Home /News /telangana /

TS POLITICS TPCC PRESIDENT REVANTH REDDY BIG SUCCESS IN RAHUL GANDHI TELANGANA TOUR AND HIS COMMENTS ON TRS AK

Revanth Reddy: రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారా ?.. వాళ్లందరికీ ఊహించని షాక్ ఇచ్చారా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: వరంగల్ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో తమకు టీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

    తెలంగాణ కాంగ్రెస్ సారథిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ నేతలు తన విషయంలో ఎప్పటికప్పుడు అసంతృప్తిని, పలుసార్లు సహాయ నిరాకరణ చేస్తున్నప్పటికీ.. ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో మళ్లీ కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో కీలకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి.. ఆయన దగ్గర మంచి మార్కులు సాధించారని కాంగ్రెస్‌లో టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. రాహుల్ గాంధీ సభ విషయంలో రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారనే చర్చ ఇటు కాంగ్రెస్, అటు రాజకీయవర్గాల్లో సాగుతోంది.

    వరంగల్ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో తమకు టీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆ పార్టీతో పొత్తు అనే అంశాన్ని మాట్లాడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. సాధారణంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) టీఆర్ఎస్‌తో పొత్తు విషయంలో ఈ స్థాయిలో స్పందిస్తారని ఎవరూ ఊహించలేదు. తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని చెప్పడం వరకే ఆయన పరిమితమవుతారని అంతా అనుకున్నారు. కానీ ఈ విషయంలో రాహుల్ గాంధీ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఈ వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ విషయంలో కఠినంగా ముందుకు వెళ్లాలని.. ఆ పార్టీతో ఏ రకమైన సంబంధాలు కాంగ్రెస్ పార్టీకి ఉండబోవని కచ్చితంగా చెబితేనే తెలంగాణలో(Telangana) పార్టీ బలోపేతం అవుతుందని రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి సూచించారని సమాచారం. నిజానికి కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్‌ను విమర్శించే నాయకులు చాలామంది ఉన్నా.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్థాయిలో టీఆర్ఎస్‌ను వ్యతిరేకించే నాయకుల సంఖ్య మాత్రం పెద్దగా లేదనే వాదన ఉంది.

    TS Politics: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్త పార్టీ ఆలోచనలో ఉన్నారా ?.. ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ?

    Telangana Amit Shah: మారిన బీజేపీ ప్లాన్.. రాహుల్ గాంధీకి ఆ రకంగా కౌంటర్ ఇవ్వనున్న అమిత్ షా ?..

    కేసీఆర్ కారణంగా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్‌, కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్, కాంగ్రెస్ మళ్లీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని వచ్చిన వార్తలు రేవంత్ రెడ్డిని ఇబ్బందిపెట్టాయి. అలాంటి పరిస్థితి ఉండదని రేవంత్ రెడ్డి కుండబద్ధలు కొట్టారు. తాజాగా రాహుల్ గాంధీ ద్వారా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయించి మరోసారి అనుకున్నది సాధించారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Revanth Reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు