హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth Reddy: "మీకర్థమవుతోందా..పరువు గల కేటీఆర్ గారూ!"..పేపర్ లీక్ పై రేవంత్ సంచలన ట్వీట్

Revanth Reddy: "మీకర్థమవుతోందా..పరువు గల కేటీఆర్ గారూ!"..పేపర్ లీక్ పై రేవంత్ సంచలన ట్వీట్

కేటీఆర్, రేవంత్

కేటీఆర్, రేవంత్

Revanth Reddy: TSPSC పేపర్ లీక్..తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదిలిందా? మీకర్థమవుతోందా కేటీఆర్ అంటూ రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Revanth Reddy: తెలంగాణలో టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ లీకేజీలో ప్రభుత్వ నిర్లక్ష్యం, మంత్రి కేటీఆర్ హస్తం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ క్రమంలోఆ ఆరోపణలకు  సంబంధించిన ఆధారాలు అప్పగించాలని సిట్ వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు వారిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ అన్నారు. ఇక ఈ అంశంపై ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ లీగల్ నోటిసుల పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ కు రూ.100 కోట్లు ఇస్తే అమ్మ నా బూతులు తిట్టొచ్చా అని ప్రశ్నించారు.

కేటీఆర్ పరువు రూ.200 కోట్లు నిర్ధారించుకున్నాడా? అని సెటైర్లు వేశారు. ఈ క్రమంలో హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత ప్రస్తావన తెస్తూ కేటీఆర్ ఏమైనా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్లా లేక సమంత సిరీస్ కు సంతకం పెట్టినట్లా అని ఎద్దేవా చేశారు. ఇక పేపర్ లీక్ అంశాన్ని సిట్టింగ్ జడ్జితో విచారించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.. ఇక తాజాగా రేవంత్ ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. TSPSC పేపర్ లీక్.. తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదిలిందా? విచారణలో ‘బావ’లో సీఎంఓలో బావమరిది…? మీకర్థమవుతోందా…పరువు గల కేటీఆర్ గారూ…! అంటూ రేవంత్ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్  గా మారింది. అయితే రేవంత్ ట్వీట్ వెనక పెద్ద చర్చ నడుస్తుంది. Tspsc సభ్యుల్లో ఒకరైన లింగారెడ్డి ఫోటోతో కూడిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 

పేపర్ లీక్ కేసులో లక్షల రూపాయలు చేతులు మారాయని..హవాలా కోణం  ఉందని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వం 10 లక్షల మంది నిరుద్యోగులతో ఆటలు ఆడుతుందని..మనుషుల వేషంలో మృగాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని దుయ్యబట్టారు. నియామక ప్రక్రియ జాగ్రత్తగా చేయాలని..ఇంత జరిగినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని రేవంత్ అన్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై సిట్ నోటీసులు ఇస్తుందని..అలాగే అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. TSPSC కార్యాలయంలో కాన్ఫిడెన్షియల్ రూమ్ కు ఎవరికీ ప్రవేశం ఉండదని..అలాగే కంప్యూటర్ కు సంబంధించి యూజర్ ఐడి, పాస్ వర్డ్ ఉంటాయి.

CM KCR: సీఎం కేసీఆర్ ఎమోషనల్..జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశా అంటూ..

కానీ చైర్మన్ కు, సెక్రటరీకి తెలియకుండా ఆ రూంలోకి ఎవరూ వెళ్లలేరన్నారు. కాన్ఫిడెన్షియల్ రూం ఇంఛార్జి శంకరలక్ష్మిని విట్ నెస్ కింద కాకుండా నిందితురాలిగా చేర్చాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు కేసులను విచారించిన సిట్ నీరు గార్చిందన్నారు. మరి రేవంత్ వ్యాఖ్యలు, ట్వీట్ నేపథ్యంలో కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

First published:

Tags: KTR, Revanth Reddy, Telangana, TSPSC

ఉత్తమ కథలు