సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌తో (bandla ganesh) టీపీసీసీ (tpcc) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (revanth reddy) భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం బండ్ల గణేశ్ నివాసానికి వెళ్లిన రేవంత్ దాదాపు 2 గంటలపాటు ఆయనతో చర్చించారు.
టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌తో (Bandla ganesh) టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (TPCC Chief Revanth reddy) భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం బండ్ల గణేశ్ నివాసానికి వెళ్లిన రేవంత్ దాదాపు 2 గంటలపాటు ఆయనతో చర్చించారు. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాంగ్రెస్ (Congress)లోనే వున్నప్పటికీ గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న గణేశ్‌ను .. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బండ్ల గణేశ్ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసక్తి చూపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ (Congress party) టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. అప్పటి నుంచి బండ్ల గణేష్ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు రాజకీయాలకు సంబంధించిన అంశాలపై స్పందిస్తూ.. ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు . కానీ, ఎక్కడా రాజకీయ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనలేదు. దీంతో బండ్ల గణేశ్‌ను యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Had a wonderful meeting with our @revanth_anumula anna in my house eagerly waiting to work under your leadership we all love you anna ???????? pic.twitter.com/46EMEB2ygx
కాంగ్రెస్ (Congress)లో చేరిన అనంతరం పార్టీ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో కొంత అసంతృప్తికి లోనయ్యారు బండ్ల. ఆ మధ్యలో బ్లేడ్ వ్యవహారం కూడా ఆయనను చాలా ఇబ్బంది పెట్టింది. దీంతో కొంతకాలంగా బండ్ల గణేష్ రాజకీయాలకు అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. సినిమా, ఇతర అవార్డులు ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నా.. పొలిటికల్ మీటింగ్‌లకు పెద్దగా వెళ్లలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి పార్టీ అభిమానులను, ప్రముఖులను అందరిని కూడగట్టే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా బండ్ల గణేష్‌కు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల కోసం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేసేందుకు బండ్ల గణేష్ పూర్తి స్థాయిలో కసరత్తు చేసే విధంగా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
బండ్ల గణేశ్ (Bandla Ganesh) ఇంట్లో రేవంత్ రెండు గంటల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపిన తరువాత ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. బండ్ల గణేష్ పార్టీకి అందించే సేవల నేపథ్యంలో పార్టీ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు వ్యూహరచన చేసినట్లు సమాచారం. సినిమాల పరంగా కొంత బిజీగా ఉన్న బండ్ల గణేష్ మరో రెండు నెలల పాటు ఇండస్ట్రీకి సంబంధించి తన కార్యక్రమాలు పూర్తిచేసుకుని పార్టీకి పక్కా సమయం కేటాయించే విధంగా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తను మొదటి నుంచి కాంగ్రెస్ వాదిగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే పూర్తి స్థాయిలో కొనసాగుతానని రేవంత్ రెడ్డికి బండ్ల గణేష్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలకు ఆయన హాజరు కాబోతున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి వెంట కిరణ్ రెడ్డి, రోహిన్ రెడ్డి ఉన్నారు
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.