హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth Reddy: కేసీఆర్ జాతీయ పార్టీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy: కేసీఆర్ జాతీయ పార్టీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి (Photo Credit:Twitter)

రేవంత్ రెడ్డి (Photo Credit:Twitter)

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైవు మునుగోడు ఉపఎన్నిక, మరోవైపు కేసీఆర్ కొత్త పార్టీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైవు మునుగోడు ఉపఎన్నిక, మరోవైపు కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాష్ట్రానికి చేరుకోవడం. ఈ పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు  తలపిస్తున్నాయి. దసరా సందర్బంగా కేసీఆర్ జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా అధికారికంగా ప్రకటించారు. కేసీఆర్ కొత్త పార్టీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా టీపీసీసీ చీఫ్ కేసీఆర్ జాతీయ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

  కేసీఆర్ కొత్త పార్టీ పెట్టడం ఓ దుర్మార్గపు ఆలోచన. ఆయనకు తెలంగాణలో పోటీ చేయడానికి అర్హత లేదు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కు ఋణం తీరిపోయింది. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారు. 2001 నుండి 2022 వరకు కేసీఆర్ ఆర్ధికంగా బలోపేతమయ్యారు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి కొత్త పార్టీ తెచ్చారు. ఆ తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని పేరు పెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

  వినాశకాలే విపరీత బుద్ది అన్నట్టు కేసీఆర్ వ్యవహారం ఉంది. కేవలం కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశతోనే జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. తెలంగాణ అనే పదాన్ని కేసీఆర్ చంపేయాలనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజల జీవనంలో ఆ పదం ఓ భాగమని అన్నారు. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. నేను దసరా జమ్మి చెట్టు పూజల్లో కాగితంపై రాసి వుంచుతాను మీరు కూడా అలాగే చేసి దేవుడిని కోరుకోండని పిలుపునిచ్చారు.

  టీపీసీసీ చీఫ్ ఎన్నిక తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అవినీతిని ఎండగడుతూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అలాగే వీలు దొరికినప్పుడు ప్రజలతో నిత్యం మమేకమై ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ సమక్షంలో పలువురు TRS, BJP నాయకులూ హస్తం గూటికి చేరారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ బలం పెరుగుతూ వస్తుంది.

  ఇక ఇప్పటికే మునుగుడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతికి టికెట్ కేటాయించి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రచారంలో పాల్గొంటారా అనేది సస్పెన్స్ గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ బ్రాండ్. కానీ ఇప్పుడు ఇద్దరు వేరు వేరు పార్టీలలో ఉండడంతో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. కాగా మునుగోడు గెలుపుపై కాంగ్రెస్ గంపెడు ఆశలు పెట్టుకుంది.

  Published by:Rajasekhar Konda
  First published:

  ఉత్తమ కథలు