాను దూరంగా ఉంటానని ప్రకటించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెబితే.. అక్కడ ప్రచారానికి వచ్చే విషయాన్ని ఆలోచిస్తానని అన్నారు.

    Telangana : TRS ఎమ్మెల్యే కూతురు పెళ్లికి ఆన్‌లైన్‌లో కట్నాలు వసూలు .. వైరల్ అవుతున్న వాట్సాప్‌ మెసేజ్

    Revanth Reddy : కాంగ్రెస్‌ను ఎవరూ వీడొద్దు .. లీడర్స్ , క్యాడర్‌ని రిక్వెస్ట్ చేస్తున్న రేవంత్‌రెడ్డి వీడియో ఇదే

    తాజాగా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో.. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఇదంతా రేవంత్ రెడ్డి ఓ వ్యూహంలో భాగంగానే చేశారని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తేనే.. తనకు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర మంచి మార్కులు పడతాయని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. ఇందుకోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్నీ చేస్తున్నారనే భావన ఉంది. ఇందులో భాగంగానే ఆయన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సారీ చెప్పారనే చర్చ కూడా సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Revanth Reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు