TS POLITICS TPCC CHIEF REWANT REDDY LETTER TO HEALTH MINISTER HARISH RAO URGES NIMS TO MAKE CONTRACT NURSES PERMANENT SNR
Hyderabad:నిమ్స్ కాంట్రాక్ట్ నర్సులకు న్యాయం చేయండి..మినిస్టర్‌కి టీపీసీసీ చీఫ్ లేఖ
(ప్రతీకాత్మకచిత్రం)
Telangana:నిమ్స్‌లో కాంట్రాక్ట్ నర్సులు ధర్నాకు దిగారు. తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ గత వారం రోజులకుపైగా ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వెంటనే కాంట్రాక్ట్ నర్సుల సమస్యలు పరిష్కరించేలా చూడమని హెల్త్ మినిస్టర్ హరీష్‌రావుకు లేఖ రాశారు.
తెలంగాణ(Telangana)లో గాంధీ ఆసుపత్రి తర్వాత మరో అతిపెద్ద హాస్పిటల్ నిమ్స్(Nims). నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆధునీకరించినప్పటికి ఇక్కడ పని చేస్తున్న వందలాది మంది కాంట్రాక్ట్ నర్సులు (Contract nurses)మాత్రం తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పబ్లిక్ సర్వీస్ చేస్తున్న తమను పర్మినెంట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమ్స్‌లోని సుమారు 423మంది కాంట్రాక్ట్ నర్సులు గత వారం రోజులకుపైగా ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేపడుతున్నారు. తమను పర్మినెంట్ (Permanent)చేయకపోవడం వల్ల చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలి చాలని జీతాలు, ప్రసూతి సెలవులు ఇవ్వకపోవడం వంటి సమస్యలను వారు ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకొచ్చారు. కరోనా (corona)కష్ట సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించినందుకు ప్రభుత్వం తమకు ఏం మేలు చేసిందని ప్రశ్నిస్తున్నారు. మహిళలకు ఇచ్చే మెటర్ననిటీ లీవ్ (Maternity leave) ని కూడా ఇవ్వడం లేదంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించమని ఆందోళన చేపడితే ప్రభుత్వం షోకాజ్ నోటీసులు (Showcase notices)ఇవ్వడంపై మండిపడుతున్నారు కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న నర్సులు. పర్మినెంట్ నర్సులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికి ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపడం లేదంటున్నారు. కనీసం 8రోజులుగా ఆందోళన చేస్తుంటే తమ గురించి ప్రభుత్వం కాని నిమ్స్ యాజమాన్యం కాని చర్చలకు పిలిసింది లేదని..డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రకటన చేయలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ నర్సులకు నిమ్స్‌లో రెగ్యులర్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సులు మద్దతు తెలిపారు. వాళ్ల డిమాండ్లు పరిష్కరించతగినవని..వాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
కాంట్రాక్ట్ నర్సుల పక్షాన..
నిమ్స్‌లో ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ నర్సల సమస్యలు పరిష్కరించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుకు లేఖ రాశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సరిసమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ నర్సుల కనీస సమస్యలు పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. పేదలకు వైద్య సేవలందించడంలో నర్సులే కీలక పాత్ర పోషిస్తారనే విషయం ప్రభుత్వానికి తెలియకపోవడం విచారకరమన్నారు. నర్సులు విధులు బహిష్కరించి ధర్నా చేపడితే దాని ప్రభావం పేద రోగులపై పడుతుందని సూచించారు రేవంత్‌రెడ్డి. మెటర్నిటీ లీవుల దగ్గర నుంచి జీతం వరకూ అన్నింటిలో కోత పెడుతూ ఇబ్బందులకు గురి చేయడం సరికాదని లేఖ ద్వారా పేర్కొన్నారు. కాంట్రాక్ట్ నర్సులు న్యాయపరమైన డిమాండ్ల కోసం ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తుంటే నిమ్స్ యాజమాన్యం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఇప్పటి వరకూ స్పందించకపోవడం బాధాకరమని లేఖలో పేర్కొన్నారు.
న్యాయం చేయండి మంత్రిగారు..
కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న తమను ప్రతి ఆరు నెలలకు ఒకసారి విధుల నుండి తొలగించి మళ్లీ తీసుకుంటున్నారని... దీని వల్ల సీనియారిటీ కోల్పోతున్నామని కాంట్రాక్టు నర్సులు చేసిన ఆరోపణలను లేఖలో మంత్రికి వివరించారు రేవంత్‌రెడ్డి. నిమ్స్‌లో ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ నర్సుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. హెల్త్ మినిస్టర్ హరీష్‌రావు స్వయంగా నిమ్స్‌కి వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ పద్దతిలో ఉన్న నర్సులను పర్మినెంట్ చేయాలని లేఖ ద్వారా మంత్రికి విజ్ఞప్తి చేశారు రేవంత్‌రెడ్డి. నిమ్స్‌లో కాంట్రాక్ట్ నర్సుల సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. వాళ్లకు ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.